हिन्दी | Epaper

Credit Card Rules: ఏప్రిల్ 1 నుంచి క్రెడిట్ కార్డ్ కొత్త రూల్స్

Tejaswini Y
Credit Card Rules: ఏప్రిల్ 1 నుంచి క్రెడిట్ కార్డ్ కొత్త రూల్స్

Credit Card Rules: వచ్చే ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ 1) నుంచి క్రెడిట్ కార్డ్ వాడకం మరియు ఆదాయపు పన్ను (IT) నిబంధనలలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు తీసుకువస్తోంది. కార్డ్ వినియోగదారులు ఆర్థిక క్రమశిక్షణ పాటించేలా మరియు పారదర్శకత పెంచేలా ఈ నిర్ణయాలు ఉన్నాయి.

Read also: Fixed Deposit : ఫిక్స్డ్ డిపాజిట్ కు ఎక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంకులు ఇవే!

Credit Card Rules: New credit card rules from April 1
Credit Card Rules: New credit card rules from April 1

ఐటీ శాఖ నిఘా పెరిగే అంశాలు:

  • రూ. 10 లక్షల పరిమితి: ఒక ఆర్థిక సంవత్సరంలో క్రెడిట్ కార్డ్ బిల్లుల రూపంలో రూ. 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ చెల్లింపులు జరిపితే, ఆ సమాచారాన్ని బ్యాంకులు తప్పనిసరిగా ఆదాయపు పన్ను శాఖకు నివేదించాలి.
  • నగదు చెల్లింపులపై నిఘా: ఒకేసారి రూ. 1 లక్ష లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని నగదు రూపంలో క్రెడిట్ కార్డ్ బిల్లుగా చెల్లిస్తే ఐటీ శాఖకు నోటీసు వెళ్తుంది.
  • పాన్ కార్డు తప్పనిసరి: కొత్త క్రెడిట్ కార్డ్ పొందాలనుకునే వారు కచ్చితంగా పాన్ (PAN) కార్డును సమర్పించాలి.

వినియోగదారులకు వెసులుబాటు:

  • అడ్రస్ ప్రూఫ్‌గా స్టేట్‌మెంట్: ఇకపై పాన్ కార్డు దరఖాస్తు చేసుకునే సమయంలో క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌ను చిరునామా ధ్రువీకరణ పత్రంగా (Address Proof) వాడుకోవచ్చు.
  • కార్డుతో ట్యాక్స్ పేమెంట్: క్రెడిట్ కార్డ్ ద్వారా నేరుగా ఆదాయపు పన్ను చెల్లించే సదుపాయం కూడా అందుబాటులోకి రానుంది.

కార్పొరేట్ కార్డులపై పన్ను:

  • కంపెనీ అందించిన క్రెడిట్ కార్డ్ ఖర్చులను సదరు సంస్థే భరిస్తుంటే, ఆ మొత్తాన్ని ఉద్యోగికి లభించే అదనపు ప్రయోజనంగా (Perquisite) పరిగణిస్తారు. దీనిపై నిబంధనల ప్రకారం పన్ను విధించనున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870