బైక్ బ్రాండ్ Royal Enfield కీలక నిర్ణయం తీసుకుంది.మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న Scram 440 మోడల్ అమ్మకాలు తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ నిర్ణయానికి ముఖ్య కారణం – ఇంజిన్‌లో తలెత్తిన సాంకేతిక లోపమే.ఈ బైక్ గత ఏడాది చివరిలో మార్కెట్లోకి వచ్చింది. ఎక్స్-షోరూమ్ ధర రూ. 2.08 లక్షలు.ఆకర్షణీయమైన డిజైన్, శక్తివంతమైన ఇంజిన్‌తో యువతలో మంచి క్రేజ్ తెచ్చుకుంది. కానీ ఇప్పుడు కొన్ని బైక్‌లలో ఒక స్పెసిఫిక్ ఇంజిన్ భాగంలో లోపం కనిపించింది.Royal Enfield ప్రకారం, సమస్య Woodruff Key అనే చిన్న భాగంలో తలెత్తింది.ఇది మాగ్నెటిక్ కాయిల్ వద్ద అమర్చే కీలక భాగం. ఈ భాగంలో లోపం ఉన్న బైక్‌లు, కొన్ని కిలోమీటర్లు వెళ్లిన తర్వాత తిరిగి స్టార్ట్ కావడం లేదు.బైక్ ఓనర్లు చెప్పినట్లు, ఇంజిన్ నడుస్తున్నప్పుడు ఎలాంటి సమస్యలు లేవు.
కానీ ఇగ్నిషన్ ఆఫ్ చేసిన తర్వాత మళ్లీ ఆన్ చేయాలంటే బైక్ స్టార్ట్ కాకపోతున్నట్లు వారు చెప్పారు.ఈ సమస్యపై Royal Enfield వెంటనే స్పందించింది.Scram 440 అమ్మకాలు, బుకింగ్స్, డెలివరీలు తాత్కాలికంగా ఆపింది.ఇది కస్టమర్ల భద్రతను దృష్టిలో ఉంచుకొని తీసుకున్న నిర్ణయం.ఇప్పటివరకు ఉత్పత్తి అయిన బైక్‌లలో కేవలం 2% వాహనాల్లోనే ఈ లోపం ఉందని కంపెనీ చెబుతోంది. అయినా ఖరీదైన బైక్ కావడంతో రిస్క్ తీసుకోలేకపోతున్నారు.ఇప్పటికే Scram 440 కొనుగోలు చేసిన వినియోగదారులకు రిలీఫ్ ఉంది.
లోపం ఉన్న బైక్‌లకు ఉచితంగా కొత్త Woodruff Key అమర్చనున్నట్లు కంపెనీ తెలిపింది.అధీకృత సర్వీస్ సెంటర్లలో ఈ ప్రాసెస్ మొదలైందట.ఈ మార్పులు పూర్తయ్యే వరకు కొత్త బైక్‌ల డెలివరీ వాయిదా పడుతుంది.ఇది వినియోగదారుల రైడింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరచడానికి కంపెనీ చేసిన సానుకూల ప్రయత్నం.Scram 440 అమ్మకాలు ఎప్పుడు మళ్లీ ప్రారంభమవుతాయనే దానిపై క్లారిటీ లేదు. కానీ మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం, జూలైలో అమ్మకాలు తిరిగి మొదలయ్యే అవకాశం ఉంది. లోపభూయిష్ట భాగాల మార్పిడి పూర్తయిన తర్వాతే ఈ ప్రక్రియ మొదలవుతుంది.ఈ పరిణామాలపై ఇంకా Royal Enfield నుంచి పూర్తి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వినియోగదారులు తాజా సమాచారం కోసం అధీకృత డీలర్లను లేదా కంపెనీ వెబ్‌సైట్ ను సందర్శించాలి.ఈ చర్య వినియోగదారుల నమ్మకాన్ని దక్కించుకునే ప్రయత్నమే. Royal Enfield బైక్ క్వాలిటీపై ఎప్పుడూ శ్రద్ధ పెట్టే బ్రాండ్. ఇది కూడా అదే దిశగా తీసుకున్న నిర్ణయంగా చూడవచ్చు.
Read Also : Plastic:పెరుగుతున్న ప్లాస్టిక్ అనర్థాలు..మరణిస్తున్న ఆవులు