📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest Telugu News: GST- భవిష్యత్తులో భారీగా పన్నులు తగ్గిస్తామని మోదీ హామీ

Author Icon By Vanipushpa
Updated: September 25, 2025 • 4:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారతదేశం ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా వేగంగా ఎదుగుతున్న వేళ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) ప్రజలకు మరింత ఊరట కలిగించే పన్ను సంస్కరణలను హామీ ఇచ్చారు.ప్రధాని మాట్లాడుతూ.. మేము ఇక్కడితో ఆగపోవడం లేదు. ఆర్థిక వ్యవస్థ బలపడుతున్న కొద్దీ పన్ను భారం తగ్గుతూనే ఉంటుంది. ప్రజల ఆశీస్సులతో GST సంస్కరణలు కొనసాగుతాయని సెప్టెంబర్ 25, 2025న గ్రేటర్ నోయిడాలో జరిగిన UP అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన ప్రారంభోత్సవంలో మోదీ ప్రకటించారు.

అనేక వస్తువులపై GST రేట్ల తగ్గి తగ్గింపు
సెప్టెంబర్ 4న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని GST కౌన్సిల్ అనేక వస్తువులపై GST రేట్లను తగ్గించింది. పన్ను రేట్లను మునుపటి నాలుగు స్లాబ్‌ల నుండి (5%, 12%, 18%, 25%) కేవలం రెండు స్లాబ్‌లకు (5% మరియు 18%) సరళతరం చేసింది. 2025 కేంద్ర బడ్జెట్‌లో, సంవత్సరానికి రూ. 12 లక్షల వరకు సంపాదించే వ్యక్తులకు ఆదాయపు పన్ను లేకుండా చేయడం మరో పెద్ద సంస్కరణగా నిలిచింది. ఈ చర్యలు సాధారణ ప్రజలకు పెద్ద ఊరట కలిగించడమే కాకుండా, వినియోగాన్ని పెంచి ఆర్థిక వ్యవస్థకు మరింత ఊపునిస్తాయని కేంద్రం నమ్ముతోంది.

GST- భవిష్యత్తులో భారీగా పన్నులు తగ్గిస్తామని మోదీ హామీ

ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుంది
ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఈ చర్యలతో ప్రజల చేతుల్లో మరింత డబ్బు మిగులుతుంది. GST సంస్కరణలు భారత వృద్ధి కథకు కొత్త రెక్కలు ఇస్తాయి. ప్రజలకు పొదుపు పెరిగితే ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని పేర్కొన్నారు. అయితే, కేవలం పన్ను సంస్కరణలతోనే కాకుండా, దేశం స్వావలంబన సాధించాల్సిన అవసరాన్ని నరేంద్ర మోదీ మరోసారి స్పష్టంగా చెప్పారు. పరిశోధన మరియు అభివృద్ధి (R&D) పై పెట్టుబడులు పెంచాలనన్నారు. కొత్త ఆవిష్కరణలకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. భారతదేశంలో తయారు చేయగల ప్రతి ఉత్పత్తిని భారతదేశంలోనే తయారు చేయాలని పిలుపునిచ్చారు.

  usa-డాలర్ బలహీనత బంగారం ధరపై ప్రభావం చూపుతున్నాయి

భారతదేశంలో తీవ్రమవుతున్న నీటి కరువు.. మేలుకోకుంటే సంక్షోభం తప్పదంటున్న నిపుణులు
భారతదేశంలో తీవ్రమవుతున్న నీటి కరువు.. మేలుకోకుంటే సంక్షోభం తప్పదంటున్న నిపుణులు
భౌగోళిక రాజకీయ సవాళ్లు, వాణిజ్య వివాదాలు ఉన్నప్పటికీ భారత వృద్ధి ప్రయాణం బలంగా ఉందని మోదీ అన్నారు.అయితే తాజా అంతర్జాతీయ పరిణామాలు భారత ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెంచుతున్నాయి.ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికా, భారత ఎగుమతులపై 50 శాతం సుంకం విధించింది. ఇది ఆటోమొబైల్స్ నుండి రత్నాలు, ఆభరణాలు, వస్త్రాలు వరకు అనేక రంగాలను ప్రభావితం చేస్తోంది.అమెరికా ప్రభుత్వం కొత్తగా $100,000 H-1B వీసా ఫీజు విధించింది. దీని వల్ల భారత IT సంస్థల వ్యాపార నమూనాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో, పన్ను సంస్కరణలు భారత ప్రజలకు తాత్కాలిక ఊరటను అందిస్తాయి. కానీ దీర్ఘకాలికంగా దేశం స్వావలంబన దిశగా పయనించాల్సిందే అని ప్రధాని మోదీ స్పష్టంచేశారు.

జీఎస్టీ (GST) అంటే ఏమిటి?

జీఎస్టీ (GST) అంటే వస్తువుల మరియు సేవా పన్ను. అయితే కేంద్ర ప్రభుత్వం నోట్లను రద్దు చేసిన తర్వాత జూలై 2017 నుంచి ప్రభుత్వం జీఎస్టీని అమలు చేసింది. ఒక వస్తువును కొనుగోలు చేసినప్పుడు లేదా ఒక సేవను పొందినప్పుడు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

నాలుగు రకాల GST ఏమిటి?
భారతదేశంలో నాలుగు రకాల GST ఉన్నాయి: ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (IGST), స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (SGST), సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (CGST), మరియు యూనియన్ టెరిటరీ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (UTGST).

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Breaking News in Telugu economic reforms Future Tax Plans Indian Economy Indian Politics modi Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.