📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు

Latest news: Stock Market: లాభాలతో దూసుకెళ్లిన షేర్ మార్కెట్లు

Author Icon By Saritha
Updated: November 11, 2025 • 5:43 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు మంగళవారం కూడా లాభాల దిశగా పయనించాయి. ఐటీ, ఆటో, మెటల్, ఎఫ్‌ఎంసీజీ రంగాల్లో(Stock Market) పెట్టుబడిదారుల కొనుగోళ్లు కొనసాగడం, అలాగే అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు రావడంతో సూచీలు ఎగసాయి. అమెరికాలో ఫెడరల్ షట్‌డౌన్‌ను ముగించే బిల్లుకు సెనేట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్లలో సెంటిమెంట్ బలపడింది.

ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 335.97 పాయింట్లు పెరిగి 83,871.32 వద్ద ముగిసింది. ఉదయం స్వల్ప హెచ్చుతగ్గుల అనంతరం ఐటీ, ఆటో రంగాల్లో కొనుగోళ్లు పెరగడంతో సెన్సెక్స్ ఒక దశలో 83,936 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 120 పాయింట్లు పెరిగి 25,695 వద్ద ముగిసింది.

Read also: తెలుపు వర్సెస్ నల్ల నువ్వులు!

Stock Market: లాభాలతో దూసుకెళ్లిన షేర్ మార్కెట్లు

ప్రపంచ మార్కెట్లలో పాజిటివ్ సెంటిమెంట్

జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ (Stock Market) మాట్లాడుతూ, ఢిల్లీ పేలుడు ఘటనతో ఉదయం మార్కెట్ కొంత బలహీనంగా ప్రారంభమైనప్పటికీ, అమెరికా(America) షట్‌డౌన్ ముగింపు వార్తలతో తిరిగి ఉత్సాహాన్ని పొందింది అని పేర్కొన్నారు. త్రైమాసిక ఫలితాలు ఊహించిన దానికంటే మెరుగ్గా రావడంతో ఇది మార్కెట్లకు మద్దతుగా మారిందని అన్నారు. సెన్సెక్స్ బాస్కెట్‌లో ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, ఎల్&టీ, హిందుస్థాన్ యూనిలీవర్, మహీంద్రా అండ్ మహీంద్రా, అదానీ పోర్ట్స్, సన్ ఫార్మా షేర్లు లాభాల్లో ముగిశాయి. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, టాటా మోటార్స్ పీవీ షేర్లు స్వల్పంగా నష్టపోయాయి. రంగాల వారీగా చూస్తే, నిఫ్టీ ఐటీ 1.20%, నిఫ్టీ ఆటో 1.07%, నిఫ్టీ బ్యాంక్ 0.35%, ఎఫ్‌ఎంసీజీ 0.34% లాభపడ్డాయి. మిడ్‌క్యాప్ సూచీ 0.50% పెరగగా, స్మాల్‌క్యాప్ సూచీ 0.21% నష్టపోయింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read also:

auto-sector global-sentiment indian-stock-market it-sector Latest News in Telugu metal-sector Nifty NSE sensex Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.