భారత్ మరియు అమెరికా మధ్య ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వాణిజ్య ఒప్పందం ఖరారు కావడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో దూసుకుపోయాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald trump) భారతీయ ఉత్పత్తులపై సుంకాలను 18 శాతానికి తగ్గిస్తామని ప్రకటించడం కీలక మలుపుగా మారింది. ఈ నిర్ణయం భారత ఆర్థిక వ్యవస్థకు మేలు చేస్తుందన్న అంచనాలతో ఇన్వెస్టర్లు భారీగా కొనుగోళ్లకు ముందుకొచ్చారు. దలాల్ స్ట్రీట్ మొత్తం సానుకూల వాతావరణంతో కళకళలాడింది.
Read also: Trade Deal Impact: సుంకాల తగ్గింపుతో ఈ రంగాలకు బిగ్ బూస్ట్..
Stock markets closed with huge gains
రికార్డు స్థాయిలో సెన్సెక్స్, నిఫ్టీ
మార్కెట్ ముగిసే సరికి సెన్సెక్స్ 2,072.67 పాయింట్లు ఎగబాకి 83,739.13 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ సూచీ 639.15 పాయింట్లు పెరిగి 25,727.55 వద్ద ముగియడం విశేషం. నిఫ్టీకి 25,500 నుంచి 25,600 వరకు కీలక మద్దతు ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. 25,900 నుంచి 26,000 స్థాయిని సమీప కాలంలో ప్రధాన రెసిస్టెన్స్‌గా అంచనా వేస్తున్నారు.
అన్ని రంగాల్లో కొనుగోళ్ల జోరు
అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్, ఇండిగో, పవర్ గ్రిడ్ వంటి హెవీవెయిట్ షేర్లు లాభాల్లో ముందున్నాయి. టెక్ మహీంద్రా మరియు బెల్ (BEL) మాత్రం స్వల్ప నష్టాలతో ముగిశాయి.
రంగాలవారీగా చూస్తే నిఫ్టీ రియల్టీ సూచీ 4 శాతానికి పైగా లాభపడింది. కెమికల్స్, ఫార్మా, కన్జూమర్ డ్యూరబుల్స్ రంగాలు 3 శాతానికి పైగా పెరిగాయి.
బలపడిన రూపాయి
డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఒక్కరోజులోనే రూ.1.28 మేర బలపడింది. ఇది దాదాపు 1.40 శాతం లాభం కాగా, 2018 తర్వాత ఇదే అతిపెద్ద ఒక్కరోజు గెయిన్. వాణిజ్య ఒప్పందం ప్రభావంతో విదేశీ పెట్టుబడులు మళ్లీ భారత్ వైపు వచ్చే అవకాశాలు పెరిగాయి. రాబోయే రోజుల్లో మార్కెట్లలో స్థిరమైన వృద్ధి కొనసాగుతుందన్న అంచనాలు బలపడుతున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: