📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

HIV disease: హెచ్‌ఐవీ వ్యాధికి కొత్త ఇంజెక్షన్‌

Author Icon By Shobha Rani
Updated: June 21, 2025 • 1:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హెచ్‌ఐవీ వ్యాధి(HIV disease) ని అదుపు చేసే ఇంజెక్షన్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ ఇంజెక్షన్‌ను ఏడాదికి రెండుసార్లు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పటి వరకు ఈ వ్యాధిని అదుపులో పెట్టడానికి రోజూ ట్యాబ్లెట్లు వేసుకోవాల్సి వస్తోంది. దీనికి బదులు ఇంజెక్షన్‌ను ఆవిష్కరించడం ఆసక్తికర పరిణామమని, ఈ వ్యాధి వ్యాప్తిని నిరోధించడానికి వీలుకలుగుతుందని ఔషధ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే ఏటా 13 లక్షల హెచ్‌ఐవీ (HIV disease) కొత్త కేసులు నమోదవుతున్న విషయాన్ని నిపుణులు గుర్తు చేస్తున్నారు.

లెనకాపవిర్‌ – ఆధునిక ఇంజెక్షన్‌

ఈ వ్యాధిగ్రస్తుల కోసం లెనకాపవిర్‌ అనే ఔషధ ఇంజెక్షన్‌ను బహుళ జాతి ఔషధ సంస్థ గిలీడ్‌ సైన్సెస్‌ ఆవిష్కరించింది. దీన్ని యెజ్టుగో అనే బ్రాండుపై విక్రయించనుంది. హెచ్‌ఐవీ వ్యాధి (HIV disease) ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందకుండా ఈ ఇంజెక్షన్‌ నిరోధిస్తుందని, పెద్దలు- పిల్లలపై నిర్వహించిన పరీక్షల్లో ఈ విషయం నిర్ధారణ అయినట్లు గిలీడ్‌ సైన్సెస్‌ వెల్లడించింది. ఆఫ్రికా దేశాల్లో ఔషధ పరీక్షలు నిర్వహించగా 99.9% సమర్థత కనిపించినట్లు పేర్కొంది. హెచ్‌ఐవీ వ్యాప్తి రోధించడంలో సమర్థత

లెనకాపవిర్‌ జనరిక్‌ ఇంజెక్షన్‌ను ఉత్పత్తి చేసి, తక్కువ ఆదాయాలు గల 120 దేశాల్లో విక్రయించటానికి గిలీడ్‌ సైన్సెస్‌ గత ఏడాదిలో 6 ఫార్మా (Pharma) కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ కంపెనీలు లెనకాపవిర్‌ జనరిక్‌ ఇంజెక్షన్‌ అందుబాటులోకి తీసుకురావడానికి కొంత సమయం పడుతుంది.

తాత్కాలికంగా 20 లక్షల డోసుల పంపిణీ

20 లక్షల డోసుల ఇంజెక్షన్‌ను పంపిణీ చేయడానికి గిలీడ్‌ సైన్సెస్‌ సిద్ధమైంది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితికి చెందిన గ్లోబల్‌ ఫండ్, యూఎస్‌ ప్రభుత్వానికి చెందిన పెప్‌ఫార్‌ కార్యక్రమంతో ఒప్పందాలు కుదుర్చుకుంది. కానీ పెప్‌ఫార్‌ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిధుల కేటాయింపు తగ్గించారు. దీంతో ఈ ఇంజెక్షన్‌ను కొనుగోలు చేసే వ్యవహారం పెండింగ్‌లో పడింది.

HIV disease: హెచ్‌ఐవీ వ్యాధికి కొత్త ఇంజెక్షన్‌

తక్కువ ధర లక్ష్యంగా – జనరిక్‌ ఇంజెక్షన్‌

ఈ ఇంజెక్షన్‌ ఖర్చే మింగుడుపడని అంశంగా ఉంది. అమెరికాలో ఒక వ్యక్తి, ఒక ఏడాదిలో రెండుసార్లు ఈ ఇంజెక్షన్‌ చేయించుకునేందుకు అయ్యే ఖర్చు 28,218 డాలర్లు (సుమారు రూ.24.40 లక్షలు) కావడం గమనార్హం. ఈ ఖర్చును అభివృద్ధి చెందిన దేశాల్లోని ప్రజలు కూడా భరించలేరనే ఆందోళన వ్యక్తమవుతోంది. మనదేశంలో ఈ ఇంజెక్షన్‌ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో, దాని ధర ఎంత ఉంటుందో స్పష్టత లేదు. ఈ ఇంజెక్షన్‌ ధర తగ్గించేందుకు కసరత్తు చేస్తున్నట్లు గిలీడ్‌ సైన్సెస్‌ వెల్లడించింది.

అమెరికా నిధుల కేటాయింపులో కోత

PEPFAR కార్యక్రమానికి అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ (Trump) నిధుల కేటాయింపులో కోత వేయడం వల్ల కొన్ని ప్రాజెక్టులు మరియు కొనుగోళ్లు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి. హెచ్‌ఐవీ నివారణలో సరికొత్త దారులు తెరుచుకున్నాయి.ఇంజెక్షన్‌ రూపంలో చికిత్స అందుబాటులోకి రావడం వల్ల ఔషధ భద్రత, వినియోగంలో సరళత, వ్యాధి వ్యాప్తి తగ్గింపు—all-in-oneగా సాధ్యపడే అవకాశముంది. ధర తగ్గితే, ప్రపంచవ్యాప్తంగా వాడకంలో విస్తృతి సాధ్యమే.

Read Also: Iran: హర్మూజ్ జలసంధిని మూసేస్తామని ఇరాన్ వార్నింగ్

Breaking News in Telugu for HIV GileadSciences Google news Google News in Telugu HIVInjection Latest News in Telugu Lenacapavir New injection Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.