📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు

Crime: అత్తని చంపింది అల్లుడే..వీడిన మిస్టరీ!

Author Icon By Vanipushpa
Updated: August 12, 2025 • 4:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బెంగళూరు(Bangalore)లోని తుమకూరు జిల్లాలో జరిగిన మహిళా మర్డర్ కేసు వీడింది. అల్లుడే ఆమెను19 ముక్కలుగా నరికి చంపేశాడు. రోడ్డుపై ప్లాస్టిక్ కవర్లో దొరికిన మానవ శరీర భాగాలు లభ్యమయ్యాయి. మృతురాలిని బెళ్లావికి చెందిన లక్ష్మీ దేవి(LakshmiDevi) (42) గుర్తించారు. ఓ ఆసుపత్రిలో డెంటల్ డాక్టర్‌గా పనిచేస్తున్న అల్లుడు రామచంద్ర(Ramachandra).. అత్త ప్రవర్తన సరిగా లేకపోవడంతో ఆమెను హతమార్చినట్లుగా పోలీసులు విచారణలో తేల్చారు. లక్ష్మీ దేవిని 19ముక్కలుగా కోసి, 14 ప్లాస్టిక్ కవర్లలో కుక్కి పడేశాడు రామచంద్ర. అతనికి సపోర్ట్ చేసిన మరో ఇద్దరు సతీష్ కెఎన్ (38), కిరణ్ కెఎస్ (32)లను కూడా కోరటగెరె పోలీసులు అరెస్ట్ చేశారు.

Crime: అత్తని చంపింది అల్లుడే..వీడిన మిస్టరీ!

ఆరు నెలల ముందే పక్కా ప్లాన్

రామచంద్రయ్య తన అత్తను చంపడానికి ఆరు నెలల ముందే పక్కా ప్లాన్ వేశాడు. ఆగస్టు 3న, లక్షీదేవి తన కుమార్తె ఇంటి నుంచి తిరిగి వస్తున్నప్పుడు, రామచంద్రయ్య ఆమెను తన కారులో ఎక్కించుకుని, తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఆమెను ఊపిరి ఆడకుండా చేసి చంపాడు. ఆ తర్వాత శవాన్ని తుమకూరులోని సతీష్ పొలానికి తీసుకెళ్లారు. మరుసటి రోజు ముగ్గురు కలిసి శవాన్ని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి, 19 వేర్వేరు ప్రదేశాలలో పారేశారు. దీనివల్ల బాధితురాలు ఎవరు అనేది గుర్తించకుండా చేయాలని భావించారు.

భార్యను ప్రభావితం చేసి ఇంట్లో విభేదాలు
అయితే పోలీసులకు ఆమె శరీర భాగాలపై ఉన్న ఆభరణాలు, టాటూల ఆధారంగా ఆమెను గుర్తించారు. ఈ కేసు తుమకూరులో సంచలనం సృష్టించింది. దర్యాప్తు కొనసాగుతోంది. ఆమెను హత్య చేయడానికి గల కారణాలను పోలీసులు తెలుసుకునే పనిలో పడ్డారు. ప్రాధమికంగా 2019లో లక్ష్మీ దేవి కుమార్తె తేజస్విని రెండో వివాహం చేసుకున్నాడు డాక్టర్ రామచంద్రయ్య. అయితే తమ వివాహంలో తన అత్త జోక్యం చేసుకోవడం పట్ల కలత చెందినట్లు సమాచారం. తన భార్యను ప్రభావితం చేసి ఇంట్లో విభేదాలు సృష్టించినందుకు ఆమెను చంపాలని స్కెచ్ వేసినట్లుగా పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. కాగా డాక్టర్ రామచంద్రయ్య మొదటి భార్యతో విడాకుల ప్రక్రియ ఇంకా కోర్టులో కొనసాగుతోంది.

హత్య అంటే ఏమిటి?
హత్య అంటే ఒక నిర్దిష్ట అధికార పరిధిలో చట్టం నిర్వచించిన విధంగా అవసరమైన ఉద్దేశ్యంతో సమర్థన లేదా చెల్లుబాటు అయ్యే కారణం లేకుండా మరొక వ్యక్తిని చట్టవిరుద్ధంగా చంపడం. ఈ మానసిక స్థితి, అధికార పరిధిని బట్టి, హత్యను నరహత్య వంటి ఇతర రకాల చట్టవిరుద్ధ నరహత్యల నుండి వేరు చేయవచ్చు.
DNA పరీక్షను ఎవరు కనుగొన్నారు?
30 సంవత్సరాల DNA వేలిముద్రల నుండి మనకు తెలిసిన ఐదు విషయాలు...
DNA పరీక్ష, ముఖ్యంగా DNA వేలిముద్రలను 1984లో బ్రిటిష్ జన్యు శాస్త్రవేత్త సర్ అలెక్ జెఫ్రీస్ కనుగొన్నారు. వారి DNA శ్రేణులలోని ప్రత్యేకమైన వైవిధ్యాల ఆధారంగా వ్యక్తులను గుర్తించడానికి అతను ఒక సాంకేతికతను అభివృద్ధి చేశాడు. ఈ సంచలనాత్మక ఆవిష్కరణను మొట్టమొదట 1986లో ఒక క్రిమినల్ కేసులో ఉపయోగించారు, ఇది ఒక అనుమానితుడిని నిర్దోషిగా నిర్ధారించడంలో మరియు చివరికి హత్యకు నిజమైన నేరస్థుడిని గుర్తించడంలో సహాయపడింది.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/pocso-case-the-accused-in-the-pocso-case-was-sentenced-to-life-imprisonment-and-a-fine-of-rs-10000/crime

Crime News family dispute Murder case mystery solved police investigation shocking crime Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.