మంత్రి సత్య కుమార్ యాదవ్
అనంతపురం : ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ (Satya Kumar Yadav) ధర్మవరం నియోజకవర్గంలోని శివనగర్లో ఉన్న అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి, ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్య కుమార్ యాదవ, వైద్య సిబ్బంది, ఆశావర్కర్లు, రోగులతో నేరుగా సంభాషించి, కేంద్రంలో అందుతున్న వైద్య సేవలపై సమీక్ష నిర్వహించారు. ఆరోగ్య సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. కేంద్ర పనితీరును పరిశీలించి, వారి సేవాపరమైన అంకితభావాన్ని అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ, కుటుంబ నియంత్రణ (family planning), సంతానోత్పత్తి, పునరుత్పత్తి ఆరోగ్య సంరక్షణ అంశాలపై ప్రజల్లో అవగాహన పెంపుదల అవసరమని పేర్కొన్నారు.
జనాభా గణాంకాల
యువతకు సరైన సమాచారం, ఆరోగ్య సంరక్షణ సదుపాయాల అందుబాటుతో వారి భవిష్యత్తు మెరుగవుతుందని నొక్కిచెప్పారు. జనాభా గణాంకాల కంటే మానవ అస్తిత్వం, శ్రేయస్సు ముఖ్యమన్నారు. స్వర్ణ ఆంధ్ర 2047 దిశగా మేము నడుస్తున్నామన్నారు. ప్రతి ఆరోగ్య కేంద్రం ప్రజలకు సాధికారత కలిగించే వేదికగా మారాలని, ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసి, ప్రతి ఒక్కరికీ నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి స్పష్టం చేశారు. స్వర్ణ ఆంధ్ర 2047 లక్ష్యాన్ని చేరుకోవడంలో ఆరోగ్య శాఖ (Department of Health) కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసం సిబ్బంది అంతా నిబద్ధతతో పని చేయాలని పిలుపునిచ్చారు.
సత్య కుమార్ యాదవ్ ఏజ్ ఎంత?
సత్య కుమార్ యాదవ్ ఏజ్ 53 years.
సత్యా కుమార్ యాదవ్ నియోజకవర్గం ఏది?
సత్య కుమార్ యాదవ్ ఒక ప్రముఖ భారతీయ రాజకీయ నాయకుడు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమం మరియు వైద్య విద్య శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.అంతేకాకుండా, ఆయన భారతీయ జనతా పార్టీ (BJP)కి చెందిన నాయకుడిగా సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి. 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గం నుండి విజయం సాధించి, శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Rajiv Kumar Meena: కానిస్టేబుల్ రాత పరీక్షా ఫలితాలు విడుదల