ప్రభుత్వం విడుదల చేసిన వార్షిక ఆర్థిక సర్వే స్టాక్ మార్కెట్‌కు బలాన్నిచ్చింది. దేశ ఆర్థిక వృద్ధిపై సానుకూల అంచనాలు రావడంతో ఇన్వెస్టర్లలో విశ్వాసం పెరిగింది. ఉదయం ఒడిదుడుకులు కనిపించినప్పటికీ, ట్రేడింగ్ ముగిసే సమయానికి సూచీలు లాభాల్లోకి వచ్చాయి. వరుసగా మూడో రోజు కూడా మార్కెట్లు గ్రీన్‌లో ముగియడం గమనార్హం. ఆర్థిక స్థిరత్వం కొనసాగుతుందన్న సంకేతాలు మార్కెట్‌కు బూస్ట్ ఇచ్చాయి.
Read also: Hybrid ATM: ఇకపై ఏటీఎంలో రూ. 500 ఇస్తే 10, 20 రూపాయల నోట్లు వస్తాయి!
The stock markets closed with gains
సెన్సెక్స్ – నిఫ్టీ లాభాల పరుగు
ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ (sensex) 221.6 పాయింట్లు పెరిగి 82,566.37 వద్ద స్థిరపడింది. అదే సమయంలో నిఫ్టీ 76.15 పాయింట్లు లాభపడి 25,418.90కి చేరింది. 2026–27 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 6.8 నుంచి 7.2 శాతం మధ్య ఉంటుందని సర్వే అంచనా వేసింది. అలాగే ద్రవ్యలోటు 4.4 శాతం లక్ష్యానికి చేరుకుంటుందన్న విశ్లేషణ మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచింది. దీర్ఘకాల పెట్టుబడులపై ఇన్వెస్టర్లు మరింత ఆసక్తి చూపించారు.
మెటల్ షేర్ల జోరు – రూపాయి బలహీనత
ఈ సెషన్‌లో మెటల్, ఇన్‌ఫ్రా రంగాల షేర్లకు భారీగా కొనుగోళ్లు కనిపించాయి. టాటా స్టీల్, ఎల్‌అండ్‌టీ, యాక్సిస్ బ్యాంక్, ఎన్‌టీపీసీ షేర్లు 4.5 శాతం వరకు పెరిగాయి. మరోవైపు ఐటీ, ఎఫ్‌ఎంసీజీ రంగాల్లో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. సాంకేతికంగా నిఫ్టీకి 25,300 వద్ద మద్దతు ఉండగా, ఈ స్థాయి నిలిస్తే 25,600–25,800 వరకు వెళ్లే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. యూనియన్ బడ్జెట్ అంచనాలతో రూపాయి డాలర్‌తో పోలిస్తే 91.94 వద్ద బలహీనంగా ట్రేడ్ అయింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: