మెటా ప్లాట్ఫామ్ లు మరోసారి పెద్ద ఎత్తున ఉద్యోగాల కోతలు చేపట్టాయి. కృత్రిమ మేధస్సు (ఏఐ)(artificial intelligence) ఆధారిత విభాగాలలో పునర్వ్యవస్థీకరణలో భాగంగా దాదాపు 600 మంద ఉద్యోగులను తొలగించినట్లు కంపెనీ అంతర్గత వర్గాలు వెల్లడించాయి.ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వంటి ప్రముఖ ప్లాట్ ఫామ్లను నిర్వహిస్తున్న ఈ టెక్ దిగ్గజం ఆధునాతన ఏఐ పరిశోధన, అభివృద్ధి దిశగా తన వ్యూహాన్ని మలుస్తోంది.ఏఐతో పలు రంగాలపై ప్రభావితం ఈ కోతలు ప్రధానంగా ఏఐ మౌలిక సదుపాయాలు, పరిశోధన, ఉత్పత్తి ఇంటిగ్రేషన్ బృందాలు వంటి విభాగాలను ప్రభావితం చేశాయి.
Read also: Jubilee Hills by-election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ముచ్చట్లు.
కంపెనీ తన వనరులను మెటా చీప్ ఏఐ ఆఫీసర్ అలెగ్జాండర్ వాంగ్(Alexander Wang) ఆధ్వర్యంలో నడుస్తున్న సూపర్ ఇంటెలిజెన్స్ పాజెక్ట్స్ వైపు మళ్లిస్తోంది. వాంగ్ ప్రకారం తక్కువ మంది ఉద్యోగులు ఉన్నా, ఎక్కువ ప్రభావం చూపగల వేగవంతమైన బృందాలను నిర్మించడం మెటా(Meta) ప్రాధాన్య లక్ష్యంగా తెలుస్తోంది. కంపెనీ వర్గాల ప్రకారం, ఈ చర్యలు నిధుల కొరతకు సంకేతం కావు.
ఏఐ మోడల్ శిక్షణ
ఇది కేవలం పెద్ద-స్థాయి ఏఐ మోడల్ శిక్షణ, జనరేటివ్ ఏఐ అప్లికేషన్లు, స్మార్ట్ ప్లాట్ఫామ్ ల అభివృద్ధి వంటి అధిక పాధాన్యతగల రంగాలపై దృష్టి కేంద్రీకరించడం కోసం చేపట్టిన వ్యూహాత్మక పునర్వ్యవస్థీకరణ మాత్రమేనని చెప్పవచ్చు.
ఉద్యోగుల సమీక్షలో కూడా మెటా ఇప్పుడు కృత్రిక మేధస్సును ప్రవేశపెట్టింది.ఉద్యోగులు ఇప్పుడు తమ వార్షిక పనితీరు సమీక్షలను రాయడంలో సహాయపడటానికి మెటామేట్ అనే ఏఐ చాట్ బాట్ ను ఉపయోగిస్తున్నారు. ఈ సాధనం చాట్ జీపిటీ తరహాలో పనిచేస్తుంది. ఇది ఉద్యోగుల అంతర్గత పత్రాలు, గమనికలు, ప్రాజెక్ట్ రిపోర్టులు, ఫీడ్ బ్యాక్ను విశ్లేషించి వారి సంవత్సరాంత పనితీరును సారాంశం చేస్తుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read also: