కొత్త ఏడాదిపై ఎన్నో ఆశలతో మార్కెట్‌కు వెళ్లిన సామాన్య ప్రజలకు తీవ్ర నిరాశ ఎదురైంది. కూరగాయల ధరలు ఒక్కసారిగా భారీగా పెరగడంతో ఉదయం మార్కెట్‌కు(Price Hike) వెళ్లిన వారు ఆశ్చర్యానికి గురయ్యారు. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ వంటి ప్రధాన నగరాల్లో కూరగాయలు మాత్రమే కాదు.. పండ్లు, మాంసం, చికెన్, కోడిగుడ్ల ధరలు కూడా రెట్టింపు స్థాయికి చేరాయి.
Read Also: Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశవ్యాప్తంగా దిగుబడి తగ్గడంతో పెరిగిన ధరలు
దేశవ్యాప్తంగా పంటల దిగుబడి గణనీయంగా తగ్గడంతో డిమాండ్‌కు సరిపడా సరఫరా లేక కూరగాయల ధరలు(Price Hike) ఒక్కసారిగా పెరిగాయి. సాధారణ రోజుల్లో టమాట ధర కిలోకు రూ.20 నుంచి రూ.30 మధ్యే ఉండేది. అలాగే బీర, బెండ, కాకర, చిక్కుడు వంటి కూరగాయలు కూడా సాధారణంగా రూ.50 లోపే లభించేవి.
కానీ ప్రస్తుతం మార్కెట్ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ కూరగాయలన్నీ ఇప్పుడు కిలోకు రూ.80 నుంచి రూ.100 వరకు పలుకుతున్నాయి. సోరకాయ ఒక్కటి రూ.40కు చేరగా, పచ్చిమిర్చి కిలో ధర రూ.100ను తాకి వినియోగదారుల జేబులకు మంట పుట్టిస్తోంది.
మార్కెట్లో తాజా ధరల పరిస్థితి
ప్రస్తుతం స్థానిక మార్కెట్లలో టమాట కిలో ధర రూ.72గా ఉంది. ఉల్లిపాయలు కిలోకు రూ.42 ధర పలుకుతున్నాయి. మునగకాయల ధర మరింత భారం అయ్యింది — కిలోకు ఏకంగా రూ.400 చెల్లించాల్సి వస్తోంది. క్యారెట్ కిలో రూ.64గా ఉండగా, ఫ్రెంచ్ బీన్స్ కిలో రూ.135కు చేరింది. కోడిగుడ్ల రిటైల్ ధర ఒక్కటి రూ.8గా ఉంది. చికెన్ ధరలు కిలోకు రూ.280 నుంచి రూ.300 మధ్యలో విక్రయమవుతున్నాయి. క్యాబేజీ, కాలీఫ్లవర్, ముల్లంగి, బీన్స్, కాకరకాయ వంటి ఇతర కూరగాయల ధరలు కూడా భారీగా పెరిగాయి.
చలి తీవ్రతతో రైతులకు భారీ నష్టం
చలి తీవ్రత కూరగాయల పంటలపై తీవ్ర ప్రభావం చూపిందని రైతులు చెబుతున్నారు. సాధారణంగా ఎకరానికి వారానికి సుమారు 50 బాక్సుల టమాట దిగుబడి రావాల్సి ఉండగా, ప్రస్తుతం కేవలం 20 బాక్సులు కూడా రావడం కష్టంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధిక చలి కారణంగా సుమారు 70 శాతం వరకు దిగుబడి తగ్గిందని రైతులు అంచనా వేస్తున్నారు. అలాగే ఎకరాకు వారానికి 200 వరకు వచ్చే సోరకాయలు ఇప్పుడు కేవలం 80కే పరిమితమయ్యాయని తెలిపారు. ఈ పరిస్థితులే ధరలు పెరగడానికి ప్రధాన కారణంగా మారాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: