NewTaxlaw 2026: 2026కు సంబంధించిన కొత్త ఆదాయపు పన్ను చట్టం ముసాయిదా నిబంధనలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ప్రతిపాదనలపై ఫిబ్రవరి 22 వరకు ప్రజల నుంచి సలహాలు, అభిప్రాయాలు స్వీకరించనున్నారు. కొత్త నిబంధనలతో ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలకు గణనీయమైన పన్ను ప్రయోజనాలు లభించనున్నట్లు తెలుస్తోంది.
Read Also:Premium Cars: ఆల్పినాకు కొత్త లోగో – BMW కీలక బ్రాండింగ్ మార్పులు
ఈ ముసాయిదాలో ఉద్యోగులకు వేతనేతర ప్రయోజనాల పరిమితులను పెంచడం, వాహనాల సామర్థ్యాన్ని బట్టి మినహాయింపులు కల్పించడం వంటి ప్రతిపాదనలు ఉన్నాయి. అలాగే భోజన విలువ, గిఫ్ట్ వోచర్లు, వడ్డీ లేని రుణాలు, విద్యా అలవెన్సులు, హాస్టల్ అలవెన్సుల పెంపుదల వంటి అంశాలు ఉద్యోగులకు ఊరట కలిగిస్తాయి.
బ్యాంకు నగదు విత్‌డ్రాయల్‌లు, డిపాజిట్లపై పాన్ కార్డు అవసరమైన పరిమితులను పెంచినట్లు సమాచారం. స్థిరాస్తి కొనుగోలు–అమ్మకాలు, ద్విచక్ర వాహనాల కొనుగోళ్లు, హోటల్ బిల్లులపై కూడా పాన్ కార్డు నిబంధనల్లో కొన్ని సడలింపులు ప్రతిపాదించారు. ఇంటి అద్దె అలవెన్సు (HRA) విషయంలో కూడా కీలక మార్పులు చేశారు. హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో HRA మినహాయింపును 40 శాతం నుంచి 50 శాతానికి పెంచే ప్రతిపాదన ఉంది. ఈ కొత్త పన్ను చట్ట ముసాయిదా అమలులోకి వస్తే ఉద్యోగులు, సామాన్య ప్రజలకు గణనీయమైన పన్ను భార తగ్గింపు లభిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: