మెక్‌డొనాల్డ్స్ (McDonald’s) భారత్‌లో తమ ప్రచారానికి ఓ కొత్త జోష్ ఇచ్చింది. ఈసారి బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణ్‌వీర్ సింగ్‌ను తమ కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించింది. ఈ భాగస్వామ్యం ఒక ఆహార ప్రకటన మాత్రమే కాదు, రణ్‌వీర్ శైలికి తగ్గ అట్టహాసంగా నిలిచింది.ఈ ప్రత్యేకమైన భాగస్వామ్యంలో భాగంగా, మెక్‌డొనాల్డ్స్ సోమవారం ‘ది రణ్‌వీర్ సింగ్ మీల్’ (‘The Ranveer Singh Meal’)పేరుతో ఓ కొత్త కాంబోను పరిచయం చేసింది. ఇది రణ్‌వీర్‌కు ఇష్టమైన ఫుడ్స్‌ను ఆధారంగా చేసుకుని రూపొందించారు. ఇందులో రెండు ఎంపికల బర్గర్లు – మెక్‌వెజ్జీ ఎక్స్‌ప్లోడ్ లేదా మెక్‌చికెన్ ఎక్స్‌ప్లోడ్, పక్కన గోల్డెన్ పాప్ ఫ్రైస్, ఇక ఫినిష్ కోసం స్పెషల్ బొబా బ్లాస్ట్ డ్రింక్ ఉన్నాయి.ఈ బర్గర్లు కరకరలాడే ఉల్లిపాయలు, స్పైసీ-క్రీమీ ఎక్స్‌ప్లోడ్ సాస్‌తో మరింత రుచికరంగా ఉంటాయి. బొబా పెర్ల్స్‌తో సరికొత్తగా రూపొందించిన డ్రింక్ కూడా ఈ మీల్‌కి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
ఉత్తర, తూర్పు భారత్‌లో లభ్యం – పరిమిత కాలమే
జూన్ 13 నుంచి ఈ స్పెషల్ మీల్ ఉత్తర మరియు తూర్పు భారతదేశంలోని అన్ని మెక్‌డొనాల్డ్స్ స్టోర్లలో అందుబాటులోకి వస్తుంది. ఇది పరిమిత కాలం పాటు మాత్రమే లభిస్తుంది. మెక్‌డొనాల్డ్స్ రూపొందించిన ఈ కాంపో ఫేమస్ ఆర్డర్స్ అనే ఇంటర్నేషనల్ క్యాంపెయిన్‌లో భాగం. ఈ ప్లాట్‌ఫామ్‌లో ఇప్పటికే బీటీఎస్, ట్రావిస్ స్కాట్ వంటి స్టార్‌లు భాగమయ్యారు. ఇప్పుడు రణ్‌వీర్ సింగ్ కూడా ఆ జాబితాలోకి చేరిపోయాడు.
బ్రాండ్‌కు, స్టార్‌కు పర్ఫెక్ట్ కలయిక
సీపీఆర్ఎల్ (మెక్‌డొనాల్డ్స్ ఇండియా – నార్త్ & ఈస్ట్) వైస్ ఛైర్మన్ అనంత్ అగర్వాల్ మాట్లాడుతూ, రణ్‌వీర్ ఎనర్జీ మా బ్రాండ్ ఎనర్జీకి సమం. ఆయనతో కలసి పని చేయడం ద్వారా మా వినియోగదారులతో సంబంధం మరింత బలపడుతుందని ఆశిస్తున్నాం అన్నారు.ఈ భాగస్వామ్యంపై రణ్‌వీర్ సింగ్ స్పందిస్తూ, మెక్‌డొనాల్డ్స్ ఫ్యామిలీలో చేరడం నాకు గర్వకారణం. నా పేరుతో ఒక ప్రత్యేక మీల్ ఉండటం ఆనందంగా ఉంది. ఇది నా అభిమానులకు ఖచ్చితంగా నచ్చుతుంది. వాళ్లకోసం ఇది స్పెషల్ ట్రీట్, అన్నారు.
ధరలు, అందుబాటు వివరాలు
వెజ్ ఆప్షన్ ధర: రూ. 249
నాన్-వెజ్ ఆప్షన్ ధర: రూ. 269
ఈ మీల్‌ను స్టోర్‌లో, మెక్‌డొనాల్డ్స్ యాప్‌లో, అలాగే ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఆర్డర్ చేయొచ్చు.
Read Also : Nita Ambani : నీతా అంబానీ భారీ ఈవెంట్