నూతన వివాహ వేడుకల్లో ఎప్పటిలాగే ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన నీతా అంబానీ(Nita Ambani), ఈసారి బంగారం నేయించిన చీరలో అందరినీ ఆశ్చర్యపరిచారు. ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహ వేడుకలో ఆమె ధరించిన చీర విశేషంగా చర్చనీయాంశమైంది.ఇండియన్ బిలియనీర్, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణిగానే కాకుండా సక్సెస్‌ఫుల్ బిజినెస్ ఉమెన్‌గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. నీతా అంబానీ (Nita Ambani) ఏ కార్యక్రమం చేపట్టినా అదో స్పెషల్‌గా, శ్రద్దగా చేసుకుంటూ పోతారు. ప్రతి పనిలో ప్రత్యేకత చాటుకుంటారు. ఇక నీతా ధరించే దుస్తుల విషయంలో మాత్రం అంతా చర్చించుకునే విధంగా స్పెషల్‌గా డిజైన్స్ ఉండేలా జాగ్రత్త పడతారు. సందర్భానికి తగ్గటుగా ఆమె వస్త్రధారణ ఉంటుంది. చీరలు, నగలు అన్నీ ఓ రేంజ్‌లో ఉంటాయి. రిలయన్స్ యజమాని ఆ మాత్రం ఉంటుంది కదా మరి. అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో ధరించిన అవుట్‌ఫిట్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. పెంపుడు కుక్కకు వేసే బట్టల విషయంలోనే ఎంతో జాగ్రత్తలు తీసుకునే నీతా అంబానీ(Nita Ambani).. తన చీరల విషయంలో ఇంకెంత శ్రద్ధ చూపుతారో అర్థం చేసుకోవచ్చు. తాజాగా గోల్డెన్ శారీలో కనిపించి అదరగొట్టారు. ఆ చీర ధరెంతో తెలిస్తే మాత్రం షాక్ అవుతారు. అవును… గోల్డ్ అండ్ బ్లాక్ కలర్ శారీలో తళుక్కుమన్నారు ఈ బిలియనీర్.
చీర ధర ఎంతో తెలుసా?
ఇక బంగారంతో నేసిన చీర ధర అక్షరాలా మూడున్నర కోట్ల రూపాయల పైనే ఉంటుందట. ప్రముఖ డిజైనర్లు అబు జానీ, సందీప్ ఖోస్లా ఈ చీరను డిజైన్ చేసారు. బంగారు పోగులతో పాటు సంప్రదాయ నఖాషీ అలాగే జర్దోసీ ఎంబ్రాయిడరీని చీరలో పొందుపర్చారు. వీటితో పాటు ఎంతో ఖరీదైన స్వరోవ్ స్కీ క్రిస్టల్స్‌తో ఎంతో ఆకర్షణీయంగా చీరను తయారు చేశారు. కాగా ఈ విషయం తెలిసి నెటిజన్లు అవాక్కవ్వడమే కాకుండా రకరకాలు కామెంట్స్ పెడుతున్నారు. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటే ఇదేనేమో అంటూ పోస్టులు పెడుతున్నారు. ఎప్పటిలాగే ఆమెకు బాగా సూట్ అయిందని మరికొంత మంది యూజర్స్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. నీతా అంబానీ(Nita Ambani) మాదిరి సెలెబ్రిటీలు మాత్రమే కాకుండా, ఫ్యాషన్ ప్రపంచం కూడా ఆమెకు రోల్ మోడల్‌లా చూస్తోంది. సంప్రదాయంతో మోడర్న్ టచ్ కలిపిన వస్త్రధారణ ఆమె ప్రత్యేకత.
Read Also: Mukesh Ambani: జియో-బ్లాక్‌రాక్ మ్యూచువల్ ఫండ్ మార్కెట్‌లోకి ఎంట్రీ