డీమార్ట్ తక్కువ ధరలు అందించడానికి ప్రధాన కారణం మధ్యవర్తులను పూర్తిగా దూరం పెట్టడం. ఇతర రిటైల్ స్టోర్లు డిస్ట్రిబ్యూటర్లు, హోల్‌సేలర్లపై ఆధారపడితే, డీమార్ట్ (DMart) మాత్రం ఉత్పత్తులను నేరుగా తయారీ కంపెనీల నుంచే భారీ మొత్తంలో కొనుగోలు చేస్తుంది. దీని వల్ల ఒక్కో వస్తుపై ఖర్చు తగ్గి, ఆ లాభాన్ని వినియోగదారులకు తక్కువ ధరల రూపంలో అందిస్తుంది. అంతేకాదు, సరఫరాదారులకు బిల్లులను వెంటనే చెల్లించడం వల్ల కంపెనీల నుంచి అదనపు డిస్కౌంట్లు కూడా పొందుతుంది.
Read also: Afghanistan: పాక్ మెడిసిన్ వద్దు భారత్ మందులపై మొగ్గు..ఎందుకంటే?
Why are prices so low at D-Mart
సొంత భవనాలు, అవసరమైన వస్తువులకే ప్రాధాన్యం
డీమార్ట్ తన స్టోర్లను ఎక్కువగా సొంత భవనాల్లోనే నిర్వహిస్తుంది. అద్దె భారం తక్కువగా ఉండటంతో ఆ ఖర్చు కూడా ధరలపై ప్రభావం చూపదు. అలాగే, ఫ్యాన్సీ లేదా అవసరం లేని వస్తువులపై దృష్టి పెట్టకుండా, రోజువారీ అవసరాలకు సంబంధించిన సరుకులకే ప్రాధాన్యం ఇస్తుంది. దీనివల్ల స్టాక్ నిర్వహణ సులభమవుతుంది, నష్టాలు తగ్గుతాయి. తక్కువ ఖర్చుతో స్టోర్ నిర్వహణ చేయడం డీమార్ట్ బిజినెస్ మోడల్‌లో కీలక భాగం.
తక్కువ లాభం – ఎక్కువ అమ్మకాలు అనే స్పష్టమైన ఆలోచన
డీమార్ట్ వ్యూహం చాలా స్పష్టం – తక్కువ లాభంతో ఎక్కువ అమ్మకాలు. ఒక్కో ఉత్పత్తిపై లాభం తక్కువగా ఉన్నా, భారీ సంఖ్యలో అమ్మకాలు జరగడం వల్ల మొత్తం లాభాలు పెరుగుతాయి. వినియోగదారులకు నమ్మకం పెరగడంతో, వారు మళ్లీ మళ్లీ డీమార్ట్‌కే రావడం జరుగుతుంది. ఇదే దీర్ఘకాలిక విజయానికి కారణంగా మారింది. ఈ బలమైన వ్యూహాల వల్లే డీమార్ట్ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన రిటైల్ చైన్‌గా ఎదిగింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: