దేశీయ స్టాక్ మార్కెట్ (Stock market) సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. టారిఫ్‌ల కోసం ట్రంప్ విధించిన 90 రోజుల గడువు జులై 9తో ముగుస్తున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత పాటించారు. దీంతో ఆసియా మార్కెట్లు సహా మన మార్కెట్లు కూడా ఓ మోస్తరు శ్రేణిలో కదలాడాయి. చివరికి ప్రధాన సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప లాభాలకే పరిమితమయ్యాయి.
మార్కెట్ హైలైట్స్
సెన్సెక్స్ (Sensex)ఉదయం 83,685.66 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 83,606.46) స్వల్ప లాభాల్లో (Stock market) ప్రారంభమైంది. ఇంట్రాడేలో 83,572.51- 83,874.29 పాయింట్ల మధ్య చలించింది. చివరికి 90.83 పాయింట్ల లాభంతో 83,697.29 వద్ద స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 24.75 పాయింట్ల లాభంతో 25,541.80 వద్ద ముగిసింది.
డాలరుతో రూపాయి మారకం విలువ 85.51గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో బీఈఎల్, రిలయన్స్, ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. యాక్సిస్ బ్యాంక్, ట్రెంట్, ఎటర్నల్, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్ నష్టాల్లో ముగిశాయి.
అంతర్జాతీయ మార్కెట్ అప్‌డేట్
అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 66.71 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. బంగారం ఔన్సు 3,359 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
Read Also: Infosys: “ఎక్కువ పని వద్దు.. ఆరోగ్యం ముఖ్యం!”: ఇన్ఫోసిస్ కీలక