📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

యూజర్లకు జియో శుభవార్త.. రూ.91కే రీఛార్జ్ 2026లో RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు 2025లో చారిత్రాత్మక కార్ల రికార్డు లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్! పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు పెరగనున్న హోండా కార్ల ధరలు ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్ జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? యూజర్లకు జియో శుభవార్త.. రూ.91కే రీఛార్జ్ 2026లో RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు 2025లో చారిత్రాత్మక కార్ల రికార్డు లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్! పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు పెరగనున్న హోండా కార్ల ధరలు ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్ జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు?

Latest News: Mental Health: మానసిక వైద్యుల సేవలు వెలకట్టలేనివి

Author Icon By Radha
Updated: October 11, 2025 • 12:35 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

-వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్


విజయవాడ : సమాజానికి వెలకట్టలేని వైద్యసేవలు అందిస్తున్న మానసిక వైద్యులు(Mental Health) క్లినికల్ సైకాలజిస్తుల(Psychology) కొరత వుందని, ఆ కొరత తీర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టిందని, అందులో భాగంగా ఇటీవలే ఇండ్లాస్ హాస్పిటల్ లో క్లినికల్ సైకాలజీ కోర్సులు ప్రారంభించిందని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, విద్యావైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు.

Read also: Rayapati Sailaja: స్త్రీల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక పోర్టల్

ఇండ్లాస్ హాస్పిటల్‌లో క్లినికల్ సైకాలజీ కోర్సుల ప్రారంభం

ప్రపంచ మానసిక ఆరోగ్య(Mental Health) దినోత్సవం సందర్భంగా ఇండ్లాస్ హాస్పిటల్స్ శుక్రవారం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాలులో అత్యవసర పరిస్థితుల్లో మానసిక ఆరోగ్య సంరక్షణ అంశంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

మెంటల్ హెల్త్ వాక్ ప్రారంభం మరియు పాల్గొనిన మంత్రి

తొలుత నిర్వాహకులు ఏర్పాటు చేసిన మెంటల్ హెల్త్ వాక్ను జెండా ఊపి ప్రారంభించి, వాక్లో మిగతా వారితో కలిసి నడిచారు. అనంతరం సదస్సులో మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ రోజువారీ జీవనంలో వస్తున్న అనేక మార్పుల కారణంగా మనుషుల్లో మానసిక సమస్యలు పెరిగిపోతున్నాయన్నారు.
మానసిక సమస్యల వల్ల ఆ వ్యక్తి కుటుంబమే కాదు, సమాజం దేశం కూడా నష్టపోతుందన్నారు. ఆర్థిక వ్యవస్థ దెబ్బతినేందుకు మానసిక జబ్బులు కూడా ముఖ్య కారణమని గణాంకాలతో వివరించారు.

మానసిక వ్యాధి నిపుణుల కొరత తీర్చేందుకు మరిన్ని పీ.జీ సీట్లను అందుబాటులోకి తీసుకొస్తున్నా మన్నారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ హాజరు కాగా, సదస్సుకు డా. ఇండ్ల రామసుబ్బారెడ్డి అధ్యక్షత వహించారు. ఇండ్లాస్ డైరెక్టర్ డా. విశాల్ ఇండ్ల, డా. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డా. వి. రాధికారెడ్డి, ఏపీ మెడికల్ కౌన్సిల్ ఛైర్మన్ డా. శ్రీహరిరావు, లండన్కు చెందిన ప్రముఖ ఇ.ఎన్.టి సర్జన్ డా. కృష్ణారెడ్డి, డి.ఎమ్.హెచ్త్వో డా. సుహాసిని, ఐఎమ్ఎ అధ్యక్షులు డా. హనుమయ్య, పలువురు వైద్యులు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Clinical Psychologists mental health Mental Health Experts PG Seats Psychology Education

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.