📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు

అమెరికాలో పురుడు పోయించుకోవాలా వద్దా?

Author Icon By Divya Vani M
Updated: January 24, 2025 • 9:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రస్తుతం అమెరికాలో భారతీయులు తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గర్భిణీలు, డెలివరీ తేదీ సమీపిస్తున్న వారు మానసిక ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నారు. ఫిబ్రవరి 20నుంచి బర్త్ రైట్ సిటిజన్‌షిప్‌ కొత్త చట్టం అమలులోకి రానుందనే ఊహలు, అందులో సియాటెల్ కోర్టు తాత్కాలిక స్టే ఇచ్చినా, భయం మాత్రం తొలగిపోలేదు. ఈ నేపథ్యంలో, సిజేరియన్ డెలివరీని ముందుగానే ప్లాన్ చేసుకుంటున్న వారందరిలో ఆందోళన పెరిగిపోతోంది.అమెరికా ఎయిర్‌పోర్ట్‌లో దిగిన హెచ్1బీ వీసా హోల్డర్లు కూడా ప్రశ్నల వర్షాన్ని ఎదుర్కొంటున్నారు.సరైన డాక్యుమెంట్లు ఉన్నా, వారిని డిటెన్షన్ సెంటర్లకు తీసుకెళ్లి అనుమానాస్పదంగా నిలిపివేస్తున్నారు. “మీరు నిజంగా లీగల్‌గా అమెరికాలోకి వచ్చారా?” అంటూ ప్రశ్నిస్తూ, వారి కంపెనీలను వెంటనే కాంటాక్ట్ చేస్తున్నారు.

ప్రాసెస్‌లో చిన్న పొరపాటు కనబడితే, తిరిగి ఇండియాకు పంపించేస్తున్నారు.పైగా, ఒకసారి అమెరికా వీసా రద్దయితే, మరలా ప్రవేశించడానికి ఐదేళ్ల నిషేధం ఎదురవుతోంది.డొనాల్డ్ ట్రంప్ కొత్త విధానాలు భారతీయులకు తలనొప్పిగా మారాయి. అక్రమ వలసదారులను అమెరికా నుంచి పంపించడమే కాకుండా, హెచ్1బీ వీసా హోల్డర్లను కూడా అత్యంత కఠినంగా చెక్ చేస్తున్నారు.

వీసా ప్రక్రియలో చిన్న పొరపాటు కూడా, వారి కెరీర్‌, కుటుంబ జీవనాన్ని పెనుభూతిగా మార్చేస్తోంది.ముఖ్యంగా గర్భిణి మహిళలు ఫిబ్రవరి 20లోగా డెలివరీ జరిగిపోవాలని ప్రయత్నిస్తున్నారు. బర్త్ రైట్ సిటిజన్‌షిప్‌ వల్ల వెంటనే లాభం ఏమీలేని సరిద్దు, 18 ఏళ్ల తర్వాత పిల్లలు తల్లిదండ్రులకు పౌరసత్వం సంపాదించిపెడతారు. ఈ అంశం కుటుంబాలను చీల్చివేసే అవకాశాలు కలిగిస్తోంది. ఒకరికి సిటిజన్‌షిప్ ఉండగా, మరొకరికి లేని పరిస్థితుల్లో, భవిష్యత్తు అనిశ్చితంగా మారుతోంది. అమెరికా ఎప్పుడూ వలసదారుల కృషితో ఎదిగింది. కానీ, ట్రంప్ పాలన “అమెరికా ఫస్ట్” అనే నినాదంతో, వలసదారుల జీవనాన్ని దుర్భరంగా మార్చుతోంది. అక్రమ వలసదారుల లిస్టును సిద్ధం చేస్తూ, వీరిని తమ దేశాలకు పంపే మాస్ డిపోర్టేషన్ ప్రోగ్రామ్‌ను అమలు చేయాలని ట్రంప్ యత్నిస్తున్నారు. ఇది భారతీయులు, ముఖ్యంగా తెలుగువారి జీవనశైలిపై ప్రభావం చూపుతోంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.