ప్రపంచ వ్యాప్తంగా 40 ఏళ్ల లోపు వయసున్న అత్యంత విజయవంతమైన యువ బిలియనీర్లను గుర్తించే ఫోర్బ్స్ ప్రతిష్ఠాత్మక ‘40 అండర్ 40’ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఈసారి భారత సంతతికి చెందిన నలుగురు యువ వ్యాపారవేత్తలు చోటు సంపాదించి దేశానికి గర్వకారణంగా నిలిచారు. ఈ లిస్ట్‌లో భారత్ నుంచి ఏకైక బిలియనీర్‌గా జెరోధా కో-ఫౌండర్ నిఖిల్ కామత్(NikhilKamath) నిలవడం విశేషం. ప్రస్తుతం 39 ఏళ్ల వయసున్న నిఖిల్ కామత్, భారత స్టాక్ మార్కెట్ రంగంలో డిస్కౌంట్ బ్రోకింగ్‌కు కొత్త నిర్వచనం ఇచ్చిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఆయన నెట్‌వర్త్ సుమారు 3.3 బిలియన్ డాలర్లుగా ఫోర్బ్స్ అంచనా వేసింది.
Read also: Breaking News: Samsung: ఫిబ్రవరిలో శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ రిలీజ్
నిఖిల్ కామత్‌తో పాటు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత స్టార్టప్ ‘మెర్కోర్’ను స్థాపించిన ఆదర్శ్ హిరేమత్ మరియు సూర్య మిద్దా కూడా ఈ ప్రతిష్ఠాత్మక జాబితాలో చోటు దక్కించుకున్నారు. కేవలం 22 ఏళ్ల వయసులోనే బిలియనీర్లుగా ఎదిగిన వీరు, ఈసారి లిస్ట్‌లో అత్యంత చిన్న వయసు వ్యాపారవేత్తలుగా నిలిచారు.
టెక్నాలజీ, ముఖ్యంగా AI రంగంలో భారత యువత వేగంగా ఎదుగుతున్న తీరు, ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. చిన్న వయసులోనే(NikhilKamath) వినూత్న ఆలోచనలతో స్టార్టప్‌లను స్థాపించి బిలియనీర్లుగా ఎదగడం, భారతీయ యువతలో ఉన్న వ్యాపార దృక్పథానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఫోర్బ్స్ ‘40 అండర్ 40’ జాబితాలో భారత సంతతికి చెందిన యువ వ్యాపారవేత్తల సంఖ్య పెరుగుతుండటం, భవిష్యత్తులో భారత్ గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్షిప్ హబ్‌గా మారనున్న సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: