భారతదేశంలో రూల్స్ మారడం కొత్త విషయం కాదు. ఇప్పుడు పాన్ కార్డ్ సంబంధిత నియమాల్లో కీలక మార్పు చోటు చేసుకుంది. ఈ మార్పు తాలుకూ ప్రతి పన్ను చెల్లించేవాడు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే, ఇబ్బందులు తప్పవు.పాన్-ఆధార్ (PAN-Aadhaar) లింక్ గడువును భారత ప్రభుత్వం డిసెంబర్ 31, 2025 వరకు (Until December 31, 2025) పొడిగించింది. ఈ గడువులోపే లింక్ చేయకపోతే మీ పాన్ కార్డ్ డీయాక్టివ్ అవుతుంది. అయినా దాన్ని ఉపయోగిస్తే ఆదాయపు పన్ను శాఖ చట్టపరంగా చర్యలు తీసుకుంటుంది.పాన్ డీయాక్టివ్ అయినా (knowingly) ఉపయోగిస్తే, అది శిక్షార్హం. ఈ సందర్భంలో ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ రూ.10,000 వరకు ఫైన్ వేయవచ్చు. అందుకే ముందుగానే జాగ్రత్తగా ఉండటం మంచిది.
పాన్ ఎందుకు అంత ముఖ్యమైందంటే?
పాన్ కార్డు ఒక గుర్తింపు పత్రం మాత్రమే కాదు. ఇది ఐటీ రిటర్నులు ఫైలింగ్, బ్యాంకు లావాదేవీలు, పెట్టుబడులు, డిమ్యాట్ ఖాతాలు వంటి ఎన్నో ఆర్థిక కార్యకలాపాలకు కీలకం. అందుకే ఇది యాక్టివ్ గా ఉండాలి.
మీ పాన్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి?
ఇన్‌కం ట్యాక్స్ e-Filing వెబ్‌సైట్‌లోకి వెళ్లండి.
Quick Links సెక్షన్‌లో “Verify PAN Status” పై క్లిక్ చేయండి.
పేరు, జన్మతేది, మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి.
OTP వచ్చిన తర్వాత నమోదు చేయండి.
మీ పాన్ స్టేటస్ తేలిపోతుంది.
డీయాక్టివేట్ అయితే ఎలా యాక్టివ్ చేయాలి?.
e-Filing పోర్టల్‌లో “Link Aadhaar” పై క్లిక్ చేయండి.
పాన్, ఆధార్ వివరాలు ఎంటర్ చేయండి.
OTP నమోదు చేసి లింక్ పూర్తి చేయండి.
వివరాల్లో తేడాలుంటే, దాన్ని సరిచేయండి.
అవసరమైతే సంబంధిత అధికారికి లేఖ రాయండి.
లింక్ చేయకపోతే ఎదురయ్యే సమస్యలు.
ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయలేరు.
బ్యాంకులో పెద్ద మొత్తాల లావాదేవీలు చేయలేరు.
పెట్టుబడులు పెట్టడంలో ఇబ్బందులు.
TDS ఎక్కువగా కట్ అవుతుంది (20%).
ఐటీ రిఫండ్లు పొందలేరు.
Read Also : Sonia Gandhi : సోనియాగాంధీ ఆసుపత్రిలో చేరిక – ఆరోగ్యం స్థిరంగా ఉందని స్పష్టం