📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు

Stock Market: స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

Author Icon By Shobha Rani
Updated: July 4, 2025 • 4:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు ఈ వారాంతాన్ని స్వల్ప లాభాలతో ముగించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ.. భారత్‌-అమెరికా ట్రేడ్‌ డీల్‌ వార్తలపై దృష్టిపెట్టిన మదుపర్లు అప్రమత్తత పాటించారు. దీంతో నేటి ట్రేడింగ్‌లో తీవ్ర ఊగిసలాటకు గురైన సూచీలు (Stock Market) చివరకు స్వల్ప లాభాలను దక్కించుకున్నాయి. సెన్సెక్స్‌ (Sensex) దాదాపు 200 పాయింట్లు పెరగ్గా.. నిఫ్టీ (Nifty) 25,450 మార్క్‌ దాటింది.
రంగాల వారీగా మార్కెట్‌ పనితీరు
ఈ ఉదయం 83,306.81 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్‌.. కాసేపటికే ఒత్తిడికి గురైంది. ఒక దశలో 83,015.83 వద్ద ఇంట్రాడే కనిష్ఠానికి పడిపోయిన సూచీ చివర్లో కాస్త కోలుకుంది. మార్కెట్‌ (Stock Market) ముగిసే సమయానికి 193.42 పాయింట్లు లాభపడి 83,432.89 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ కూడా 25,331.65 – 25,470.25 మధ్య కదలాడింది. చివరకు 55.70 పాయింట్లు పెరిగి 25,461 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 17 పైసలు బలపడి 85.38గా స్థిరపడింది.

స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

అంతర్జాతీయ ప్రభావాలు & ట్రేడ్ డీల్‌ అంశం
ఆటోమొబైల్‌, టెలికాం, లోహ రంగాలు మినహా మిగతా అన్ని రంగాల సూచీలు లాభపడ్డాయి. బ్యాంకింగ్‌, ఫార్మా, చమురు, ఐటీ, రియల్టీ, మీడియా రంగ సూచీలు 0.4 నుంచి 1 శాతం మేర పెరిగాయి. నిఫ్టీలో బజాజ్‌ ఫైనాన్స్‌, ఇన్ఫోసిస్‌, రెడ్డీస్‌ ల్యాబ్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హిందుస్థాన్‌ యునిలివర్‌ షేర్లు రాణించగా.. ట్రెంట్‌, టాటా స్టీల్‌, ఐషర్‌ మోటార్స్‌, టెక్‌ మహీంద్రా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు నష్టపోయాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్ షేర్లు స్వల్పంగా పెరిగాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also: UPI-Based Bank: భారత్‌లో మొట్టమొదటి UPI ఆధారిత బ్యాంక్‌

auto sector fall bajaj finance stock Breaking News in Telugu BSE performance Google news Google News in Telugu Indian Stock Market News IT pharma sector gains Latest News in Telugu nifty gainers losers Paper Telugu News Rupee vs Dollar Sensex Nifty update Stock Market Today stock market volatility Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news trade deal impact on market

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.