గత సంవత్సరం టెక్ ప్రపంచంలో భారీగా లేఆఫ్ లను ప్రకటించింది. పేరుపొందిన కంపెనీలు సైతం ఆర్థికంగా పొదుపు చర్యల్లో భాగంగా తమ స్టాఫ్ ను తగ్గించుకోవడం ప్రారంభించాయి. ప్రత్యేకంగా ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) (AI) రావడంతో ఈ తొలగింపు ప్రక్రియ ఎక్కువైంది. టెక్ ప్రపంచంలో ప్రస్తుతం ఒకటే చర్చ. అది మైక్రోసాఫ్ట్ లో రాబోయే భారీ లేఆఫ్స్ గురించి. 2026 సంవత్సరం ఆరంభంలోనే సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వేలాది మంది ఉద్యోగులను తొలగించబోతోందని వస్తున్న వార్తలు ఐటీ రంగంలో పెను సంచలనం సృష్టించాయి. ముఖ్యంగా జనవరి నెలలో ఈ ప్రక్రియ మొదలవుతుందని సోషల్ మీడియా వేదికగా జరిగిన ప్రచారం ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన కలిగించింది. అయితే ఈ వార్తలపై మైక్రోసాఫ్ట్ ఎట్టకేలకు స్పందించింది.
Read also: IIFL: 2026లో RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్
Are the massive layoffs in January true
టిప్ ర్యాంక్స్ ఇచ్చిన నివేదిక ప్రకారం..
మైక్రోసాఫ్ట్ సుమారు 11,000 నుండి 22,000 మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తుందట. ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో పెరుగుతున్న పెట్టుబడుల భారాన్ని తగ్గించుకోవడానికి కంపెనీ ఈ నిర్ణయం తీసుకుందని, దీనివల్ల అజూర్ క్లౌడ్ సర్వీసెస్, ఎక్స్ బాక్స్, గ్లోబల్ సేల్స్ విభాగాలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆ నివేదిక పేర్కొంది. ఎక్స్, బ్లూస్కీ వంటి ప్లాట్ ఫారమ్ లలో ఈ వార్త కార్చిచ్చులా వ్యాపించడంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.
రంగంలోకి దిగిన ఆఫీసర్
ఈ నివేదిక వైరల్ అయిన వెంటనే మైక్రోసాఫ్ట్ చీఫ్ కమ్యూనికేషన్స్ ఆఫీసర్ ఫ్రాంక్ ఎక్.షా రంగంలోకి దిగారు. ఈ వార్తలను ఆయన పూర్తిగా ఖండించారు. ఈ నివేదిక వందశాతం అవాస్తవం, ఊహాజనితం అని అన్నారు. దాదాపు 17 ఏళ్లుగా మైక్రోసాఫ్ట్ లో కీలక బాధ్యతలు నిర్వమిస్తున్న సోషల్ మీడియా యూజర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. లేని వార్తలను సృష్టించవద్దని కోరారు. గత సంవత్సరం మైక్రోసాఫ్ట్ జులైలో 9,000 మందిని తొలగించింది. దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా చురుగ్గా పనిచేయడం కోసం ఈ పునర్వ్యవస్థీకరణ తప్పలేదని వివరించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: