📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం

News Telugu: BSNL- బీఎస్ఎన్ఎల్ గుడ్ న్యూస్..రూ. 151కే బోలెడన్ని సదుపాయాలు

Author Icon By Sharanya
Updated: August 29, 2025 • 3:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

News Telugu: ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) వినియోగదారులకు భారీ గిఫ్ట్ ఇచ్చింది. ప్రైవేట్ కంపెనీల పోటీలో వెనుకబడకుండా ఉండేందుకు, కొత్త ఆఫర్లతో ముందుకు వస్తోంది. తాజాగా బీఎస్ఎన్ఎల్ తన ప్రత్యేక ప్లాన్‌ (BSNL special plan)ను ప్రకటించింది.

ఓటీటీల క్రేజ్ పెరుగుతున్న తరుణం

ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచి మారిపోతోంది. థియేటర్లకు వెళ్లే వారి సంఖ్య తగ్గిపోగా, ఎక్కువమంది ఓటీటీల్లో సినిమాలు, వెబ్ సిరీస్‌లు, థ్రిల్లర్, క్రైమ్, యాక్షన్, రొమాన్స్ వంటి విభిన్న కంటెంట్‌ను వీక్షిస్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ కోసం వంటల షోలు, ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్స్ కూడా విస్తృతంగా అందుబాటులోకి వస్తుండటంతో డిస్నీ హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, జీ5, ప్రైమ్ వీడియో, సోనీ లివ్ వంటి ప్లాట్‌ఫార్మ్‌లకు విశేషమైన ఆదరణ లభిస్తోంది.

News Telugu

టెలికాం సంస్థల పోటీ

ఈ నేపథ్యంలోనే జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ప్రైవేట్ టెలికాం సంస్థలు తమ రీఛార్జ్ ప్లాన్లలో భాగంగా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లను అందిస్తూ వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. అదే సమయంలో ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా పోటీలో నిలబడేందుకు కొత్త అడుగులు వేస్తోంది.

బీఎస్ఎన్ఎల్ బీఐటీవీ సర్వీస్ ప్రారంభం

ఈ ఏడాది ఫిబ్రవరిలో బీఎస్ఎన్ఎల్ తన BI TV సర్వీస్‌ను ప్రారంభించింది. మొదట ఫ్రీ టెస్టింగ్‌గా అందించిన ఈ సర్వీస్ ద్వారా లైవ్ టీవీ ఛానెల్స్‌తో పాటు ఓటీటీ కంటెంట్ అందించబడింది. ఇప్పుడు ఈ సర్వీస్‌ను ప్రత్యేక సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌తో అధికారికంగా ప్రవేశపెట్టింది.

రూ.151 ప్లాన్ ప్రత్యేకతలు

కొత్తగా ప్రవేశపెట్టిన రూ.151 రీఛార్జ్ (Rs.151 recharge) ప్లాన్‌లో వినియోగదారులకు 25కుపైగా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు లభించనున్నాయి. అదనంగా 450కుపైగా లైవ్ టీవీ ఛానెల్స్ కూడా అందించబడుతున్నాయి. సోనీ లివ్, సన్ నెక్ట్స్, జీ5, ఈటీవీ విన్, ఆహా, ఫ్యాన్ కోడ్, డిస్కవరీ ఇలా పాపులర్ ప్లాట్‌ఫార్మ్‌లు ఈ ప్లాన్‌లో భాగమవుతున్నాయి.

వ్యాలిడిటీ వివరాలు

ఈ ప్లాన్‌కు సంబంధించి స్పష్టమైన వ్యాలిడిటీని బీఎస్ఎన్ఎల్ ప్రకటించకపోయినా, 30 రోజుల పాటు మాత్రమే అందుబాటులో ఉండవచ్చని టెలికాం టాక్ రిపోర్ట్ చేస్తోంది. అలాగే రూ.28, రూ.29 ధరలకే మరో రెండు బీఐటీవీ ఓటీటీ ప్లాన్లు కూడా త్వరలో ప్రకటించనుందని సమాచారం.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/telugu-news-vandebharath-vande-bharat-trains-central-key-decision/business/537813/

Breaking News BSNL BTV BSNL Good News BSNL Live TV BSNL OTT Offer BSNL Rs151 Plan latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.