📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Nita Ambani: నీతా అంబానీ గ్యాలరీలోకి రూ. 100 కోట్ల లగ్జరీ కారు

Author Icon By Vanipushpa
Updated: August 11, 2025 • 5:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, ఆసియా(Asia)లో అత్యంత ధనవంతుడైన వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ(Mukesh Ambani) లగ్జరీ కార్లను కలిగి ఉన్న సంగతి విదితమే.. ఇప్పుడు ఆయన భార్య కూడా భర్త బాటలోనే నడుస్తోంది. ముఖేషం అంబానీ భార్య నీతా అంబానీ(Nita ambani) లగ్జరీ కార్లతో దేశ వ్యాప్తంగా మళ్లీ వార్తల్లో నిలుస్తున్నారు. ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ మాత్రమే కాకుండా ఆటోమొబైల్ కలెక్షన్ విషయంలో ఆమె అభిరుచి చర్చా వేదికగా మారుతోంది. తాజాగా భారతదేశంలోనే అత్యంత ఖరీదైన కారు ఆడి A9 చామెలియన్ ను (Audi A9 Chameleon) ఆమె కలిగి ఉంది. ఈ కారు దాదాపు రూ. 100 కోట్ల విలువ కలిగిన లగ్జరీ మాస్టర్‌పీస్.

Nita Ambani: నీతా అంబానీ గ్యాలరీలోకి రూ. 100 కోట్ల లగ్జరీ కారు

11 యూనిట్లు మాత్రమే కలిగి ఉన్న హైపర్-ఎక్స్‌క్లూజివ్ మోడల్
ఆడి A9 చామెలియన్ ప్రపంచవ్యాప్తంగా కేవలం 11 యూనిట్లు మాత్రమే కలిగి ఉన్న హైపర్-ఎక్స్‌క్లూజివ్ మోడల్. ఈ కారు పేరు ‘చామెలియన్’ అనబడటానికి ప్రధాన కారణం ఏంటంటే.. ఒక్క బటన్ నొక్కగానే బాడీ కలర్‌ను మార్చే సాంకేతికత ఇందులో ఉంది. స్పెషల్ ఎలక్ట్రో-పెయింట్ టెక్నాలజీతో రూపొందించిన ఈ ఫీచర్ వలన కారు ప్రతి సారి కొత్తగా కనిపిస్తుంది. రంగు మారినప్పుడల్లో కొత్త కారా అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇది కేవలం కలర్‌ మాత్రమే కాదు, డిజైన్ పరంగా కూడా భవిష్యత్‌తరహా ఆకర్షణ కలిగి ఉంది. సింగిల్-పీస్ విండ్‌స్క్రీన్, రూఫ్, స్పేస్‌షిప్‌లా ఉండే స్లీక్ ప్రొఫైల్, దాదాపు 5 మీటర్ల పొడవు, ప్రత్యేకమైన రెండు డోర్ల కాన్ఫిగరేషన్ వంటి ఫీచర్లు ఈ కారును మరింత ఆకర్షణీయంగా మలుస్తున్నాయి.

హై-టెక్ ఇన్ఫోటైన్‌మెంట్ వంటి ఫీచర్లు

ఆడి A9 చామెలియన్‌లో 4.0-లీటర్ V8 ట్విన్-టర్బో ఇంజిన్ అమర్చారు. ఇది 600 హార్స్‌పవర్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 0 నుండి 100 కి.మీ. వేగాన్ని కేవలం 3.5 సెకన్లలో చేరుకోగలదు. గరిష్ట వేగం గంటకు 250 కి.మీ.గా ఉంది.అడ్వాన్స్డ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్స్, ప్రీమియం ఇంటీరియర్స్, హై-టెక్ ఇన్ఫోటైన్‌మెంట్ వంటి ఫీచర్లు ఈ కారును లగ్జరీ లోకి తీసుకువెళుతున్నాయి.

అద్భుతమైన కంఫర్ట్

రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII EWB: అద్భుతమైన కంఫర్ట్, రాయల్ ప్రెజెన్స్‌తో కూడిన లగ్జరీ సెడాన్. మెర్సిడెస్-మేబాచ్ S600 గార్డ్: బుల్లెట్‌ప్రూఫ్ ప్రొటెక్షన్‌తో కూడిన అల్ట్రా-లగ్జరీ మోడల్.
ఫెరారీ 812 సూపర్‌ఫాస్ట్: 800 హార్స్‌పవర్‌తో కూడిన హై-పర్ఫార్మెన్స్ సూపర్‌కార్.
బెంట్లీ కాంటినెంటల్ ఫ్లయింగ్ స్పర్: బ్రిటిష్ క్రాఫ్ట్‌మన్షిప్ మరియు స్పోర్టీ ఎలిగెన్స్ కలయిక.
రోల్స్ రాయిస్ కల్లినన్: SUV లగ్జరీలో అగ్రగామి.
BMW 7 సిరీస్ 760Li సెక్యూరిటీ ఎడిషన్: హై-సెక్యూరిటీ ఫీచర్లతో కూడిన ఎగ్జిక్యూటివ్ సెడాన్.
ఈ కార్లు కేవలం ప్రయాణానికి మాత్రమే కాకుండా.. అంబానీ కుటుంబం యొక్క ప్రెస్టీజ్, లైఫ్‌స్టైల్, సాంకేతికతను చాటి చెబుతున్నాయి.

నీతా అంబానీ గుజరాతీ?

నీతా అంబానీ ముంబైలోని ఒక మధ్యతరగతి గుజరాతీ కుటుంబంలో జన్మించారు. ముఖేష్ అంబానీని వివాహం చేసుకునే ముందు, ఆమె సన్‌ఫ్లవర్ నర్సరీలో పాఠశాల ఉపాధ్యాయురాలిగా తన వృత్తిని ప్రారంభించింది, నెలకు ₹800 జీతం సంపాదించింది.


నీతా అంబానీ కవలలు ఎవరు?

ఇషా మరియు ఆకాష్ లకు పేర్లు ఎలా వచ్చాయో వెనుక ఉన్న కథ ప్రజలకు అంతగా తెలియదు. 2009లో ఒక ఇంటర్వ్యూలో, నీతా అంబానీ తమ కవలల పేర్లను ఎలా ఎంచుకున్నారో పంచుకున్నారు మరియు అర్థవంతమైన పేర్లను రూపొందించినందుకు తన భర్తకు క్రెడిట్ ఇచ్చారు.

Auto News India News Lifestyle Luxury Car nita ambani Reliance Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.