📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు

Microsoft: మరోసారి మైక్రోసాఫ్ట్‌లో భారీ లేఅఫ్స్‌

Author Icon By Shobha Rani
Updated: July 3, 2025 • 11:51 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

2025 సంవత్సరం మైక్రోసాఫ్ట్ (Microsoft) ఉద్యోగులకు కష్టకాలం అనే చెప్పవచ్చు. ఏకంగా ఈ ఏడాదిలో ఇది రెండోసారి పెద్ద స్థాయిలో లేఅఫ్‌కి పాల్పడింది కంపెనీ. మే నెలలోనే దాదాపు 6,000 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలు కోల్పోయారు. ఆ వెంటనే జూన్‌లో మరో 300 మందికిపైగా ఉద్యోగాలు పోయాయి. ఇప్పుడు జూలై వచ్చేసరికి మళ్లీ పెద్ద ఎత్తున సుమారు 9,000 మందిని బయటకు పంపునట్లు సమాచారం. మొత్తం కంపెనీ ఉద్యోగులలో దాదాపు 4 శాతం మందిని ఈసారి టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. టెక్నాలజీ, మార్కెటింగ్ విభాగాల్లో ఈ ప్రభావం బాగా కనిపిస్తోంది.
సేల్స్, మార్కెటింగ్, గేమింగ్ రంగాలపై భారీ ప్రభావం
మైక్రోసాఫ్ట్ (Microsoft)తాజా 4% ఉద్యోగుల తొలగింపులు ప్రధానంగా సేల్స్, మార్కెటింగ్, గేమింగ్ (ఎక్స్‌బాక్స్, కింగ్, జెని మ్యాక్స్, టర్న్ 10) విభాగాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఎక్స్‌బాక్స్ గ్రూపులో ముఖ్యంగా భారీ కోతలు జరిగాయి. ఉదాహరణకు టర్న్ 10 స్టూడియోలో సగానికి పైగా ఉద్యోగులు కోల్పోయారు, అలాగే కింగ్ డివిజన్‌లో 10% ఉద్యోగాలు తొలగించబడ్డాయి. ప్రముఖ గేమ్ ప్రాజెక్టులు అయిన పెరఫెక్ట్ డార్క్, ఎవర్ విల్డ్ వంటి గేమ్స్ రద్దయ్యాయి, The Initiative వంటి స్టూడియోలు మూసివేయబడ్డాయి. జెని మ్యాక్స్, రావెన్ సాఫ్ట్ వేర్, స్లెడ్జ్‌హ్యామర్ గేమ్స్, రేర్ వంటి అనేక స్టూడియోలు కూడా ఈ లేఅవ్‌ల వల్ల ప్రభావితమయ్యాయి.

మరోసారి మైక్రోసాఫ్ట్‌లో భారీ లేఅఫ్స్‌

9,000 ఉద్యోగులు రోడ్డున..
ఈ లేఅవ్‌లలో వాషింగ్టన్ రాష్ట్రంలో మాత్రమే 830 ఉద్యోగాలు తొలగించబడ్డాయని అధికారిక సమాచారం ఉంది, ఇది ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ (Microsoft) తొలగించిన ఉద్యోగాలలో సుమారు 9%కి సమానం. ఈ చర్యలు సంస్థ వ్యయ నియంత్రణ, మేనేజ్మెంట్ సరళీకరణ, మార్కెట్ డైనమిక్స్‌కు అనుగుణంగా మార్పులు చేయడం వంటి వ్యూహాత్మక అవసరాల నేపథ్యంలో తీసుకున్నాయి.
AI దిశగా నూతన నిర్మాణం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో భారీ పెట్టుబడులు దాదాపు $80 బిలియన్‌ పెట్టుబడులు వేస్తున్న మైక్రోసాఫ్ట్, ఈ మారుతున్న పరిస్థితులు అనుగుణంగా సంస్థ నిర్మాణాన్ని మరింత సజావుగా మలచే పనిలో ఉంది. వినియోగదారుల అవసరాలను వేగంగా తీర్చడమే కాక, నిర్వహణ ఖర్చులను తగ్గించడమే లక్ష్యంగా మేనేజ్మెంట్ స్థాయిలను సీరియస్‌గా కుదించుతోంది. ఈ ప్రణాళికలలో భాగంగానే, తాజా ఉద్యోగాల కోతలు చోటుచేసుకున్నాయి.

మరోసారి మైక్రోసాఫ్ట్‌లో భారీ లేఅఫ్స్‌

మార్కెట్‌పై ప్రభావం & భవిష్యత్ ప్రణాళికలు
గత త్రైమాసిక ఆర్థిక నివేదిక ప్రకారం, మైక్రోసాఫ్ట్ $70 బిలియన్ ఆదాయాన్ని మరియు $26 బిలియన్ నికర లాభాన్ని నమోదుచేసింది. జూన్ 26న కంపెనీ షేర్ ధర అత్యధిక స్థాయికి చేరినట్టు తెలుస్తోంది. అయితే, ఇటీవల జరిగిన ట్రేడింగ్‌లో కొత్తగా 0.6% శాతం తగ్గిందని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మైక్రోసాఫ్ట్ ఆదాయం మరియు లాభాల్లో స్థిరతను చూపించినా, సంస్థ ముందస్తుగా భవిష్యత్ మౌలిక మార్పుల కోసం ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది మార్కెట్‌లో షేర్ ప్రైస్‌లను కొద్దిగా ప్రభావితం చేసింది.

Read Also: Gold Rates: బులియన్ మార్కెట్ కళకళ

9000 employees fired AI automation Microsoft Breaking News in Telugu global layoffs in tech Google news Google News in Telugu King division layoffs Latest News in Telugu Microsoft AI restructuring Microsoft gaming layoffs Microsoft India impact Microsoft July 2025 layoffs Microsoft layoffs Microsoft revenue 2025 Microsoft share price 2025 Paper Telugu News Perfect Dark cancelled tech job cuts tech layoffs 2025 Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today The Initiative shut down Today news Turn 10 layoffs Xbox layoffs

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.