📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా పెరిగిన బంగారం ధరలు ఖాదీ మహోత్సవంలో రికార్డు సేల్స్.. దాదాపు రూ.2.20 కోట్లపైగా అమ్మకాలు యూజర్లకు జియో శుభవార్త.. రూ.91కే రీఛార్జ్ 2026లో RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు 2025లో చారిత్రాత్మక కార్ల రికార్డు లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్! పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు పెరగనున్న హోండా కార్ల ధరలు ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్ భారీగా పెరిగిన బంగారం ధరలు ఖాదీ మహోత్సవంలో రికార్డు సేల్స్.. దాదాపు రూ.2.20 కోట్లపైగా అమ్మకాలు యూజర్లకు జియో శుభవార్త.. రూ.91కే రీఛార్జ్ 2026లో RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు 2025లో చారిత్రాత్మక కార్ల రికార్డు లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్! పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు పెరగనున్న హోండా కార్ల ధరలు ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్

Telugu News: Satya Nadella: AI భవిష్యత్తుపై సత్య నాదెళ్ల వ్యాఖ్యలు

Author Icon By Tejaswini Y
Updated: November 17, 2025 • 10:33 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచ టెక్ రంగంలో ప్రముఖ వ్యక్తి అయిన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల(Satya Nadella) ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (AI) భవిష్యత్తు దిశ గురించి చేసిన ఒక పోస్టు ప్రస్తుతం పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యంగా ఆయన అభిప్రాయంపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఇచ్చిన స్పందన సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Read also : Trisha: రూమర్ల వార్తలను ఖండించిన త్రిష

టెక్ రంగం ‘జీరో స‌మ్ గేమ్’గా మారకూడదని

తాజా పోస్టులో నాదెళ్ల, ప్రతి కంపెనీకి తమకంటూ స్వతంత్ర AI వ్యవస్థలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టంచేశారు. టెక్ రంగం ‘జీరో స‌మ్ గేమ్’గా మారకూడదని, ఏఐ కారణంగా ఏర్పడే ఆర్థిక లాభాలు కొందరు టెక్ దిగ్గజాలకే పరిమితమవ్వకుండా అన్ని సంస్థలకు చేరే విధంగా వాతావరణం ఏర్పడాలి అని సూచించారు.

ఒక వేదికను రూపొందించిన సంస్థ కంటే, ఆ వేదికపై పని చేసే కంపెనీలు మరింత విలువ సృష్టించాలి అన్న బిల్ గేట్స్ పాత వ్యాఖ్యలను కూడా నాదెళ్ల తన పోస్టులో ప్రస్తావించారు. ఓపెన్‌ఏఐ, ఎన్విడియా, ఏఎండీ వంటి కంపెనీలతో మైక్రోసాఫ్ట్ ఏర్పరుచుకున్న భాగస్వామ్యాలు కూడా ఈ లక్ష్యానికే సేవ చేస్తాయని ఆయన వివరించారు. AIను స్వతంత్రంగా నిర్మించుకోవడం భవిష్యత్‌ వ్యూహాల్లో కీలకమని అన్నారు.

ఇక నాదెళ్ల చేసిన ఈ దీర్ఘ పోస్టుకు ఎలాన్ మస్క్ మాత్రం ఒక్క ‘ఫేస్‌పామ్’ ఎమోజీతోనే స్పందించారు. ఈ ఒక్క ఎమోజీతోనే మస్క్ తన అసమ్మతి తెలిపాడా? లేక మరో దృక్పథం ఉందా? అనే చర్చ నెటిజన్లలో రగులుతోంది. ఈ ఇద్దరి ప్రముఖుల అభిప్రాయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద వివాదానికి తెరలేపాయి.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

AI Updates AMD AI Artificial intelligence Elon musk Microsoft Nvidia OpenAI SatyaNadella Tech News Tesla

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.