📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest News: Rishi Sunak: మైక్రోసాఫ్ట్ సలహాదారుగా రిషి సునాక్

Author Icon By Aanusha
Updated: October 10, 2025 • 7:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్‌ (Rishi Sunak) తన రాజకీయ ప్రయాణాన్ని ముగించి ఇప్పుడు కార్పొరేట్ ప్రపంచంలో కొత్త దిశగా అడుగులు వేస్తున్నారు. ఇటీవల ఆయన అమెరికాకు చెందిన టెక్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌తో పాటు ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) స్టార్టప్ (AI) Startup) ఆంత్రోపిక్‌లో సీనియర్ సలహాదారుగా నియమితులయ్యారు.

Uk Universities: భారత్‌లో 9 బ్రిటన్ యూనివర్శిటీల క్యాంపస్‌

ఈ రెండు సంస్థలు ప్రస్తుతం ప్రపంచ టెక్నాలజీ రంగంలో అత్యంత ప్రభావవంతమైన పాత్ర పోషిస్తున్నాయి. సునాక్‌ (Rishi Sunak) ఈ నియామకం ద్వారా మళ్లీ గ్లోబల్ స్టేజ్‌పై తన మేధస్సుతో ప్రభావం చూపే అవకాశం పొందారు.

గత జులైలో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఓటమి తర్వాత కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్న సునాక్, ప్రస్తుతం పార్లమెంట్ సభ్యునిగా కొనసాగుతున్నారు.ఈ కొత్త బాధ్యతల గురించి రిషి సునాక్ తన లింక్డ్‌ఇన్ (LinkedIn) పోస్టులో స్వయంగా వెల్లడించారు.

ఛారిటీ సంస్థకు విరాళంగా

ఈ రెండు పదవుల ద్వారా తనకు లభించే ఆదాయాన్ని మొత్తం తన భార్య అక్షతా మూర్తి (Akshata Murthy) తో కలిసి ప్రారంభించిన ‘ది రిచ్‌మండ్ ప్రాజెక్ట్’ అనే ఛారిటీ సంస్థకు విరాళంగా ఇస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈ నిర్ణయంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.ఆంత్రోపిక్ సంస్థలో సునాక్ పాత్ర ప్రధానంగా అంతర్గత వ్యవహారాలకు,

వ్యూహాత్మక సలహాలకు మాత్రమే పరిమితం కానుంది. ప్రపంచ ఆర్థిక, భౌగోళిక రాజకీయ పరిణామాలపై ఆయన కంపెనీకి మార్గనిర్దేశం చేస్తారు. ఇక మైక్రోసాఫ్ట్‌లో కూడా ఆయన ఇదే తరహా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

 Rishi Sunak

త్వరలో జరగబోయే మైక్రోసాఫ్ట్ (Microsoft) వార్షిక సదస్సులో ఆయన ప్రసంగించనున్నట్లు తెలుస్తోంది.ఈ నియామకాలకు సంబంధించి బ్రిటన్‌లో మాజీ మంత్రులు, ఉన్నతాధికారుల కొత్త ఉద్యోగాలపై నిబంధనలను పర్యవేక్షించే ‘అడ్వైజరీ కమిటీ ఆన్ బిజినెస్ అపాయింట్‌మెంట్స్ (ACOBA)’ నిర్దేశించిన షరతులకు పూర్తిగా కట్టుబడి ఉన్నట్లు ఆంత్రోపిక్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

నిబంధనల ప్రకారం, రిషి సునాక్ మంత్రి పదవి నుంచి వైదొలిగిన నాటి నుంచి రెండేళ్ల పాటు ఈ కంపెనీల తరఫున బ్రిటన్ ప్రభుత్వాన్ని లాబీయింగ్ చేయడానికి వీల్లేదు. అలాగే, ప్రభుత్వంలో ఉన్నప్పుడు తనకు తెలిసిన రహస్య సమాచారాన్ని

ఈ పదవుల కోసం ఉపయోగించకూడదని ACOBA స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.గత జులైలో రిషి సునాక్ ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ గోల్డ్‌మన్ శాక్స్‌లో సలహాదారుగా తిరిగి చేరిన విషయం తెలిసిందే. 2000వ దశకం ప్రారంభంలో ఆయన ఇదే సంస్థలో అనలిస్ట్‌గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

AI Advisor Anthropic Breaking News latest news Microsoft Rishi Sunak Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.