📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

యూజర్లకు జియో శుభవార్త.. రూ.91కే రీఛార్జ్ 2026లో RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు 2025లో చారిత్రాత్మక కార్ల రికార్డు లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్! పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు పెరగనున్న హోండా కార్ల ధరలు ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్ జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? యూజర్లకు జియో శుభవార్త.. రూ.91కే రీఛార్జ్ 2026లో RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు 2025లో చారిత్రాత్మక కార్ల రికార్డు లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్! పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు పెరగనున్న హోండా కార్ల ధరలు ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్ జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు?

RBI: 50 శాతం వడ్డీ రేట్ల కోత విధించనున్నఆర్బీఐ?

Author Icon By Sharanya
Updated: June 3, 2025 • 10:26 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆర్థిక పరిపాలనలో కీలకమైన ద్రవ్య విధాన సమీక్షలు ప్రతిసారీ పెట్టుబడిదారులు, బ్యాంకింగ్ రంగం, పారిశ్రామికవేత్తలు, మరియు సామాన్య ప్రజల దృష్టిని ఆకర్షిస్తుంటాయి. తాజాగా జూన్ 6న జరగనున్న ద్రవ్య విధాన సమీక్ష సమావేశంపై భారీ ఆసక్తి నెలకొంది. గతంలో రెపో రేటును 25 బేసిక్ పాయింట్లు తగ్గించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), మరోసారి భారీగా కోత పెట్టే అవకాశాలున్నాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఈ నెల 6న ద్రవ్య విధాన సమావేశం జరగనున్న నేపథ్యంలో రెపో రేటు 50 శాతం బేసిక్ పాయింట్లు తగ్గించే అవకాశం ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తాజా నివేదికలో వెల్లడించింది. ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చేందుకు వ్యూహాత్మక ప్రయత్నంగా ఆర్బీఐ ఈ చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నారు.

మిగులు లిక్విడిటీ పరిస్థితి

ఎస్‌బీఐ గ్రూప్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ సౌమ్యకాంతి ఘోష్ (Soumyakanti Ghosh) వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రస్తుతం బ్యాంకింగ్ వ్యవస్థ మిగులు లిక్విడిటీతో నిండిపోయిన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇటీవల ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో ఆర్థిక సంస్థల సేవింగ్స్ ఖాతా వడ్డీ రేట్లను 2.70 శాతానికి తగ్గించాయి. 2025 ఫిబ్రవరి నుంచి ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లు 30 -70 బేసిక్ పాయింట్లు తగ్గాయి. దాంతో బ్యాంకుల వద్ద లిక్విడిటీ పెరుగుతోంది. దీన్ని అప్పులు ఇచ్చేందుకు అవకాశంగా మలుచుకుంటున్నాయి.

జూన్ పాలసీలో కీలక నిర్ణయం?

జూన్ పాలసీ సమావేశంలో 50 బేసిక్ పాయింట్ల రేటు కోత ఉంటుందని భావిస్తున్నామని ఎస్బీఐ వెల్లడించింది. ఈ ఏడాది చివరి నాటికి మొత్తం రేటు తగ్గింపు వంద బేసిక్ పాయింట్లకు చేరుకోవచ్చని అంచనా వేసింది. ద్రవ్యోల్బణం గణాంకాలు ఆర్బీఐ నిబంధనల మేరకే ఉన్నాయని తెలిపింది. బ్యాంకులు తమ వద్ద లభ్యమైన లిక్విడిటీని వినియోగించుకునేందుకు రెపో రేటు తగ్గింపు ఉపయుక్తంగా మారుతుంది. రెపో రేటు అనేది ఆర్బీఐ నుండి బ్యాంకులు అప్పు తీసుకునే రేటు. దీన్ని తగ్గించడం వల్ల బ్యాంకులు తక్కువ వడ్డీకి నిధులు పొందగలవు, తద్వారా వాటిని రుణాల రూపంలో ప్రజలకు అందించవచ్చు.

Read also: Stock Markets: నష్టాల్లో బయటపడలేకపోతున్న స్టాక్ మార్కెట్లు

#IndianEconomy #InterestRates #Liquidity #MonetaryPolicy #RateCut #RBI #RepoRate #SBIPrediction #SBIReport Breaking News in Telugu google news telugu India News in Telugu Latest Telugu News Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.