📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం

RBI: NBFC ల నుంచి లోన్లు మరింత సులభం? RBI మార్గదర్శకాలు

Author Icon By Vanipushpa
Updated: July 10, 2025 • 2:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఎకానమీ(Economy) వేగంగా మారుతున్న తరుణంలో, ఫైనాన్స్ మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitaraman) చేసిన తాజా వ్యాఖ్యలు ఫైనాన్షియల్ రంగంలో కొత్త ఆలోచనలకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా NBFCలు భవిష్యతు వృద్ధిపై ఆమె చెప్పిన వాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఈ చర్యలతో NBFCలు తక్కువ వడ్డీ రేట్లతో మార్కెట్‌కు రుణాలు ఇవ్వగలగడం సాధ్యమవుతుంది. దీనివల్ల, సాధారణ వినియోగదారులకు కూడా తక్కువ EMIలు, వేగవంతమైన రుణ ఆమోదం వంటి ప్రయోజనాలు అందుబాటులోకి వస్తాయి.

RBI తాజా చర్యలు

బ్యాంకుల నుంచి NBFCలకు ఇచ్చే రుణాలపై రిస్క్ వెయిటేజెస్‌ను తగ్గించడం 2. ఫండింగ్ ఖర్చులు తగ్గేలా నిబంధనలు సడలించారు 3. రుణాల కొరకు అవసరమయ్యే భద్రత/కోల్యాటరల్‌ను తగ్గించారు 4. మార్జిన్ అవసరాలను తక్కువ చేయడం 5. లిక్విడిటీ అందుబాటును మెరుగుపరచడం NBFCలు ఏమి చేయాలి? 1. చిన్న వ్యాపారాలు, రైతులు, విద్యార్థులకి సులభంగా రుణాలు ఇవ్వాలి. 2. రుణాల వసూలు (recovery) సమయంలో వినయంగా, న్యాయంగా వ్యవహరించాలి. 3. డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి సేవలు మెరుగుపరచాలి. 4. గ్రామీణ ప్రాంతాల్లో కూడా సేవలు అందించాలి.

RBI: NBFC ల నుంచి లోన్లు మరింత సులభం? RBI మార్గదర్శకాలు

చిన్న NBFC లకు సవాళ్లు

చిన్న NBFCలకు పెద్ద సంస్థలతో పోటీ చేయడం సులభం కాదు. వారి వద్ద ఉన్న వనరులు తక్కువగా ఉండటం వల్ల ఎదగడానికి కొన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయి. అయితే, కేంద్ర ప్రభుత్వం వీరి ఎదుగుదలకు కావాల్సిన సాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉంది. ముఖ్యంగా డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌ను అందుబాటులోకి తెచ్చి, వడ్డీ రేట్లు తగ్గించే విధంగా మద్దతు ఇచ్చి, నిబంధనలను సులభంగా మార్చి, మంచి పనితీరు చూపిస్తున్న సంస్థలకు ప్రోత్సాహం ఇవ్వాలని భావిస్తోంది. మరోవైపు, RBI కూడా NBFCల నిర్వహణలో పారదర్శకత ఉండాలనే ఉద్దేశంతో కొత్త మార్గదర్శకాలు తీసుకొచ్చింది.

వినియోగదారులకు నష్టం కాకుండా..

ముఖ్యంగా డెరివేటివ్ మార్కెట్‌కు సంబంధించిన నియమాలతో డబ్బు అప్పుచేసే సంస్థల మధ్య నమ్మకాన్ని పెంచేందుకు, వినియోగదారులకు నష్టం కాకుండా చూడటానికి చర్యలు తీసుకుంది. ఈ నియమాలు NBFCలు కూడా తప్పనిసరిగా పాటించాల్సివుంటుంది. క్రెడిట్ కార్డు వాడకుండా పక్కన పెట్టినా చార్జీలు వర్తిస్తాయి. ఎలానో తెలుసుకోండి కేంద్ర ప్రభుత్వం NBFCలను ఇంకా బలంగా, ప్రజలకి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలని నిర్ణయించుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కూడా అదే దిశగా నడుస్తోంది. ప్రభుత్వం, RBI తీసుకుంటున్న చర్యల వల్ల NBFCలు తమ సామర్థ్యాన్ని పెంచుకొని మరింత మందికి రుణాలు అందించగలుగుతాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకుల సౌకర్యం లేనివారికి ఆర్థిక సహాయం అందించడంలో ఇవి కీలక పాత్ర పోషించగలగాలి. .

సరళంగా చెప్పాలంటే NBFC అంటే ఏమిటి?
నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (NBFC) అంటే కంపెనీల చట్టం, 1956 లేదా కంపెనీల చట్టం, 2013 కింద నమోదు చేయబడిన మరియు రుణాలు మరియు అడ్వాన్సుల వ్యాపారంలో నిమగ్నమైన కంపెనీ.
భారతదేశంలో NBFC ని ఎవరు ప్రారంభించారు?
డిసెంబర్ 1964 లో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI చట్టం 1934 ను సవరించింది మరియు NBFC లతో వ్యవహరించడానికి ఒక కొత్త అధ్యాయాన్ని ప్రవేశపెట్టింది. ఈ చట్టం భారతదేశంలో NBFC ల స్థాపనకు మార్గం సుగమం చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Read also: Amit Shah: రాజకీయాల రిటైర్మెంట్ తర్వాత వ్యవసాయం చేసుకుంటా: షా

#telugu News easier loans from NBFC NBFC loan rules NBFC regulation India non-banking finance companies RBI guidelines NBFC RBI lending reforms RBI loan norms

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.