ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకంటే అధిక ధరలు
మార్కెట్లో నిషేధిత బిటి విత్తనాలు
హైదరాబాద్ : ప్రస్తుత వానాకాలం పంటల సీజనులో విత్తనాలకు డిమాండ్ పెరగడంతో కొందరు వ్యాపారులు రైతులను దోపిడీ చేస్తున్నారు. రైతుల అమాయకత్వాన్ని బట్టి వ్యాపారులు ఒక్కొక్కరు ఒక్కో రీతిగా విత్తనాలను అధిక ధరలకు విక్రయిస్తూ రైతుల్ని (Farmers) నిలువు దోపిడీ చేస్తున్న పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే పెంచి అమ్ముతూ రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సోయాబీన్ విత్తనాల ధర రూ.2,400 మాత్రమే ఉండగా, కొందరు వ్యాపారులు రైతుల నుంచి రూ.2,600 వరకూ వసూలు చేస్తున్నారు.
నాలుగెకరాల భూమిలో
నగదు రూపంలో అదనంగా డబ్బులు తీసుకుంటున్న వ్యాపారులు రసీదులో మాత్రం ప్రభుత్వం నిర్ణయించిన ధరల్ని మాత్రమే రాస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే విత్తనాల కొరత ఉందనే సాకు చెబుతున్నారు. ఒక రైతుకు నాలుగెకరాల భూమిలో పత్తి, సోయాబీన్, మిరప పంటలు సాగు చేసేందుకు విత్తనాలు (Seeds) అడిగితే చెందిన నాలుగు పత్తి విత్తన ప్యాకెట్లు (ఒక్కటి 475 గ్రాములు), ఒక సోయాబీన్ సీడ్ సంచి (30 కిలోలు), మిరప విత్తనాలు కావాలని అడిగాడు. సదరు వ్యాపారి పత్తి ప్యాకెట్ ధర రూ.900 చొప్పున నాలుగు ప్యాకెట్లకు రూ.3,600, సోయాకు రూ.2,400, ఇతర విత్తనాలకు రూ.900 బిల్లు వేశాడు. నగదుగా మాత్రం రూ.600 అదనంగా తీసుకున్నాడు.
లక్షల ఎకరాల్లో
రసీదులో వేసిన ధరల కంటే ఎక్కువ ఎలా తీసుకుంటారు అని రైతు ప్రశ్నించగా, పత్తి విత్తనాలపై ప్యాకెట్కు రూ.100 అదనంగా ఇవ్వాల్సిందేనని లేకుంటే మానుకోండని చెప్పడంతో చేసేది లేక వ్యాపారి చెప్పిన రేటు ఇచ్చి విత్తనాలను కొనుగోలు చేశారు. సంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 3.34 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగవుతోంది. సుమారు 6 లక్షల వరకు పత్తి విత్తనాల అవసరముంటుంది. సగటున ఒక్క ప్యాకెట్పై రూ.100 చొప్పున పత్తి, సోయాబీన్ విత్తనాలపై వసూలు చేస్తున్న వ్యాపారులు రూ.6 కోట్లకు పైనే రైతుల నుంచి అధిక ధరల పేరిట లూటీ చేస్తున్న పరిస్థితి ఉందని రైతులు చెబుతున్నారు. అలాగే సిద్దిపేట జిల్లాలోనూ 1.50 లక్షల ఎకరాల్లో పత్తి, మెదక్ జిల్లాలో 50 వేల ఎకరాల్లో పత్తి సాగవ్వనుంది.
అధిక దిగుబడి
రెండు జిల్లాల్లోనూ 3.5 లక్షల వరకు పత్తి విత్తన ప్యాకెట్ల వ్యాపారం సాగనుంది. పత్తి విత్తనాలకు సంబంధించి బ్రాండెడ్ హైబ్రీడ్ విత్తనాలు బీటీ1, బీటీ2 రకాల కొరత ఉందని చెప్పి ఎంఆర్పీ ధర రూ. 901గా ఉంటే అదనంగా రూ.200 వసూలు చేస్తున్నారు. హైబ్రీడ్ విత్తనాల గురించి రైతులకు శాస్త్రీయమైన అవగాహన లేకపోవడంతో వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. మరి కొందరేమో నిషేధించబడిన బీటీ3 పత్తి విత్తనాలను (Cotton seeds) తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. బీటీ2 కంటే బీటీ3 విత్తనాలు సాగు చేస్తే 30 శాతం అధిక దిగుబడి వస్తుందని, దోమపోటు అస్సలు రాదని చెప్పి రూ600 వందలకే ప్యాకెట్ విత్తనాలను విడిగా విక్రయిస్తున్నారు. ఖమ్మం తదితర జిల్లాల్లో పలు ఫర్టిలైజర్స్ దుకాణాల్లో నిషేధిత గడ్డి మందు, చీడల నివారణ కోసం వాడే ఆయిల్ ప్యాకెట్లను విక్రయిస్తున్నట్లు అరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
రైతులకు ప్రధాన సవాళ్లు ఏమిటి?
వర్షాధారిత వ్యవసాయం, ఇన్‌పుట్ ధరల పెరుగుదల, నకిలీ విత్తనాలు/ఎరువులు, పంట రోగాలు, మార్కెట్ ధరల్లో హెచ్చుతగ్గులు, రుణభారం, నిల్వ సదుపాయాల లోపం.
రైతులకు ప్రభుత్వం ఏ విధంగా సహాయం చేస్తుంది?
కనీస మద్దతు ధర విధానం (MSP) వంటి ధర మద్దతు, సబ్సిడీ ఎరువులు/విత్తనాలు, పంట బీమా పథకాలు, సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయ సలహాలు & శిక్షణ, రుణాలపై వడ్డీ రాయితీలు. (రాష్ట్రానుసారం మారుతాయి.)
Read hindi news: hindi.vaartha.com
Read Also: Hyderabad: కిడ్నీ రాకెట్ కేసులో సూత్రధారి డాక్టర్ పవన్ అరెస్టు