📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మృణాల్‌ ఠాకూర్‌ రివ్యూ!

Author Icon By Anusha
Updated: February 12, 2025 • 6:43 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కంగనా రనౌత్‌ నటించిన చిత్రం ‘ఎమర్జెన్సీ’ . ఎన్నో వాయిదాల తర్వాత జనవరి 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను వీక్షించినట్లు హీరోయిన్‌ మృణాల్‌ ఠాకూర్‌ పోస్ట్‌ పెట్టారు.కంగనా రనౌత్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘మా నాన్నతో కలిసి ‘ఎమర్జెన్సీ’ చూశాను. ఆ సినిమా అందించిన అనుభూతి నుంచి ఇంకా బయటకు రాలేకపోతున్నాను. కంగనా ఫ్యాన్‌గా ఈ సినిమాను బిగ్ స్క్రీన్ పై చూడడం ఎంతో సంతోషంగా ఉంది. ఇది ఆమెకు అద్భుతమైన విజయం. ‘గ్యాంగ్‌స్టర్‌’ నుంచి ‘క్వీన్‌’ వరకు.. ‘తను వెడ్స్‌ మను’ నుంచి ‘మణికర్ణిక’, ‘తలైవి’ వరకు ఇప్పుడు తాజాగా ‘ఎమర్జెన్సీ’ ఇలా నిరంతరం ఆమె నటనలో సరిహద్దులు దాటుతూ అద్భుతమైన ప్రతిభతో ఎంతోమందిలో స్ఫూర్తి నింపుతున్నారు. ఈ సినిమాలోని ప్రతి అంశం నన్ను ప్రభావితం చేసింది. కెమెరా యాంగిల్స్‌, కాస్ట్యూమ్స్‌.. ప్రతిదీ నన్ను ఆకర్షించాయి. ఈ చిత్రంతో కంగనా దర్శకురాలిగా చెరగని ముద్ర వేశారు. స్క్రీన్ ప్లే , మాటలు, సంగీతం, ఎడిటింగ్‌ అన్నీ బాగున్నాయి’’ అని అన్నారు.

కంగనాతోపాటు నటీనటులంతా అద్భుతంగా నటించారు. ఆమె కేవలం నటి మాత్రమే కాదు,నిజమైన కళాకారిణి. సవాలుతో కూడిన పాత్రలు పోషించడంలో ఆమె చూపించే ధైర్యాన్ని మెచ్చుకోవాలి. సినిమాపై మీకున్న అంకితభావం ప్రతి ఫేమ్‌లోనూ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సినిమాను చూడనివారు కచ్చితంగా చూడండి. భారతీయులు అంతా తప్పక చూడాల్సిన చిత్రమిది. సినిమా చూశాక భావోద్వేగంతో థియేటర్‌ నుంచి బయటకు వస్తారని నేను హామీ ఇస్తున్నా’’ అని మృణాల్‌ పేర్కొన్నారు. కంగనా రనౌత్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎమర్జెన్సీ’. ఇందిరా గాంధీగా కంగనా నటించగా.. జయప్రకాశ్‌ నారాయణ్‌ పాత్రలో అనుపమ్‌ ఖేర్‌, అటల్‌ బిహారీ వాజ్‌పేయీగా శ్రేయాస్‌ తల్పడే నటించారు.

ఎమర్జెన్సీ’ కథ, ప్రాముఖ్యత

ఈ చిత్రం 1975లో భారతదేశంలో విధించిన అత్యవసర పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. సినిమా ఆ సమయంలో జరిగిన ప్రధాన రాజకీయ పరిణామాలను దగ్గరగా చూపించనుంది. మృణాల్‌ మాట్లాడుతూ –
“సాధారణంగా చరిత్ర ఆధారిత చిత్రాలు చేయడం చాలా క్లిష్టం. కానీ ‘ఎమర్జెన్సీ’ కథను నిజమైన సంఘటనలను బేస్ చేసుకుని సమర్ధవంతంగా చెప్పారు.” అని చెప్పారు.

కంగనా దర్శకత్వం – మృణాల్ అభిప్రాయం

“ఒక మహిళా దర్శకురాలు ఇంత భారీ సినిమాను తెరకెక్కించడం గర్వించదగ్గ విషయం. ఆమె ప్రతిభతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేయబోతున్నారు.” అని మృణాల్ అభిప్రాయపడ్డారు.

ఎమర్జెన్సీ’పై ప్రేక్షకుల అంచనాలు

ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. చారిత్రక సంఘటనల ప్రాముఖ్యత, కంగనా నటన, పవర్‌ఫుల్ డైలాగ్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచాయి.

#Bollywood #CinemaReview #EmergencyFilm #EmergencyReview #KanganaRanaut Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.