2025 నవంబర్ 21న కేంద్ర ప్రభుత్వం (Salaries) ప్రకటించిన కొత్త లేబర్ కోడ్ భారత కార్మిక రంగంలో కీలకమైన మార్పులకు నాంది పలికింది. ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (Information technology), ఐటీ ఆధారిత సేవల రంగాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ, ప్రతి నెలలో 7వ తేదీకి ముందు ఉద్యోగులకు జీతాల చెల్లింపును తప్పనిసరి చేసింది. వేతనాలు ఆలస్యమవడం వల్ల చోటు చేసుకునే అసౌకర్యాలను నివారించేందుకు రూపొందిన ఈ నిబంధనలు, పెద్ద మొత్తంలో ఉపాధిని సమకూర్చే ఐటీ రంగంలో మరింత పారదర్శకత, క్రమబద్ధత తీసుకురావడమే లక్ష్యంగా రూపొందించబడ్డాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఈ కొత్త సంస్కరణలను స్వాతంత్ర్యం తర్వాత అమలు చేసిన అత్యంత సమగ్ర కార్మిక సంస్కరణలుగా అభివర్ణించారు. ఇప్పటి వరకు అమల్లో ఉన్న 29 కార్మిక చట్టాలను సులభతరం చేస్తూ, వాటి స్థానంలో వేతన కోడ్ 2019, పారిశ్రామిక సంబంధాల కోడ్ 2020, సామాజిక భద్రత కోడ్ 2020, వృత్తి భద్రత, ఆరోగ్యం మరియు పని పరిస్థితుల కోడ్ 2020లను ప్రవేశపెట్టి ఉద్యోగుల హక్కులను బలోపేతం చేసే జాతీయ విధానాన్ని ప్రభుత్వం రూపొందించింది. ఈ నూతన నిబంధనలు 2025 నవంబర్ 21 నుంచి అమల్లోకి వస్తాయి.
Read also: సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్: భారీ ధరల కొనుగోళ్లు స్టాప్!
మహిళల భద్రత, సమాన వేతనాలు,సామాజిక భద్రతకు కొత్త హామీ
కోడ్‌లో మరో ముఖ్య అంశంగా మహిళలకు(Salaries) రాత్రి పూట షిఫ్టుల్లో పనిచేయడానికి అనుమతి కల్పించాల్సిన బాధ్యతను సంస్థలపై విధించారు. తగిన భద్రతా వ్యవస్థలను అమలు చేస్తూ రాత్రి పూట పనికి అనుమతిస్తే మంచి వేతనాలు ఉన్న ఉద్యోగాలకు మహిళలు సులభంగా చేరుకునే అవకాశం పెరుగుతుంది. అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం నిబంధనను తప్పనిసరి చేయడం ద్వారా ఉద్యోగాల్లో లింగ వివక్షను తగ్గించే దిశగా ఇది ఒక మంచి ముందడుగుగా భావించబడుతోంది. వేతన వివాదాలు పని ప్రదేశంలో వేధింపులు, వివక్షత వంటి సమస్యలకు సమయానుకూలంగా పరిష్కారం కల్పించే విధానాలను కోడ్‌లో చేర్చడం ద్వారా ఉద్యోగుల భద్రత మరింత పటిష్టమవుతుంది.
అలాగే స్థిర-కాలిక (ఫిక్స్డ్ టర్మ్) ఉద్యోగుల్లో పనిచేయేవారికి కూడా PF, ESI, గ్రాచ్యుటీ వంటి సామాజిక భద్రతా ప్రయోజనాలు అందేలా నిబంధనలు రూపొందించబడ్డాయి. గిగ్ వర్కర్స్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగులకు రక్షణను విస్తరించడం ద్వారా భారత కార్మిక వ్యవస్థను గ్లోబల్ స్టాండర్డ్స్‌కు దగ్గర చేస్తుందనే అభిప్రాయం ప్రభుత్వం వ్యక్తం చేసింది. PIB తెలిపిన ప్రకారం, ఈ కొత్త కోడ్‌లు శ్రామికులకు మెరుగైన వేతనాలు, భద్రత, మరియు ఆరోగ్యకరమైన పని వాతావరణం అందించడంతో పాటు ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలకు బలమైన పరిశ్రమలను రూపుదిద్దేందుకు తోడ్పడతాయని తెలిపింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: