📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు

Mangalagiri: మంగళగిరిపై ఐటి కంపెనీల ఆసక్తి!

Author Icon By Anusha
Updated: July 23, 2025 • 10:31 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రెండోవిడత ఇళ్ల పట్టాల పంపిణికి చర్యలు

మంగళగిరి : ఐటి, ఇతర కంపెనీలు మంగళగిరికి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని, భవిష్యత్లో 50వేల మంది పనిచేసేందుకు అవకాశం ఉందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గ వ్యాప్తంగా చేపట్టిన పలు అభివృద్ధి పనుల పురోగతిపై ఉండవల్లి నివాసంలో అధికారులతో మంత్రి సమీక్షించారు. వివిధ పనుల పురోగతిని అధికారులు పవర్ పాయింట్ ప్రజెంజేషన్ ద్వారా వివరించారు. ఈసందర్భంగా మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) మాట్లాడుతూ.. మంగళగిరికి ఐటీ, నాన్ ఐటీ కంపెనీలు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని, ఇందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై అధికారులు దృష్టిసారించాలన్నారు. మంగళగిరిలో వివిధ ప్రభుత్వ భూముల్లో దశాబ్దాలుగా నివాసం ఉంటున్నవారికి రెండో విడతలో 2వేల ఇళ్ల పట్టాల పంపిణీకు చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.

Mangalagiri: మంగళగిరిపై ఐటి కంపెనీల ఆసక్తి!

నియోజకవర్గ వ్యాప్తంగా

మిగిలిన ఇళ్ల పట్టాల విషయంలోనూ పనులను వేగవంతం చేయాలని సూచించారు. నియోజకవర్గ వ్యాప్తంగా 10వేల టిడ్కో ఇళ్ల నిర్మాణం!ప్రజలు నివసించేందుకు అనుకూలంగా వివిధ ప్రాంతాల్లో నియోజకవర్గవ్యాప్తంగా 10వేల టిడ్కో ఇళ్ల (Tidco houses) ను నిర్మించాల్సిన అవసరం ఉంది. ఇందుకు అవసరమైన స్థల సేకరణపై అధికారులు దృష్టి సారించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలో అందుబాటులో ఉన్న భూముల వివరాలను ఈ సందర్భంగా అధికారులు మంత్రికి వివరించారు. తాడేపల్లి రిటైనింగ్ వాల్, మంగళగిరి లక్ష్మి నరసింహస్వామి దేవాలయం అభివృద్ధి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ (Underground drainage system), జెమ్స్ అండ్ జ్యూయలరీ పార్క్, సాంఘిక సంక్షేమ వసతి గృహాలు, మోడ్రన్ లైబ్రరీ, పార్లు, స్మశాన వాటికలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణ పనులపైనా మంత్రి సమీక్షించారు. ఈ సమావేశంలో గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్షి 8, జాయింట్ కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా, దేవాదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్, జిల్లా పరిషత్ సీఈవో జ్యోతిబసు తదితరులు పాల్గొన్నారు.

నారా లోకేశ్ విద్యాబ్యాసం ఏమిటి?

నారా లోకేశ్ స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో మేనేజ్‌మెంట్ (MBA) చదువుకున్నారు. అంతకుముందు అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ పట్టా పొందారు.

నారా లోకేశ్ రాజకీయ ప్రస్థానం ఎప్పుడు ప్రారంభమైంది?

లోకేశ్ 2013లో అధికారికంగా తెలుగుదేశం పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనడం ప్రారంభించారు. 2017లో రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Vijayawada: తోతాపురి మామిడి రైతుకు భారీ ఊరట

Andhra Pradesh IT minister housing pattas distribution IT companies in Mangalagiri Mangalagiri Development Mangalagiri infrastructure Nara Lokesh non IT companies AP

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.