📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Samsung Galaxy S26: శామ్‌సంగ్ గెలాక్సీ S26 సిరీస్ లాంచ్

Author Icon By Anusha
Updated: February 26, 2026 • 10:38 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Samsung Galaxy S26 Launch: కాలిఫోర్నియా వేదికగా జరిగిన అట్టహాసమైన గెలాక్సీ అన్‌ప్యాక్డ్‌ ఈవెంట్‌లో శామ్‌సంగ్ తన అత్యంత శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లు Galaxy S26, Galaxy S26+లను అధికారికంగా లాంచ్ చేసింది. అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన ఈ ఫోన్లు పనితీరు (Performance), డిస్‌ప్లే నాణ్యత, గెలాక్సీ AI (Galaxy AI) సామర్థ్యాలలో స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతాయని కంపెనీ ధీమా వ్యక్తం చేసింది. కొత్త లైనప్‌లో Galaxy S26 ధర రూ.87,999 నుంచి ప్రారంభమవుతుండగా, Galaxy S26+ ధర రూ.1,19,999 నుంచి మొదలవుతుంది. రెండు ఫోన్‌లు బ్లూ, బ్లాక్‌, ఊదా, వైట్‌ కలర్స్‌లో అందుబాటులో ఉంటాయి. భారత్‌లో అమెజాన్, శామ్‌సంగ్ ఆన్‌లైన్ స్టోర్‌ల ద్వారా విక్రయాలు జరగనున్నాయి.

Read Also: Petrol : ఏప్రిల్ నుంచి కొత్త పెట్రోల్ రూల్

ప్రపంచంలోనే తొలిసారిగా ఒక స్మార్ట్‌ఫోన్‌లో అంతర్నిర్మితంగా ‘ప్రైవసీ డిస్‌ప్లే’ టెక్నాలజీని అందించడం గమనార్హం. ఈ ఫీచర్‌ను ఆన్ చేసినప్పుడు, ఫోన్‌ను నేరుగా చూస్తున్న వారికి మాత్రమే స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. పక్కన కూర్చున్న వారు లేదా వెనుక నుంచి దొంగచూపులు చూసేవారికి స్క్రీన్ దాదాపు నల్లగా కనపడుతుంది. బహిరంగ ప్రదేశాల్లో ప్రయాణిస్తున్నప్పుడు వ్యక్తిగత చాట్స్, బ్యాంకింగ్ వివరాలు, ఇతర సున్నితమైన సమాచారానికి ఇది మరింత భద్రత కల్పిస్తుంది.

ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

గెలాక్సీ S26 అల్ట్రా కేవలం ప్రైవసీ ఫీచర్‌తోనే కాకుండా అత్యంత శక్తిమంతమైన స్పెసిఫికేషన్లతో వస్తోంది. ఈ ఫోన్‌లో ప్రత్యేకంగా “గెలాక్సీ కోసం రూపొందించిన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5” ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది పాత మోడల్ కన్నా 19% వేగవంతమైన సీపీయూ, 24% మెరుగైన జీపీయూ పనితీరును అందిస్తుంది.

Samsung Galaxy S26 Launch

ఇక కెమెరా విషయానికొస్తే, ఇందులో క్వాడ్-కెమెరా సెటప్ ఉంది. మెరుగైన లో-లైట్ ఫొటోగ్రఫీ కోసం f/1.4 అపెర్చర్‌తో కూడిన 200MP ప్రధాన కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ లెన్స్, 5x ఆప్టికల్ జూమ్‌తో 50MP టెలిఫోటో లెన్స్, 3x ఆప్టికల్ జూమ్‌తో 10MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీల కోసం 12MP ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు.

6.9-అంగుళాల క్యూహెచ్‌డీ+ డైనమిక్ అమోలెడ్ 2X డిస్‌ప్లే, 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తోంది. దీనికి కార్నింగ్ గొరిల్లా ఆర్మర్ 2 రక్షణ కల్పించారు. 5,000mAh బ్యాటరీతో పాటు 60W వైర్డ్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే “సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ 3.0” టెక్నాలజీని అందించారు. దీని ద్వారా కేవలం 30 నిమిషాల్లోనే ఫోన్‌ను 75% వరకు ఛార్జ్ చేయవచ్చు. 7.9mm మందంతో ఇది ఇప్పటివరకు వచ్చిన అల్ట్రా మోడళ్లలో అత్యంత స్లిమ్ ఫోన్‌గా నిలిచింది.

ధర, లభ్యత

భారత మార్కెట్లో గెలాక్సీ S26 అల్ట్రా (12GB + 256GB) ప్రారంభ ధర రూ.1,39,999గా నిర్ణయించారు. 1TB వేరియంట్ ధర రూ.1,89,999గా ఉంది. ఇప్పటికే ఈ ఫోన్ల కోసం ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. మార్చి 11, 2026 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన మార్కెట్లలో అమ్మకాలు మొదలవుతాయి. ఈ ఫోన్లకు ఏడు సంవత్సరాల పాటు ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌గ్రేడ్‌లు, సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందిస్తామని శాంసంగ్ హామీ ఇచ్చింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

2nm Exynos 2600 Chipset Galaxy S26 Plus Price in India Galaxy Unpacked 2026 Samsung Galaxy S26

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.