📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Telugu News: Smart Phone: ఫోన్ పోతే అర్జెంటు గా ఇది చేయండి మీ డబ్బు సేఫ్

Author Icon By Tejaswini Y
Updated: November 27, 2025 • 4:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కొత్త స్మార్ట్‌ఫోన్‌(Smart Phone) కొన్న తర్వాత యూపీఐ యాప్‌(UPI Apps)లు వాడేందుకు కుమారుడిని సహాయం కోరిన ఓ వ్యక్తి, పాస్‌వర్డ్‌గా ‘123456’ పెట్టమని చెప్పాడు. కొద్ది రోజులకే ఆ ఫోన్‌ దొంగిలించబడింది. ఖాతాలో దాదాపు రూ.2 లక్షలు ఉన్నప్పటికీ, ఫోన్‌ పోయిందన్న ఆందోళన లేకుండా తన పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆపై బ్యాంకుకు వెళ్లి డబ్బు తీసుకుందామని చూసేసరికి ఖాతా పూర్తిగా ఖాళీ అయ్యిందని తెలిసి షాక్‌ అయ్యాడు.

ఇలాంటి మోసాలు ఒకరి ఇద్దరితో మాత్రమే పరిమితం కావట్లేదు. రాజధానిలో ఈ రకమైన కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఫోన్ పోయిన వెంటనే యజమానులు వెతుక్కోవడంలో సమయం వృథా చేస్తుంటే, దొంగలు సిమ్‌ మరియు యూపీఐ యాప్‌ల ద్వారా కొన్ని నిమిషాల్లోనే డబ్బులు బదిలీ చేస్తున్నారు. సీఈఐఆర్‌ సాఫ్ట్‌వేర్‌తో ఫోన్‌ తిరిగి దొరికే అవకాశముండినా, ఖాతాలో నుంచి పోయిన డబ్బు తిరిగి రావడం చాలా కష్టం అవుతోంది. అందుకే ఫోన్‌ పోయిన వెంటనే యూపీఐ, బ్యాంకింగ్ అనుసంధానాలను వెంటనే బ్లాక్ చేయాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Read Also:  SBI: ఎస్బీఐ సరికొత్త రికార్డు: స్టాక్ విలువ ఆల్‌టైమ్ హై

దొంగలు ఎలా మోసం చేస్తున్నారు?

  1. చాలామంది సులభంగా ఊహించగలిగే పాస్‌వర్డ్‌లు, యూపీఐ పిన్‌లు వాడుతుండటంతో దొంగలు వెంటనే డబ్బులు దోచేస్తున్నారు.
  2. దొంగిలించిన ఫోన్‌లో ఉన్న సిమ్‌ ద్వారా కొత్త యూపీఐ పిన్‌ సెట్‌ చేసేసుకుంటారు. మొత్తం ప్రక్రియ గంటలోపే పూర్తవుతుంది.

ఎలా స్పందించాలి?

  1. ఫోన్‌ పోయిందనగానే ముందుగా సిమ్‌ కార్డు, యూపీఐ లింక్‌ ఉన్న బ్యాంకు ఖాతాలను వెంటనే బ్లాక్ చేయాలి.
  2. దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసితే, సీఈఐఆర్‌ ద్వారా ఫోన్‌ ట్రాక్ చేసే అవకాశం ఉంటుంది.

ఇటీవల జరిగిన ఉదాహరణలు

  1. తారామతిపేటకు చెందిన రైతు ఫోన్‌ కొట్టేసిన దొంగలు అతని ఖాతా నుంచి రూ.4.26 లక్షలు ఖాళీ చేశారు. కొత్త సిమ్‌ యాక్టివేట్ చేసిన తర్వాతే సమస్య బయటపడింది.
  2. సోమాజిగూడకు చెందిన ఉద్యోగి ఫోన్‌ బస్సులో దొంగిలించడంతో, సిమ్‌ బ్లాక్ చేసేముందే రూ.34 వేల్ని ఎత్తుకుపోయారు. అయితే ఖాతాలను త్వరగా బ్లాక్ చేయడంతో మిగిలిన డబ్బు కాపాడగలిగాడు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

bank scams CEIR Cyber Safety Hyderabad crime mobile security password safety phone theft UPI fraud

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.