📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్ జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! పెరగనున్న టీవీల ధరలు! స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్ జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! పెరగనున్న టీవీల ధరలు! స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్

US: పహల్గాం ఉగ్రదాడి వెనుక ఉంది ఆ గ్రూపే.. అమెరికా కీలక నిర్ణయం

Author Icon By Vanipushpa
Updated: July 18, 2025 • 3:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (LeT)కు అనుబంధంగా ఉన్న ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ (TRF)ను అమెరికా విదేశీ ఉగ్రవాద సంస్థ (Foreign Terrorist Organization – FTO)గా.. ప్రత్యేకంగా గుర్తించబడిన గ్లోబల్ టెర్రరిస్ట్ (Specially Designated Global Terrorist – SDGT)గా ప్రకటించింది. ఈ కీలక నిర్ణయాన్ని గురువారం అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. ఏప్రిల్ 22వ తేదీన జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి టీఆర్ఎఫ్ బాధ్యత వహించిన నేపథ్యంలో అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ దాడిలో మొత్తంగా 26 మంది అమాయకు పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

పహల్గామ్ దాడికి న్యాయం..

అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో మాట్లాడుతూ.. పహల్గామ్ దాడికి న్యాయం చేయాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారని చెప్పారు. అందులో భాగంగానే తాము ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. టీఆర్ఎఫ్.. లష్కరే తోయిబా ఎఫ్టీఓ, ఎస్‌డిజిటికి అనుబంధ సంస్థ అని రూబియో వెల్లడించారు. భారత భద్రతా దళాలపై 2024లో జరిగిన పలు దాడులకు కూడా టీఆర్ఎఫ్ బాధ్యత వహించిందని ఆయన వెల్లడించారు. ఈ చర్య అమెరికా జాతీయ భద్రతా ప్రయోజనాలను పరిరక్షించడం, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం పట్ల ట్రంప్ పరిపాలన నిబద్ధతను తెలియజేస్తుందని అన్నారు. అలాగే 2008లో ముంబయిలో జరిగిన బాంబు పేలుళ్ల తర్వాత ఇదే అత్యంత దారుణ ఘటన అని చెప్పుకొచ్చారు.

US: పహల్గాం ఉగ్రదాడి వెనుక ఉంది ఆ గ్రూపే.. అమెరికా కీలక నిర్ణయం

విదేశీ ఉగ్రవాద సంస్థగా టీఆర్ఎఫ్‌
ఈ పరిణామంపై వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయం హర్షం వ్యక్తం చేసింది. “భారత్-అమెరికా ఉగ్రవాద వ్యతిరేక సహకారం బలంగా ఉందని ఇది మరోసారి రుజువు చేస్తుంది” అని పేర్కొంది. టీఆర్ఎఫ్‌ను విదేశీ ఉగ్రవాద సంస్థగా, ప్రత్యేకంగా గుర్తించబడిన గ్లోబల్ టెర్రరిస్ట్‌గా జాబితా చేసినందుకు అమెరికా విదేశాంగ శాఖకు కృతజ్ఞతలు తెలిపింది. “ఉగ్రవాదం పట్ల సున్నా సహనం!” అనే భారతదేశ వైఖరిని పునరుద్ఘాటించింది.

పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ మద్దతు
టీఆర్ఎఫ్ 2019లో ఏర్పడింది. భారత ప్రభుత్వం 2023లో దీనిని నిషేధించింది. ఈ సంస్థ ఆన్‌లైన్‌లో యువతను రిక్రూట్ చేయడంలో.. ఉగ్రవాదుల చొరబాటుకు సహకరించడంలో, పాకిస్థాన్ నుంచి జమ్మూ కాశ్మీర్‌లోకి ఆయుధాలు, మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేయడంలో చురుకుగా ఉంది. టీఆర్ఎఫ్ అధిపతి షేక్ సజ్జాద్ గుల్‌ను భారతదేశం ఇప్పటికే ఉగ్రవాదిగా ప్రకటించింది. ఈ సంస్థ కార్యకలాపాలకు పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ మద్దతు ఉందని నిఘా వర్గాలు తెలిపాయి.
పహల్గామ్ దాడులకు ప్రతీకారంగా భారతదేశం మే 7న ‘ఆపరేషన్ సిందూర్’ను ప్రారంభించి.. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను దాడులు చేసింది. అలాగే ఆపరేషన్ సిందూర్, ఉగ్రవాదులకు పాక్ చేస్తున్న సాయం గురించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పలు దేశాల రాయబారులు, విదేశాంగ మంత్రులకు ప్రత్యేక బ్రీఫింగ్ ఇచ్చింది .

వ్యక్తిత్వాలు › మార్కో-రూబియో…
మార్కో రూబియో 20 సంవత్సరాలకు పైగా ప్రభుత్వ కార్యాలయంలో పనిచేశాడు, కానీ అతని జీతం ఎల్లప్పుడూ లాభదాయకంగా లేదు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Bhupesh Baghel: లిక్క‌ర్ స్కామ్‌.. మాజీ సీఎం భూపేశ్ భగేల్ ఇంట్లో ఈడీ

Counter-Terrorism India Security Kashmir Terrorism militant group Pahalgam Terror Attack terror group US action US sanctions

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.