📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు

Kinetic DX : తాజాగా డీఎక్స్ మోడల్ తో రీఎంట్రీ ఎలక్ట్రిక్ స్కూటర్

Author Icon By Divya Vani M
Updated: July 28, 2025 • 10:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఒకప్పుడు భారత్‌లో 80, 90వ దశకాల్లో కైనెటిక్ హోండా స్కూటర్‌ (Kinetic Honda Scooter)లు విపరీతమైన ఆదరణ పొందాయి. ఆ తరువాత హోండా, కైనెటిక్ సంస్థలు విడిపోయాయి. క్రమంగా కైనెటిక్ మార్కెట్ నుంచి కనుమరుగైంది.ఇన్నాళ్లకు కైనెటిక్ మళ్లీ రంగంలోకి దిగుతోంది. ఈసారి ఎలక్ట్రిక్ స్కూటర్‌తో ఎంట్రీ ఇస్తోంది. కైనెటిక్ ఇంజనీరింగ్ ఈవీ విభాగం కైనెటిక్ వాట్స్ అండ్ వోల్ట్స్ కొత్తగా కైనెటిక్ డీఎక్స్ ఈ-స్కూటర్ను లాంచ్ చేసింది (Kinetic launches DX e-scooter). ఈ మోడల్‌ గతంలోని కైనెటిక్ హోండా డీఎక్స్‌ నుంచి ప్రేరణ పొందింది.

Kinetic DX : తాజాగా డీఎక్స్ మోడల్ తో రీఎంట్రీ ఎలక్ట్రిక్ స్కూటర్

రెండు వేరియంట్లలో లభ్యం

కైనెటిక్ డీఎక్స్‌ ఈ-స్కూటర్‌ రెండు వేరియంట్లలో వస్తోంది. అవి డీఎక్స్‌, డీఎక్స్‌ ప్లస్‌. డీఎక్స్‌ వేరియంట్‌ ధర రూ.1.12 లక్షలు కాగా, డీఎక్స్‌ ప్లస్‌ ధర రూ.1.18 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌). కేవలం రూ.1,000 చెల్లించి బుకింగ్‌లు చేసుకోవచ్చు. సెప్టెంబర్‌ నుండి డెలివరీలు ప్రారంభమవుతాయి.ఈ కొత్త స్కూటర్‌ 2.6 kWh LFP బ్యాటరీపై నడుస్తుంది. డీఎక్స్‌ ప్లస్‌ వేరియంట్‌ 116 కి.మీ. రేంజ్‌ ఇస్తుంది. సాధారణ డీఎక్స్‌ మోడల్‌ 102 కి.మీ. రేంజ్‌ కలిగి ఉంది. రెండు వేరియంట్లలోనూ 4.8 kW హబ్‌-మౌంటెడ్‌ బీఎల్డీసీ మోటార్‌ను వాడారు. డీఎక్స్‌ గరిష్ట వేగం 80 కి.మీ./గం. కాగా, డీఎక్స్‌ ప్లస్‌ 90 కి.మీ./గం. వేగాన్ని అందిస్తుంది.

ప్రధాన ఫీచర్లు ఆకట్టుకునేలా

ఈ స్కూటర్‌లో మూడు రైడింగ్‌ మోడ్‌లు (రేంజ్‌, పవర్‌, టర్బో) ఉన్నాయి. రివర్స్‌ అసిస్ట్‌, హిల్‌ హోల్డ్‌ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. 37 లీటర్ల అండర్‌సీట్‌ స్టోరేజ్‌, క్రూయిజ్‌ కంట్రోల్‌, టెలిస్కోపిక్‌ ఫ్రంట్‌, అడ్జస్టబుల్‌ రియర్‌ సస్పెన్షన్‌, 220 మి.మీ. ఫ్రంట్‌ డిస్క్‌ బ్రేక్‌ (సీబీఎస్‌తో) వంటి ఫీచర్లు ఉన్నాయి.కైనెటిక్ డీఎక్స్‌ 8.8 అంగుళాల డిజిటల్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇందులో బ్లూటూత్‌ మ్యూజిక్‌, వాయిస్‌ నావిగేషన్‌, కీ లెస్‌ అనుభవం లభిస్తాయి. డీఎక్స్‌ ప్లస్‌లో ప్రత్యేక ఈజీ ఛార్జ్‌ రిట్రాక్టబుల్‌ కేబుల్‌, మై కైనీ కంపానియన్ సిస్టమ్‌ ద్వారా వాయిస్‌ అలర్ట్‌లు ఉంటాయి. కైనెటిక్ యాప్‌ ద్వారా రియల్‌టైమ్‌ ట్రాకింగ్‌, జియోఫెన్సింగ్‌, రైడ్‌ అనలిటిక్స్‌ వంటి కనెక్టెడ్‌ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

Read Also : Salman Khan : చిత్రీకరణలో తోటి నటుడి మెడపై నిజమైన కత్తిపెట్టిన సల్మాన్ ఖాన్

Electric Scooter India EV Scooter Launch Kinetic DX Kinetic DX Features Kinetic DX Plus Kinetic Electric Scooter

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.