📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

యూజర్లకు జియో శుభవార్త.. రూ.91కే రీఛార్జ్ 2026లో RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు 2025లో చారిత్రాత్మక కార్ల రికార్డు లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్! పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు పెరగనున్న హోండా కార్ల ధరలు ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్ జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? యూజర్లకు జియో శుభవార్త.. రూ.91కే రీఛార్జ్ 2026లో RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు 2025లో చారిత్రాత్మక కార్ల రికార్డు లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్! పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు పెరగనున్న హోండా కార్ల ధరలు ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్ జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు?

Latest News: Save the Tigers 3 – సేవ్ ది టైగర్స్ మూడో సీజన్ పై అప్డేట్ ఇచ్చిన ప్రియదర్శి..

Author Icon By Anusha
Updated: September 17, 2025 • 7:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇటీవలి కాలంలో తెలుగు ఓటీటీ ప్రేక్షకుల మనసులను గెలుచుకున్న వెబ్‌సిరీస్‌లలో ‘సేవ్ ది టైగర్స్’ (Save the Tigers) ఒకటి. మహి వి. రాఘవ్ సృష్టించిన ఈ కామెడీ–డ్రామా–థ్రిల్లర్ సిరీస్‌కి రెండు సీజన్లతోనే అనూహ్యమైన ఆదరణ లభించింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ (Disney Plus Hotstar) లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ మొదటి సీజన్‌ నుంచే విభిన్నమైన కథా విన్యాసం, హాస్యభరితమైన సన్నివేశాలు, అందరికీ దగ్గరగా అనిపించే పాత్రలతో విశేషంగా ఆకట్టుకుంది. రెండో సీజన్ మరింత ఎమోషన్, ట్విస్టులతో ప్రేక్షకులను అలరించింది.

ముఖ్యంగా ఈ సిరీస్‌లో ప్రియదర్శి పులికొండ (Priyadarshi Pulikonda), అభినవ్ గోమఠం, కృష్ణ చైతన్య, జోర్దార్ సుజాత, పావని గంగిరెడ్డి, దేవయానీ శర్మ వంటి నటీనటుల ప్రదర్శనలకు ప్రత్యేకమైన ప్రశంసలు దక్కాయి. ప్రతి పాత్రకు ఒక ప్రత్యేకమైన ట్రాక్ ఉండడం వల్ల ఈ సిరీస్‌లోని హాస్యం, డ్రామా, సస్పెన్స్ అన్ని వయసుల ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఆయన పాత్ర అందరికీ బాగా కనెక్ట్ అయింది

ముఖ్యంగా ఈ సిరీస్‌లో ప్రియదర్శి పోషించిన ఘంటా రవి పాత్ర ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. రాజకీయాల్లోకి రావాలనుకునే ఒక పాల వ్యాపారిగా, బాధ్యత గల ఇద్దరు పిల్లల తండ్రిగా ఆయన పాత్ర అందరికీ బాగా కనెక్ట్ అయింది. ఓవైపు నవ్విస్తూనే మరోవైపు భావోద్వేగానికి గురి చేసే పాత్ర అది. తెలంగాణ (Telangana) స్లాంగ్ లో అతను చెప్పే డైలాగ్స్ అలరించాయి. అందుకే సీజన్-3లో ఆ పాత్రను ఎలా తీసుకెళ్తారో అని అందరూ వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రియదర్శి ఈ సిరీస్ గురించి సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు.

‘సేవ్ ది టైగర్స్’ సిరీస్ లో భాగంగా సీజన్-3 ఉంటుందని మేకర్స్ రెండో సీజన్ ఎండింగ్ లోనే క్లారిటీ ఇచ్చారు. అయితే ఎప్పుడు తీస్తారు? షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఎప్పుడు స్ట్రీమింగ్ చేస్తారు? అనే విషయాలు వెల్లడించలేదు. అయితే ఇప్పటికే షూటింగ్ జరుగుతోందనే విషయాన్ని ప్రియదర్శి తెలిపారు. తన పాత్రకు సంబంధించిన ఓ ఫోటోని షేర్ చేసుకున్నారు. ”మీరు ఆరాధించే వ్యక్తి ఘంటా రవి.. సేవ్ ది టైగర్స్ సీజన్ 3 త్వరలోనే రానుంది” అని పేర్కొన్నారు.

View this post on Instagram

A post shared by Priyadarshi Pulikonda (@preyadarshe)

వచ్చే ఏడాది ప్రారంభంలో స్ట్రీమింగ్ చేస్తారా?

ప్రియదర్శి పోస్ట్ చేసిన ఫోటో చూస్తుంటే.. మూడో సీజన్ లో ఘంటా రవి ఎలక్షన్స్ లో గెలిచి ఎమ్మెల్యే అవుతాడని అర్థమవుతోంది. ప్రియదర్శి డ్రెస్సింగ్ స్టైల్, గన్ మ్యాన్, పీఏ.. ఈ సెటప్ అంతా చూస్తుంటే అదే అనిపిస్తోంది. రాబోయే సీజన్ లో అతని పాత్ర మరింత ఎంటర్టైనింగ్ ఉండే అవకాశం ఉంది. ప్రియదర్శితో పాటుగా ముక్కు అవినాష్, శ్రీకాంత్ అయ్యంగార్ లను కూడా మనం ఈ ఫొటోలో చూడొచ్చు.

‘సేవ్ ది టైగర్స్’ ఫస్ట్ సీజన్ 2023 ఏప్రిల్ చివర్లో వస్తే.. సీజన్-2 మాత్రం 2024లో వచ్చింది. రెండూ కలిపి మొత్తం 13 ఎపిసోడ్స్ గా స్ట్రీమింగ్ (streaming) చేశారు. మరి మూడో సీజన్ ను ఈ ఏడాది చివర్లో తీసుకొస్తారా? లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో స్ట్రీమింగ్ చేస్తారా? అనేది చూడాలి. సెకండ్ సీజన్ లో ఉన్న సీరత్ కపూర్ తో పాటుగా మిగతా ప్రధాన తారాగణం అంతా థర్డ్ సీజన్ లోనూ కొనసాగనున్నారు. గంగవ్వ, హర్ష వర్షన్, సత్య కృష్ణన్, బలగం వేణు, కిరీటి తదితరులు ఈ సిరీస్ లో ఇతర కీలక పాత్రలు పోషించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/rashmika-mandanna-national-crush-in-krrish-4/cinema/549332/

Abhinav Gomatam Breaking News Jordar Sujatha Krishna Chaitanya latest news Pavani Gangireddy Priyadarshi Pulikonda Save The Tigers Save The Tigers Season 3 Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.