📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు

Mobile Recharge: పెరగనున్న మొబైల్ రీఛార్జ్ ప్లాన్స్ ధరలు

Author Icon By Vanipushpa
Updated: July 8, 2025 • 4:48 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇకపై మీరు మొబైల్‌(Mobile)లో మాట్లాడటం లేదా ఇంటర్నెట్(Internet) ఉపయోగించడం మరింత ఖరీదైనదిగా మారనుంది. భారతదేశ టెలికాం(Indian Telicom) రంగంలోని కంపెనీలు మరోసారి ధరల పెరుగుదలకి రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. తాజా నివేదికల ప్రకారం ప్రముఖ ప్రైవేట్ టెలికాం సంస్థలు రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియా కంపెనీలు రీచార్జ్ ధరలను పెంచే యోచనలో ఉన్నాయి. ఈ పెంపు 2025 నవంబర్-డిసెంబర్ మధ్య కాలంలో అమలులోకి రావచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇది ముఖ్యంగా మీడియం లేదా ప్రీమియం ప్లాన్‌లు ఉపయోగించే వినియోగదారులపై తీవ్ర ప్రభావం అయితే చూపనుంది.

రీచార్జ్ ప్లాన్‌ల ధరలను పెంచిన సంగతి విదితమే
గత జూలై నెలలో టెలికం కంపెనీలు తమ రీచార్జ్ ప్లాన్‌ల ధరలను పెంచిన సంగతి విదితమే. దీంతో చాలామంది వినియోగదారులు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయిన BSNL వైపు మొగ్గుచూపారు. అయితే, BSNL నెట్‌వర్క్ అన్ని ఏరియాల్లో లభ్యత అంతగా లేకపోవడంతో వారికి అది ఉపయోగపడటం లేదు. ఈ నెలలో ప్లాన్ల ధరలు 11 శాతం నుండి 23శాతం వరకు పెరిగాయి. దీని ప్రభావంతో కొంతమంది వినియోగదారులు తమ సేవలను నిలిపివేశారు. దీంతో జూలై-నవంబర్ 2024 మధ్యకాలంలో దాదాపు 2.1 కోట్ల మంది వినియోగదారులు తగ్గిపోయారు.

Mobile Recharge: పెరగనున్న మొబైల్ రీఛార్జ్ ప్లాన్స్ ధరలు

అయితే ధరలు పెంచినా కొత్త వినియోగదారుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. మే 2025 నెలలో యాక్టివ్ వినియోగదారుల సంఖ్యలో గత 29 నెలలలో అత్యధిక వృద్ధి నమోదైంది. ఈ నెలలో మొత్తం 74 లక్షల మంది కొత్త యాక్టివ్ యూజర్లు టెలికంలోకి ప్రవేశించారు. దీంతో భారతదేశంలో మొబైల్ యాక్టివ్ యూజర్ల మొత్తం సంఖ్య సుమారు 108 కోట్లకు చేరుకుది. రిలయన్స్ జియోకు ఒక్క మే నెలలోనే 55 లక్షల మంది యూజర్లు జత అయ్యారు. ప్రస్తుతం జియోకి 53 శాతం యాక్టివ్ యూజర్ బేస్ ఉంది.ఇక భారతి ఎయిర్‌టెల్ కూడా 13 లక్షల మంది యూజర్లను కొత్తగా యాడ్ చేసుకుంది. దీనికి ప్రస్తుతం 36% యాక్టివ్ యూజర్ బేస్ ఉంది.

ధరల పెంపు కారణం

ఈ ధరల పెంపు వెనుక ప్రధాన కారణంగా కంపెనీలు ఏం చెబుతున్నాయంటే 5G సేవలతో పాటుగా, స్పెక్ట్రమ్ కొనుగోలు ఖర్చులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం అవసరమైన భారీ పెట్టుబడులను సాకుగా చూపుతున్నాయి. ఈ ఖర్చులను భరించేందుకు రీచార్జ్ ధరలు పెంచాల్సిన అవసరం తప్పడం లేదని టెలికం కంపెనీలు చెబుతున్నాయి. ప్రస్తుతం సగటు మొబైల్ వినియోగదారుడు నెలకు సుమారు రూ.200 వరకు ఖర్చు చేస్తున్నాడు. ధరలు పెరిగితే ఇది రూ.349కు చేరుకునే అవకాశముంది. అంటే దాదాపు 20 శాతం నుండి 25 శాతం వరకు పెరుగుదల వుండొచ్చు.

మీరు డబ్బు ఎలా సేవ్ చేసుకోవాలంటే

ఈ ధరల పెరుగుదల మిమ్మల్ని ప్రభావితం చేయకుండా ఉండాలంటే మీరు కొన్ని పనులు చేయడం ద్వారా అలర్ట్ అవ్వొచ్చు. ప్రభుత్వ రంగ సంస్థ BSNL ఇప్పటివరకు ధరలను పెంచలేదు. కాబట్టి మీ ఏరియాలో దీని నెట్‌వర్క్ బలంగా ఉంటే వెంటనే పోర్ట్ ద్వారా మారిపోవడం ఉత్తమం. దీని వల్ల డబ్బు ఆదా అయ్యే అవకాశం ఉంటుంది. ఇక ధరల పెంపు అమలులోకి రాకముందే మీరు 365 రోజుల ప్లాన్‌తో రీచార్జ్ చేసుకోండి. ఇది మీ డబ్బును ధరలు పెరిగిన తర్వాత ఆదా చేయవచ్చు. .

మొబైల్ ఫోన్ అంటే ఏమిటి?
మొబైల్ ఫోన్, లేదా సెల్యులార్ లేదా సెల్ ఫోన్, అనేది పోర్టబుల్ టెలిఫోన్, ఇది భౌతిక నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేయాల్సిన అవసరం లేకుండా వైర్‌లెస్‌గా కమ్యూనికేట్ చేయడానికి రేడియో తరంగాలను ఉపయోగిస్తుంది. ఇది వినియోగదారుడు కదులుతున్నప్పుడు పరికరం క్రియాత్మకంగా ఉండటానికి అనుమతిస్తుంది.
మొబైల్ షార్ట్ నోట్ అంటే ఏమిటి?
మొబైల్ ఫోన్ అనేది కాల్స్ చేయడానికి మరియు స్వీకరించడానికి, సందేశాలను పంపడానికి మరియు స్వీకరించడానికి, ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేయడానికి ఇతర పనులను నిర్వహించడానికి ఉపయోగించే వ్యక్తిగత కమ్యూనికేషన్ పరికరం.

Read hindi news: hindi.vaartha.com

Read Also: IND vs ENG: టెస్టు సిరీస్‌లో చరిత్ర సృష్టించిన టీమిండియా

Airtel recharge hike Jio tariff hike+"Telugu News mobile plans cost mobile recharge price hike recharge plans update telecom news India telecom tariff increase

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.