Mukesh Ambani: కరెంటు కోతలకు చెక్.. అతి తక్కువ ధరకే ఇన్వర్టర్ సిస్టమ్!

Read Time:  1 min
Mukesh Ambani: కరెంటు కోతలకు చెక్.. అతి తక్కువ ధరకే ఇన్వర్టర్ సిస్టమ్!
FONT SIZE
GET APP

Jio: టెలికాం ప్రపంచాన్ని శాసించిన రిలయన్స్ జియో, ఇప్పుడు మధ్యతరగతి ప్రజల గృహ విద్యుత్ కష్టాలను తీర్చేందుకు సిద్ధమైంది. వేసవి కాలంలో ఎదురయ్యే విద్యుత్ కోతలు, విపరీతమైన ఉక్కపోత నుండి ఉపశమనం కలిగించేలా ‘జియో స్మార్ట్ ఇన్వర్టర్ హోమ్ సిస్టమ్’ (Jio Smart Inverter Home System) ను లాంచ్ చేసేందుకు ముఖేష్ అంబానీ(Mukesh Ambani) కసరత్తు చేస్తున్నారు.

Read Also: India America Deal: బైకులపై భారీగా తగ్లనున్న ధరలు

Jio: Check for power cuts.. Inverter system at the lowest price!
Mukesh Ambani: Inverter system at the lowest price!

ప్రస్తుతం మార్కెట్‌లో నాణ్యమైన ఇన్వర్టర్(Inverter Home System) మరియు బ్యాటరీ సెటప్ కావాలంటే రూ. 20,000 నుండి రూ. 30,000 వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. అయితే, జియో తనదైన శైలిలో కేవలం రూ. 5,000 నుండి రూ. 9,000 మధ్య బడ్జెట్ ధరలోనే ఈ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది.

ఈ స్మార్ట్ ఇన్వర్టర్ ప్రత్యేకతలు:

  • హైబ్రిడ్ ఛార్జింగ్: ఇది సాధారణ విద్యుత్‌తో పాటు సోలార్ ప్యానెల్స్ ద్వారా కూడా ఛార్జ్ అవుతుంది.
  • స్మార్ట్ కంట్రోల్: మొబైల్ యాప్ ద్వారా ఇన్వర్టర్‌ను నియంత్రించవచ్చు మరియు విద్యుత్ వినియోగాన్ని ట్రాక్ చేయవచ్చు.
  • మార్కెట్ పోటీ: ఈ రాకతో లూమినస్, మైక్రోటెక్ వంటి దిగ్గజ కంపెనీలకు జియో గట్టి పోటీనివ్వనుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.