📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు

Rishabh Pant: పంత్ గాయంపై బ్యాటింగ్ కోచ్ అప్‌డేట్

Author Icon By Anusha
Updated: July 27, 2025 • 12:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న ఐదో టెస్టులో భారత జట్టు (Team India) పోరాడుతూ మ్యాచ్‌ను డ్రా దిశగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 174 పరుగులకు రెండు వికెట్లు మాత్రమే కోల్పోయింది. మ్యాచ్ ఆరంభంలో 0 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయిన టీమిండియా అనంతరం అద్భుతంగా తిరిగి నిలబడింది.కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్ గొప్పగా బ్యాటింగ్ చేస్తున్నారు.174/2తో నాలుగో రోజు ఆట ముగించారు. అయితే భారత్‌కు ఇంకా ప్రమాదం పొంచే ఉంది. ఎందుకుంటే ఈ మ్యాచులో డ్రా చేసుకోవాలంటే భారత్ చివరిరోజు నిలబడాల్సి ఉంది. ఇంకా 137 పరుగులు వెనకబడి ఉన్న భారత్.. చివరి రోజు 90 ఓవర్లలో ఎంతసేపు బ్యాటింగ్ చేస్తుందనే అంశంపై మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది. ప్రస్తుతం క్రీజులో కేఎల్ రాహుల్ (87), గిల్ (78) ఉన్నారు. నిజానికి మరో వికెట్ పడితే రిషభ్ పంత్ (Rishabh Pant) బ్యాటింగ్‌కు రావాలి. కానీ ఈ టెస్టు తొలి రోజు ఆటలో గాయపడ్డ పంత్.. వికెట్ కీపింగ్ చేయట్లేదు.

ఒక్కసారి క్రీజులో

నొప్పితో ఇబ్బంది పడుతూనే తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేశాడు. ఈ నేపథ్యంలో రెండో ఇన్నింగ్స్‌లో అతడు బ్యాటింగ్‌కు వస్తాడా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ విషయంపై టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ (Sitanshu Kotak) స్పందించారు. పంత్ బ్యాటింగ్‌కు దిగుతాడని సంకేతాలు ఇచ్చాడు.”మాంచెస్టర్ టెస్ట్‌లో చివరి రోజు భారత్ ఎదుర్కొనే ప్రతీ బంతి కీలకమే. కానీ మన బ్యాటర్లు నాలుగో రోజు ఆడినట్లే ఆడతారని అనుకుంటున్నా. పెద్దగా ఆలోచించకుండా.. ఒక్కో బంతిని ఆడుతూ పోవాలి. ఎక్కడా కూడా రిస్క్ షాట్లకు పోకూడదు. ఒక్కసారి క్రీజులో పాతుకుపోయాక.. షాట్లు ఆడితే.. ప్రత్యర్థి ఒత్తిడిలో పడుతుంది. . ఇంకా చాలా మంది నాణ్యమైన బ్యాటర్లు బ్యాటింగ్‌కు రావాల్సింది. వాళ్లందరికీ కావాల్సినంత అనుభవం ఉంది.

పంత్ గాయపడ్డ తర్వాత అతడికి

స్కిల్‌తో పాటు.. మానసికంగా కూడా ఫిట్‌గా ఉండాలి. తొలి రోజు ఆటలో గాయపడ్డ రిషభ్ పంత్.. రెండో ఇన్నింగ్స్‌లో మళ్లీ బ్యాటింగ్‌ చేస్తాడని అనుకుంటున్నా” అని సితాన్షు కొటక్ నాలుగో రోజు ఆట ముగిసిన తర్వాత అన్నాడు.పంత్ గాయపడ్డ తర్వాత అతడికి ఆరు వారాల విశ్రాంతి అవసరమని వార్తలు వచ్చాయి. కానీ దీనిపై బీసీసీఐ ఎలాంటి ప్రకటన చేయలేదు. అవసరమైతే బ్యాటింగ్‌కు వస్తాడని మాత్రమే చెప్పింది. దీంతో ఐదో రోజు కూడా పంత్ బ్యాటింగ్ చేస్తాడనే అంచనాలు ఉన్నాయి.

రిషభ్ పంత్‌కి ఏమైంది?

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్ తొలి రోజు, రిషభ్ పంత్ కుడి కాలికి గాయమైంది. తర్వాత వైద్య పరీక్షల్లో ఆ గాయం ఎముక విరుగుదల (fracture)గా నిర్ధారించబడింది. దీంతో, ఈ గాయానికి చికిత్స అవసరమవడంతో, అతడు మిగతా టెస్ట్ సిరీస్‌కు దూరంగాఉన్నాడు.

రిషబ్ పంత్ కుటుంబ నేపథ్యం?

ప్రారంభ జీవితం. రిషబ్ పంత్ భారతదేశంలోని ఉత్తరాఖండ్‌లోని రూర్కీలో అక్టోబర్ 4, 1997న రాజేంద్ర పంత్, సరోజ్ పంత్ దంపతులకు జన్మించాడు.

Read hindi news: hindi.vaartha.com

Read also: IND vs ENG: చరిత్ర సృష్టించిన గిల్-రాహుల్

Breaking News India 4th day score India follow-on India vs England Test KL Rahul batting latest news Manchester Test 2025 Rishabh Pant Injury Shubman Gill partnership Team India Batting Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.