భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ సరికొత్త చరిత్రను సృష్టించాయి. బ్యాంక్, ఆటో, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్ షేర్లలో బలమైన కొనుగోళ్లు సూచీలను పెంచడంతో సెన్సెక్స్ 85,762 వద్ద ముగిసింది, నిఫ్టీ 26,328 వద్ద ఆల్-టైమ్ హై నమోదు చేసింది. ముఖ్యంగా ట్రేడింగ్ సమయంలో నిఫ్టీ 26,330 స్థాయిని తాకి నూతన రికార్డు సృష్టించింది.
Read also: Bharat Taxi: నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం
The stock markets closed with gains
బ్యాంకింగ్ రంగంలో కొనుగోళ్ల జోరు కొనసాగడంతో బ్యాంక్ నిఫ్టీ కూడా 60,152.35 వద్ద సరికొత్త జీవితకాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 1.78 శాతం లాభంతో అగ్రస్థానంలో నిలిచింది. ఆటో, మెటల్, రియల్టీ, పవర్ రంగాలు సుమారు 1 శాతం చొప్పున లాభపడ్డాయి, అయితే ఎఫ్‌ఎంసీజీ రంగం 1.15 శాతం నష్టపోయింది.
రూపాయి విలువ 90 మార్కును దాటి బలహీనపడింది. దేశీయ ఆర్థిక స్థిరత్వం, వాహన విక్రయాల గణాంకాల సానుకూలత, రాబోయే కార్పొరేట్ ఫలితాలపై మంచి అంచనాలు పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పెంచుతున్నాయి. నిఫ్టీ 26,300 పైన నిలకడగా కొనసాగితే ర్యాలీ 26,500–26,700 వరకు చేరే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: