దేశీయ స్టాక్ మార్కెట్లు (stock market) మంగళవారం భారీ లాభాల స్వీకరణ కారణంగా నష్టాలతో ముగిశాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (FII) అమ్మకాలు, రూపాయి బలహీనత, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి (RBI) సంబంధించిన పాలసీ సమావేశంపై నెలకొన్న ఆందోళనలు సూచీల పతనానికి ప్రధాన కారణమయ్యాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 503.63 పాయింట్లు తగ్గి 85,138.27 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 143.55 పాయింట్లకు కోల్పోయి 26,032.20 వద్ద ముగిసింది.
Read also: Employees: డీఏ–బేసిక్ పే విలీనం లేదన్న కేంద్రం
Stock markets closed in losses
143 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- ఉదయం సెషన్లో సెన్సెక్స్ 85,325.51 వద్ద ప్రారంభమై రోజంతా అమ్మకాల ఒత్తిడికి గురయ్యింది. ఇంట్రాడేలో కనిష్ఠ స్థాయి 85,053.0కు చేరింది.
- బ్యాంకింగ్, ఐటీ, ఫైనాన్షియల్ రంగాల షేర్లలో భారీ అమ్మకాలు చోటుచేసుకున్నాయి.
- బలహీన రూపాయి, FIIల అమ్మకాలు, RBI పాలసీపై అంచనాల మార్పు మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేశాయి.
- మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు కూడా నష్టాలతో ముగిసినప్పటికీ, పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 0.5% లాభపడింది.
- సెన్సెక్స్ బాస్కెట్లో ఐసీఐసీఐ, యాక్సిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎల్&టీ, పవర్‌గ్రిడ్, బజాజ్ ఫిన్సర్వ్, మహీంద్రా & మహీంద్రా నష్టపడ్డాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: