📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు

News Telugu : తప్పుడు ప్రకటనలు ఇచ్చే సంస్థలపై కఠిన చర్యలు

Author Icon By Sai Kiran
Updated: August 21, 2025 • 4:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశం

News Telugu : హైదరాబాద్ మెడిసిన్ విషయంలో తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇచ్చే సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని డ్రగ్ కంట్రోల్ అథారిటీ అధికారులను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశిం చారు. ఈ మేరకు డ్రగ్ కంట్రోల్ అథారిటీ పని తీరుపై (News telugu) బుధవారం, వెంగళరావునగర్ లోని ఇండి యన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో మంత్రి సమీక్ష సమావేశం నిర్వ హించారు.

2024, 2025లో డీసీఏ వర్క్ ప్రోగ్రెస్ను మంత్రికి డీసీఏ డైరెక్టర్ జనరల్ తనిఖీలు నిర్వహించగా నిబంధనలు ఉల్లంఘించిన 4142 సంస్థలపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. అలాగే 2025లో జనవరి నుంచి జూలై వరకు 16,481 తనిఖీలు చేసి నిబంధనలు ఉల్లంఘించిన 2827 సంస్థలపై చర్యలు తీసుకున్నట్టు తెలిపారు.

2024 జనవరి నుంచి 2025 జూలై వరకు 7200 మెడిసిన్ సాంపిల్స్ను టెస్ట్ చేయగా, అందులో 186 నాసిరకం మెడిసిన్గా తేలిందని, సంబంధిత సంస్థలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నట్టు మంత్రికి చెప్పారు. సుమారు 700 కేసులు బుక్ చేశామని వివరించారు. ప్రతి కేసులోనూ దోషులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి దామోదర ఆదేశించారు.

కంపెనీలు, వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు

జనాలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇస్తూ, మెడిసిన్ అమ్మకాలు జరుపుతున్న కంపెనీలు, వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. స్పూరి యస్, నాట్ స్టాండర్డ్ డ్రగ్స్ తయారు చేస్తున్న ఫార్మా కంపెనీలు, డిస్ట్రిబ్యూటర్లు, అమ్మకందారులపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు.

మెడిసిన్ అనేది ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న అంశమని, ఈ విషయంలో ఎలాంటి ఉపేక్ష పనికిరాదన్నారు. పదే పదే నిబంధనలు ఉల్లఘింస్తున్న సంస్థలను చట్టప్రకారం పర్మినెంట్గా క్లోజ్ చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. నకిలీ, నిషేధిత మందుల తయారీ, అమ్మకం దారులపై అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేయాలని మంత్రి ఆదేశించారు.

మెడిసినన్ను ఆహార పదార్థా లుగా చూపిస్తూ, వాటి తయారీ, అమ్మకాలు చేపడుతున్నవారిపై చర్యలు తీసుకోవాలన్నారు. యాంటి బయాటిక్ రెసిస్టెన్స్ అనేది పెద్ద ముప్పుగా పరిణమిస్తోందని, నిబంధనలు ఉల్లంఘించి యాంటిబయాటిక్స్ అమ్మకాలు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.

త్వరలో మరిన్ని డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులను మంజూరు చేసి, రిక్రూట్ చేస్తామని..

డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు ప్రేరేపిత మెడిసిన్ అమ్మకాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డీసీఏ డీజీని మంత్రి ఆదేశించారు. డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్ అప్గ్రేడేషన్ పనులను స్పీడప్ చేయాలని మంత్రి ఆదేశించారు.

త్వరలో మరిన్ని డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులను మంజూరు చేసి, రిక్రూట్ చేస్తామని తద్వారా డ్రగ్ కంట్రోల్ అథారిటీని మరింత బలోపేతం చేస్తామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ప్రజలకు క్వాలిటీ మెడిసిన్, క్వాలిటీ ఫుడ్ అం దించే విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవ హరిస్తుందని మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు.

Read also :

https://vaartha.com/latest-news-telangana-crime-news-unable-to-bear-the-harassment-of-her-future-groom-a-young-woman-commits-suicide/crime/533778/

Breaking News in Telugu Damodar Rajanarsimha DCA Telangana Drug Control Authority fake medicines in Hyderabad health news Hyderabad Hyderabad latest news Latest Telugu News medicine news in Telugu pharma companies Telangana substandard medicines India Telangana Health Minister Telugu News Telugu News Live

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.