📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Stock Market: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Author Icon By Rajitha
Updated: December 29, 2025 • 5:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు నష్టాల్లో ముగిశాయి. సోమవారం ట్రేడింగ్‌లో ఐటీ, రియల్టీ, ఫార్మా, ఆటో షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఎక్కువగా కనిపించింది. ట్రేడింగ్ ముగిసే సమయంలో సెన్సెక్స్ (sensex) 345.91 పాయింట్లతో క్షీణించి 84,695.54 వద్ద నిలిచింది. నిఫ్టీ కూడా 100.20 పాయింట్ల నష్టంతో 25,942.10 వద్ద ముగిసింది.

Read also: VIVO: మార్కెట్లోకి వివో వి35 స్లిమ్ అల్ట్రా 5జీ

Stock Market

నెలవారీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్&ఓ) గడువు దగ్గరపడటంతో మార్కెట్లో ఒడుదొడుకులు పెరిగాయని నిపుణులు పేర్కొన్నారు. నిఫ్టీ కీలక 26,000 స్థాయిని దిగువకు దాటడం ఇన్వెస్టర్లలో ఆందోళన రేకెత్తించింది. టెక్నికల్ విశ్లేషణ ప్రకారం, అమ్మకాల ఒత్తిడి కొనసాగే అవకాశం ఉంది. నిఫ్టీ 25,900 స్థాయిని నిలబెట్టుకోలేకపోతే, 25,800–25,700 స్థాయిలకు పడే అవకాశం ఉందని సూచించారు.

సెన్సెక్స్‌లో పవర్‌గ్రిడ్, ట్రెంట్, హెచ్‌సీఎల్ టెక్, బీఎల్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. అయితే, టాటా స్టీల్, ఏషియన్ పెయింట్స్, హిందుస్థాన్ యూనిలీవర్, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్ షేర్లలో కొంత కొనుగోలు మద్దతు కనిపించింది. బ్రాడర్ మార్కెట్‌లోనూ అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 0.52 శాతం, స్మాల్‌క్యాప్ 100 0.72 శాతం పడిపోయాయి. రంగాలవారీగా ఐటీ, రియల్టీ, ఆటో సూచీలు పతనం కాగా, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్, ఎఫ్‌ఎంసీజీ సూచీలు స్వల్ప లాభాలను నమోదు చేశాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

latest news Nifty sensex stock market Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.