ప్రపంచ టెక్ రంగంలో దిగ్గజంగా పేరొందిన మైక్రోసాఫ్ట్ (Microsoft) మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపునకు (With job cuts) సిద్ధమవుతోంది. ఇప్పటికే రెండు విడతల్లో ఉద్యోగాలను తొలగించిన ఈ సంస్థ, ఇప్పుడు మూడోసారి అదే దిశగా అడుగులు వేస్తోంది. జూలై నెల మొదటి వారంలో అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశముందని బ్లూమ్‌బర్గ్ వార్త సంస్థ విశ్వసనీయ వర్గాల సమాచారం ఆధారంగా పేర్కొంది.ఇప్పటివరకు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, డెవలపర్లు ఉద్యోగాలు కోల్పోయిన విషయం తెలిసిందే. కానీ తాజా దఫా తొలగింపుల్లో విక్రయాలు (Sales) విభాగం పెద్ద ఎత్తున ప్రభావితమయ్యే అవకాశముంది. మైక్రోసాఫ్ట్‌లో దాదాపు 45 వేల మంది ఉద్యోగులు సేల్స్, మార్కెటింగ్ విభాగాల్లో పని చేస్తున్నారు. వీరిలో కొంతమందిపై ప్రభావం తప్పదని భావిస్తున్నారు.
ఏఐ దిశగా మైక్రోసాఫ్ట్ దృష్టి
కృత్రిమ మేధ (AI) రంగంలో మైక్రోసాఫ్ట్ భారీగా పెట్టుబడులు పెడుతోంది. దీనికి సంబంధించి సంస్థ అంతర్గతంగా పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టింది. దీంతో కొంతమంది ఉద్యోగుల అవసరం తగ్గినట్లు తెలుస్తోంది. సంస్థ కొత్త ఆర్థిక సంవత్సరం జూలై నుంచే ప్రారంభం కావడంతో, ఇప్పుడే లేఆఫ్ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
మునుపటి కోతల పరంపర
మేలోనే మైక్రోసాఫ్ట్ 6,000 మందిని తొలగించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొద్ది వారాల్లోనే మరో 300 మందిపైగా ఉద్యోగులను వదిలించింది. అంతకుముందు 2023 జనవరిలో 10 వేల మందిని తొలగించిన సంస్థ, ఇప్పుడు మళ్లీ అదే దిశగా పయనిస్తోంది.
ఉద్యోగుల్లో భయం, అసంతృప్తి
తరచుగా ఉద్యోగాల కోతలతో మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. “నెక్ట్స్ ఎవరు?” అనే అనుమానంతో ఉద్యోగులు పని చేస్తున్నారు. టెక్ రంగంలో అభివృద్ధి జరుగుతున్నా, ఉద్యోగ భద్రత మాత్రం కనుమరుగవుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Read Also : Nithyananda : నిత్యానంద ఎక్కడున్నారో చెప్పిన శిష్యురాలు..