हिन्दी | Epaper
HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు

Latest News: Police Police Series: పోలీస్ పోలీస్ (జియో హాట్ స్టార్) సిరీస్ రివ్యూ

Anusha
Latest News: Police Police Series: పోలీస్ పోలీస్ (జియో హాట్ స్టార్) సిరీస్ రివ్యూ

తాజాగా థియేటర్ ప్రీమియర్స్ కాకుండా డిజిటల్ స్ట్రీమింగ్ కోసం రూపొందించబడిన వెబ్ సిరీస్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అందులో ఒకటి ‘పోలీస్ పోలీస్’, (Police Police) ఇది తమిళ భాషలో రూపొందించబడిన కొత్త వెబ్ సిరీస్. ఈ సిరీస్ పేరు చూస్తేనే, ఇది పోలీస్ ప్రపంచానికి సంబంధించి, కేసులు,పోలీస్ స్టేషన్లలో జరిగే సంఘటనల చుట్టూ కథ తిరుగుతుందని అంచనా వేయవచ్చు.

థాయ్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సిరీస్ కి ‘కోన్’ దర్శకత్వం వహించాడు. యాక్షన్ తో కూడిన కామెడీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సిరీస్, 4 ఎపిసోడ్స్ గా అందుబాటులోకి వచ్చింది. ఈ నెల 19వ తేదీ నుంచి ‘జియో హాట్ స్టార్’ (Jio Hot Star)లో తెలుగులోను స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ మూవీ ఎలా ఉందొ రివ్యూ లో తెలుసుకుందాం.

కథ

మదురై పోలీస్ స్టేషన్ లో రాజా ఎస్.ఐ.గా పనిచేస్తూ ఉంటాడు. అక్కడ ఎస్.పి.గా ఆర్తన (సుజిత) ఉంటుంది. ఈ ఇద్దరూ అక్కాతమ్ముళ్లు.  మొదటి నుంచి కూడా రాజాకి ఆవేశం .. దూకుడు ఎక్కువ. ఫలితంగా డిపార్టుమెంటు నుంచి వచ్చే ఫిర్యాదులను ఆర్తన ఫేస్ చేస్తూ ఉంటుంది. ఆవేశాన్ని.. తొందరపాటును తగ్గించుకోమని రాజాకి చెబుతూ ఉంటుంది. అయితే రాజా మాత్రం తనదైన దారిలో ముందుకు వెళుతూనే ఉంటాడు. 

అదే పోలీస్ స్టేషన్ లో పోలీస్ ఆఫీసర్ (Police officer) గా ఉన్న ‘వావర్’, రాజాపై పోటీగా ఉంటాడు. రాజాను క్రాస్ చేసే వెళ్లే అవకాశం కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. రాజా కోపం వావర్ కి మేలు చేస్తూ ఉంటుంది. అయితే ఈ విషయం ఆర్తన దృష్టికి కూడా వస్తుంది. రాజాను హెచ్చరించడం కోసం అతని భార్యాపిల్లలను గుర్తుచేస్తూ ఉంటుంది. అయినా అతను తన తీరు మాత్రం మార్చుకోడు. 

కథనం

ఇక అదే ఊళ్లో మురళి అనే యువకుడు తన బామ్మతో కలిసి నివసిస్తూ ఉంటాడు. అతని బామ్మ శివగామి, ఒక గుడి దగ్గర పూలకొట్టు నడుపుతూ ఉంటుంది. ఎస్.ఐ. కావాలనుకున్న మురళి, కొన్ని కారణాల వలన జైలుకు వెళ్లొస్తాడు. అందువలన అతనికి ఎక్కడా ఏ పనీ దొరక్కుండా పోతుంది. అలాంటి పరిస్థితులలోనే ఒక లాయర్ తో అతనికి పరిచయమవుతుంది.

Police Police Series
Police Police Series

పోలీస్ ఆఫీసర్ రాజా నేపథ్యం ఏమిటి? మురళి ఎందుకు జైలుకు వెళ్లొచ్చాడు? లాయర్ తో అతని పరిచయం ఎంతవరకూ వెళుతుంది? అనేది మిగతా కథ.  పోలీస్ కథలను రూపొందించడంలో తమిళ దర్శకులు మంచి నైపుణ్యాన్ని చూపుతూ ఉంటారు. అందువలన అటు వైపు నుంచి వచ్చిన ఈ సిరీస్ పట్ల సహజంగానే ఆసక్తిని చూపడం జరుగుతూ ఉంటుంది.

విశ్లేషణ

పోలీస్ డిపార్టుమెంటులో రకరకాల స్వభావాలు గల అధికారులు తారసపడుతూ ఉంటారు. అలాంటి స్వభావాలు కలిగిన వాళ్లందరూ ఒకేచోట కలిసి పనిచేస్తే ఎలా ఉంటుందనేది ఆవిష్కరించిన కథగా ‘పోలీస్ పోలీస్’ కనిపిస్తుంది.ఒక పోలీస్ ఆఫీసర్ .. దొంగగా ముద్రపడిన ఒక యువకుడు .. జూనియర్ లాయర్ గా పనిచేసే ఒక యువతి పాత్రను హైలైట్ చేస్తూ వెళ్లారు. పాత్రలను డిజైన్ చేసిన విధానం ..

సన్నివేశాలను సహజత్వానికి దగ్గరగా ఆవిష్కరిస్తున్న తీరు ఆకట్టుకుంటున్నాయి. అయితే ఇంతవరకూ కథలో ప్రధానమైన సమస్య ఏమిటనేది తెరపైకి రాలేదు. అప్పుడు గానీ ఈ కథ ఎటువైపు వెళ్లనుందనేది అర్థంకాదు.అయితే ఈ కథలో ఆసక్తిని రేకెత్తించే ఒక అంశం మాత్రం కనిపిస్తోంది.

పవర్ఫుల్ గా కనిపించే పోలీస్ ఆఫీసర్ కీ .. జూనియర్ లాయర్ గా పని చేస్తున్న యువతికి, దొంగగా ముద్రపడిన యువకుడి పాత్ర దగ్గరవుతూ ఉంటుంది. ఈ మూడు పాత్రలు కలిసి మున్ముందు చేయనున్న పనులు ఏమిటనే ఒక కుతూహలాన్ని ఈ సిరీస్ రేకెత్తించగలిగింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870