హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు (Silver Price) ఊహించని స్థాయిలో పెరిగాయి. ఈరోజు కిలో వెండి ధర రూ. 1,71,000గా ఉండగా, మధ్యాహ్నానికి మరో రూ. 6,000 పెరిగి రూ.1,77,000కు చేరింది. కేవలం రెండు రోజుల్లోనే మొత్తం రూ.9,900 పెరగడం విశేషం. ఈ పెరుగుదలతో జ్యువెలరీ వ్యాపారులు, బులియన్ డీలర్లు ఆశ్చర్యానికి గురయ్యారు. గత వారం వరకు స్థిరంగా ఉన్న వెండి ధరలు ఒక్కసారిగా ఎగబాకడంతో చిన్న పెట్టుబడిదారులు కూడా మార్కెట్‌పై దృష్టి సారించారు.
Telangana HC stays GO on 42% BC Quota : కాంగ్రెస్ క్యాడర్లో నిరాశ!
ట్రేడ్ నిపుణుల ప్రకారం, అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలహీనత, బంగారం–వెండి మీద పెట్టుబడిదారుల ఆకర్షణ పెరగడం, ఫ్యూచర్ మార్కెట్లో ఊహాగానాలు ఇలా అన్ని కలిసి ఈ ధరల పెరుగుదలకు కారణమయ్యాయి. ముఖ్యంగా అమెరికా, చైనా వంటి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ద్రవ్యోల్బణం రేటు పెరగడంతో, సేఫ్ హెవన్ అసెట్స్‌గా వెండి, బంగారంపై మళ్లీ ఆసక్తి పెరుగుతోంది. ఫ్యూచర్ ట్రేడింగ్‌లో వెండి ధర ఇంకా పెరుగుతుందని అంచనా వేస్తుండటంతో, ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున సిల్వర్ కొనుగోళ్లు ప్రారంభించారు.
వెండి ధరల పెరుగుదల సాధారణ వినియోగదారులపై కూడా ప్రభావం చూపుతోంది. జ్యువెలరీ ధరలు పెరగడంతో వివాహ సీజన్‌కి ముందు బంగారం, వెండి కొనుగోళ్లు తగ్గే అవకాశం ఉంది. అయితే ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఈ ధోరణి నెలాఖరుకి కొనసాగితే కిలో వెండి ధర రూ.2 లక్షల మార్క్‌ను తాకే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో స్థితిగతులు స్థిరపడకపోతే, వెండి మరింత ఎగబాకే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో, వెండి కొనుగోళ్లపై పెట్టుబడిదారులు జాగ్రత్తగా వ్యవహరించాలంటూ సూచిస్తున్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/