हिन्दी | Epaper
HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు

Lifestyle : తెగిపోతున్న ‘ తీగ’లు!

venkatesh
Lifestyle : తెగిపోతున్న ‘ తీగ’లు!

Lifestyle : ఈ ప్రపంచంలో మానవ జాతి సృష్టి ఎప్పుడు, ఎన్నివేల, లక్షల సంవత్సరాల క్రింద ఎక్కడ ఈ భూమిపై ఏ ప్రదేశంలో జరిగిందనే దానిపై భిన్నాభిప్రాయాలుండవచ్చు. అయితే మానవ జాతి సృష్టించబడిన తర్వాత దాని మనుగడ మాత్రం భిన్నప్రాంతాలలో విభిన్న రకాలుగా కొనసాగుతున్న వైనం బహిరంగ రహస్యమే.

ఈ నేపధ్యంలో భారతీయ వారసత్వం, సంస్కృతి మూలాలలోకి వెళ్లి చూసినప్పుడు వేదకాలపు సంస్కృతిలో భాగంగా తొలివేదమైన ఋగ్వేదంలో స్పష్టంగా విశదీకరించబడిన “మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిథిదేవోభవ” అనే సూక్తిలో నిర్వచనానికి అతీతమైన దైవమనే పదాన్ని ముందుగా తల్లికీ, తర్వాత తండ్రికీ, తదనంతరమే గురువులకూ, సమాజానికి అన్వయించిన వైనాన్ని పరిశీలించినప్పుడు ఆదర్శ సమాజ నిర్మాణం, ఓ ఆదర్శ కుటుంబ నిర్మాణంతోనే ప్రారంభమౌతుందనీ, ఆ ఆదర్శకుటుంబ నిర్మాణానికి ఊపిరులూదాల్సిన బాధ్యత నిస్సందేహంగా తల్లిదండ్రులదేననే సత్యాన్ని జీర్ణించుకోక తప్పదు.

నిజానికి ఈ బాధ్యతను నిర్వర్తించేక్రమంలో గర్భధారణ నిర్ధారణ జరిగిన మరుక్షణం నుండీ సుఖప్రసవం జరిగేవరకు కొనసాగే తొమ్మిది నెలలకాలంలో తల్లిగర్భంలోని ఆ గర్భస్థశిశువుల రక్షణ ప్రతి కుటుంబం తమ ఆరోగ్యప్రాణంగా భావిస్తోంది. ప్రతి ఇంట్లో ఓ మహాయజ్ఞంగా సాగే సదరు ప్రక్రియగా సురక్షితంగా, విజయవంతంగా పూర్తి చేయడానికి అవసరమైన సకల చర్యలను వారివారి ఆర్థిక శక్తిననుసరించి కుటుంబ సభ్యులు త్రికరణశుద్ధితో నిర్వర్తిస్తున్న వైనం తెలిసినదే గదా.

Lifestyle : నైతిక విలువల శిక్షణాకేంద్రాలుగా ఉమ్మడి కుటుంబాలు

ఆధునిక నాగరికత (Modern civilization) వెళ్లి విరిసే వరకు సమాజంలో కుటుంబాలన్ని ఉమ్మడి కుటుంబాలుగా కొనసాగేవి. ఆయా కుటుంబాల్లో చిన్నారులకు ఉగ్గుపాలతోనే అత్యున్నత మానవీయ విలువలను, వెలకట్టలేని మానవీయ సంబంధాలను, నేటి ఆధునిక సమాజంలో మానవ జాతి మనుగడ కోసం వాటిని పెంచి పోషించాల్సిన అవసరాన్ని, మనుషులు మంచి మనుషులుగా ఎదగడానికి అవసరమైన నైతిక విలువలతో కూడిన జీవన నైపుణ్యాలను పెంచి పోషించే శిక్షణాకేంద్రాలుగా వ్యవహరించేవి.

నిష్కల్మషమైన తల్లిదండ్రుల ప్రేమకు తోడుగా నానమ్మలు, అమ్మమ్మలు ఉగ్గుపాలతోనే “చందమామ రావే జాబిల్లి రావే” లాంటి జోల పాటల లాలనతో పాటు, తాతలు, పెద్దనాన్నలు, చిన్నాన్నల పోషణలో అల్లారు ముద్దుగా పెరిగేవారు. భారత మాజీ ప్రధాని స్వర్గీయ పి.వి.నరసింహరావు ప్రాథమిక విద్యాభ్యాసం నర్సంపేట తాలూకాలోని లకినేపల్లిలో వున్న వారి అమ్మమ్మ ఇంట్లోనే కొనసాగడం. అత్యంత ప్రేమానురాగాలతో పి.వి. గారిని వారి అమ్మమ్మ కుటుంబం ఆదరించి అక్కున చేర్చుకొని విద్యాభ్యాసం చేసే అవకాశాన్ని కలిగించడం ఆరోజుల్లో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పటిష్టస్థితికి ఓ బలమైన దృష్టాంతంగా భావించక తప్పదు.

ఓనమాలు దిద్దిన మరుక్షణం నుండే మంచీచెడుల గురించీ, చెడుపై మంచి సాధించిన అద్భుత విజయాల గురించీ, పురాణాలు, ఇతిహాసాలలోని గొప్పగొప్ప వ్యక్తుల జీవితచరిత్రలతోపాటు చందమామ, బొమ్మరిల్లు, బాలమిత్ర లాంటి కథల పుస్తకాలలో కథానాయకులు, నాయికలూ వారు సాధించిన అద్భుత విజయాల గురించి వివరిస్తూ పిల్లలను ఆదర్శవంతమైన జీవితాలవైపు ఆకర్షింపబడేలా చొరవ తీసుకునేవారు.

సంఖ్యాపరంగా కుటుంబంలో పిల్లల సంఖ్య ఎక్కువగా వున్న వారిలో కోరికల సంఖ్య చాలా తక్కువగానే వుండేది. అయితే ఉమ్మడి కుటుంబ సభ్యులు వారి కోరికలను సులభంగానే తీర్చగలిగేవారు. కాని ఇప్పుడు కాలం మారింది. ఉమ్మడి కుటుంబం చిన్నాభిన్నమైంది. కుటుంబ సభ్యుల సంఖ్యా పరిమితమైంది. అయినప్పటికీ ఆర్థిక వనరుల కొరత, ఆకాశమే హద్దుగా పెరుగుతున్న ధరల నేపధ్యంలో పరిమితసంఖ్యలో వున్నప్పటికీ పిల్లల గెంతెమ్మ కోరికలను తీర్చడం తల్లిదండ్రులకు దాదాపు అసాధ్యంగా మారుతోంది.

ప్రభుత్వ బడుల్లోనే ప్రామాణిక విద్యాబోధన!

Lifestyle : ఓ అరవై, డెబ్భై ఏళ్లక్రితం మెజారిటీ ప్రజలు వారి పిల్లలకు కుటుంబాలకు, కాలనీలకు చేరువగా వున్న ప్రభుత్వ పాఠశాలల్లోనే ప్రాథమిక, ప్రాథమికోన్నత, హైస్కూల్ విద్యాభ్యాసం చేయించేవారు. ప్రభుత్వ నియమాల ప్రకారం సదరు ప్రభుత్వ విద్యాసంస్థల్లో అర్హత, అనుభవం గల ఉపాధ్యాయులే విద్యాబోధన చేసేవారు. కాబట్టి ఆ తరం పిల్లలకు ఎంతో నాణ్యమైన విద్య లభ్యమయ్యేది.

సెమి రెసిడెన్షియల్ విధానంలో కొనసాగుతున్న పాఠశాలల నుండి సాయంత్రం వారి పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత వారు సేదదీరి అల్పాహారాన్ని భుజించిన తర్వాత తల్లిదండ్రులు తమ ఇంటి వసారాలో తమ పిల్లల చేత హోమ్వర్క్ చేయించే బాధ్యతను తప్పనిసరిగా నిర్వర్తించేవారు. ఇక రాత్రి నిద్రపుచ్చే సమయంలో పాఠ్యపుస్తకాలలోని నీతికథలపై చిన్నారుల సందేహాల్ని తీర్చేవారు.

ఇలా ప్రతి తల్లిదండ్రీ రోజు వారీ జీవితంలో వీలైనంత ఎక్కువకాలం తమ పిల్లలతో కాలం గడుపుతూ వారికి సరైన మార్గదర్శనం చేయడానికి ప్రయత్నం చేసేవారు. ఫలితంగా బాల్యం, శైశవ దశ నుండి యవ్వనం వైపు ఎదిగే తమ పిల్లల ప్రవర్తనను అడుగడుగునా పరిశీలిస్తూ, పర్యవేక్షిస్తూ ఎప్పుడైనా, ఎక్కడైనా తప్పడుగు వేసే ప్రమాదం వాటిల్లినప్పుడు సరైన సమయంలో సరిచేసే ప్రయత్నం చేసేవారు. వారితో పాటు ఉమ్మడి కుటుంబసభ్యుల నిఘా నీడలో కుటుంబంలోని పిల్లలంతా మంచి యువతీ, యువకులుగా మంచిపౌరులుగా రూపొందేవారు.

మరోవైపు ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యాభ్యాసాన్ని కొనసాగించిన విద్యార్థులే ఎనలేని నైపుణ్యాలతో అత్యున్నత విద్యాప్రమాణాలతో గొప్ప విద్యావంతులుగా మారడంతోపాటు వారి అర్హతలకు సరితూగే ఉద్యోగాలను సైతం పొందగలిగేవారు. ఈ తంతు అంతా ఇప్పుడో గతించిన చరిత్రలో మరిచిపోయిన భాగంగా మారిందని చెప్పకతప్పదు.

రెసిడెన్షియల్ బడుల్లోనే బాల్యం బందీగా మారుతోందా?

Lifestyle : సెమీ రెసిడెన్షియల్ విద్యాబోధన మెజారిటీ ప్రజలకు అందుబాటులో లేకపోవడం. సమకాలీన సమాజంలో మంచి విలువలతో కూడిన విద్యతోనే ఆదర్శసమాజ నిర్మాణం జరుగుతుందనే బుజువైన సత్యం ప్రాతిపదికన విద్య ప్రాధాన్యత రోజురోజూ పెరుగుతున్న నేపధ్యంలో సమాజంలో ప్రతి తల్లిదండ్రీ తమ పిల్లలకు నాణ్యతతో కూడిన విద్యను అందించాలని కలలు కనడమే కాకుండా వాటిని నిజం చేసుకోవడానికి కఠోరంగా శ్రమిస్తున్నారు.

అయితే ఆకాశాన్ని అంటుతున్న ధరల్లో, అరకొర జీతాలతో అనునిత్యం బతుకుపోరాటం చేస్తున్న తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తే గాని కుటుంబం నడవని పరిస్థితి. ఉదయం ఆరుగంటలలోపే నిద్ర లేచి ఇంటి పని, వంటపనీ పూర్తి చేసుకుని టిఫిన్ బాక్స్ తీసుకుని ఆఫీసు వెళ్లడానికి సిద్ధపడే తల్లిదండ్రులకు సెమి రెసిడెన్షియల్ విద్యావిధానంలో తమ పిల్లలకు విద్యాబోధన సౌకర్యాలను కల్పించే వెసులుబాటు లేదు.

ఉమ్మడి కుటుంబం విచ్ఛిన్నత నేపథ్యంలో నానమ్మలు, తాతలు ఉద్యోగం, సద్యోగం లేని పెద్దనాన్న, పెద్దమ్మలో చిన్నాన్నలో, చిన్నమ్మలో కుటుంబంలో పిల్లల విద్యావ్యాసంగాని పర్యవేక్షించే పరిస్థితులే లేవు. ఈ నేపధ్యంలో అన్ని తరగతులకు చెందిన తల్లిదండ్రులు అనివార్యంగా తమ పిల్లలను రెసిడెన్షియల్ విద్యవైపు మళ్లిస్తున్నారు.

బాగా డబ్బున్న వాళ్లు లక్షల రూపాయల ఫీజులతో తమ పిల్లలను కార్పొరేట్ విద్యాసంస్థల్లో చేర్పిస్తే, మధ్య తరగతులకు చెందిన తల్లిదండ్రులు తమ పిల్లల బంగారు భవిష్యత్ను కాంక్షిస్తూ అవసరమైతే తమ ఆస్తులను తెగనమ్మి కార్పొరేట్ పాఠశాలలో లేదా మోస్తరు ఫీజులతో బడ్జెట్ స్కూళ్లలో నైనా చేర్పించే ప్రయత్నాలు చేస్తుండడం గమనార్హం. ఇక మిగిలింది అట్టడుగు, బడుగు బలహీన వర్గాలకు చెందిన తల్లిదండ్రులే.

కాగా వారు కూడా తప్పనిసరి పరిస్థితులలో తమ పిల్లలను ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో, సంక్షేమ వసతి గృహాలలో చేర్పిస్తుండడం తెలిసినదే. ఈ నేపధ్యంలో మెజారిటీ తల్లిదండ్రులు తమ పిల్లలలపై వున్న గంపెడు ప్రేమను వంపుకుంటూ అనివార్యంగా పాఠశాల విద్యకోసం తమంతట తామే తమ పిల్లలకు దూరంగా వుండాల్సిన దురదృష్టకర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.

దాని ఫలితంగా బాల్యంలో, శైశవదశలో తమ పిల్లల్లో వచ్చే శారీరక, మానసిక మార్పులను ఎప్పటికప్పుడు పరిశీలించి, సరిచేసే అమూల్యమైన అవకాశాన్ని దూరం చేసుకోక తప్పడం లేదు. ఫలితంగా పిల్లల భవిష్యత్ కు బంగారు బాటలు వేయాల్సిన తరగతి గదులూ, హాస్టళ్ల మానసిక ఒత్తిళ్లతో పిల్లల జీవితాలను అంధకారం చేస్తున్నాయనే భావన సర్వత్ర వెల్లువెత్తుతోంది.

ర్యాంకుల వేటలో పిట్టల్లా రాలిపోతున్న విద్యార్థులు?

Lifestyle : నేటి సమాజంలో రెసిడెన్షియల్ విద్యావ్యవస్థ పనితీరుని గమనించినప్పుడు ఈ దేశానికి వెన్నెముకగా రూపాంతరం చెందాల్సిన విద్యార్థినీ, విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగంపై ఏ సంస్థా ఫోకస్ పెట్టడం లేదు. మత్తు చాక్లెట్ల పంపిణీ కూడా పాఠశాల్లో జరుగుతుందనే ఆరోపణలతో తల్లిదండ్రులు బేజారౌతున్నారు.

నిజానికి పక్కావ్యాపార కేంద్రాలుగా మారిన మెజారిటీ విద్యాసంస్థల్లో విద్యార్థుల మానసిక, శారీరక దృఢత్వాన్ని పెంపొందించే క్రీడా ప్రాంగణాలు, వసతులు, వినోద సదుపాయాలు లేవు. మెజారిటీ విద్యాసంస్థల్లో చదువులు తప్ప వేరే వ్యాపకమే లేదు.

ఈ క్రమంలో ఉదయం ఏ ఐదుగంటలకో ప్రారంభమయ్యే వారి స్టడీ షెడ్యూల్ రాత్రి పదిగంటల వరకూ కొనసాగుతుంది. పరీక్షలపై పరీక్షలు, విద్యార్థుల మధ్య తీవ్రమైన పోటీలో గెలిచేవారు వారు కొందరైతే ఓడే వారు అనేకమంది. పరీక్ష ఫలితాలకు సంబంధించి ఓవైపు వారి సబ్జెక్ట్ టీచర్లు, మరోవైపు విద్యాసంస్థల యాజమాన్యాలతో పాటు తల్లిదండ్రుల ఒత్తిళ్ల నేపధ్యంలో నిరాశ, నిస్పృహలతో పదులసంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

లక్షల రూపాయల ఫీజులతో మంచి చదువులను తమ పిల్లలకు అందించాలని ఆశించిన తల్లిదండ్రులకు కన్నబిడ్డలను కోల్పోయిన కడుపుకోతే మిగులుతోంది. నిజానికి విద్యాసంస్థల్లో ఇలాంటి అమానవీయ సంఘటనలు జరిగినప్పుడు సమగ్రన్యాయ విచారణ జరిపి పిల్లల ఆత్మహత్యలకు కారకులౌతున్న వ్యక్తులనూ, వ్యవస్థనూ కఠినంగా శిక్షించాలి. కాని దీనికి భిన్నంగా ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తుల ఒత్తిళ్లకు లోనై తూతూ మంత్రంగా విచారణ జరిపి నేరస్తులను తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారంటూ తల్లిదండ్రులతోపాటు, విపక్షపార్టీలు, పత్రికలూ, ప్రసార సాధనాలూ సైతం ఎలుగెత్తుండడం గమనార్హం.

అయినప్పటికీ ఇలాంటి సంఘటనలు పునరావృతమౌతున్న వైనం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు ఆధునిక యువతపట్ల కేన్సర్గా పరిణమిస్తున్న హెరాయిన్, కొకైన్, గంజాయిలాంటి మత్తుపదార్థాలను మెడికల్, ఇంజినీరింగ్, ఇతర వృత్తివిద్యా సంస్థల్లో విద్యార్థులు విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు.

దూరాన్ని పెంచుతున్న డాలర్ల వేట!

Lifestyle : తమ తమ కుటుంబాల ఆర్థిక పరిస్థితులను అనుసరించి కొంతమంది తల్లిదండ్రులు ఇంటర్మీడియట్ విద్య పూర్తయిన తర్వాత తమ పిల్లలను అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపడం జరుగుతుంది. మరికొంతమంది తల్లిదండ్రులు ఆస్తులను అమ్ముకొనైనా, లేదా అప్పులు చేసైనా సరే తమ పిల్లల అండర్ గ్రాడ్యుయేషన్ విద్యను దేశంలోనే పూర్తి చేయించి పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్య కోసం అమెరికా, ఇంగ్లండ్, కెనడా, జర్మనీ, రష్యా లాంటి దేశాలకు పంపడం గర్వంగా భావిస్తున్నారు.

ఐతే సదరు విదేశాలకు సంబంధించిన విదేశీ విద్యార్థులకు విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఉద్యోగాలను కల్పించే ప్రభుత్వ విధానాలననుసరించి కొంతమందికి ఉద్యోగాలు లభ్యమై రెండు చేతులా సంపాదిస్తూ ఆయా దేశాల శాశ్వత పౌరసత్వంతో అక్కడే స్థిరపడుతున్నారు. మరికొంత మంది విదేశాలలో సరైన ఉద్యోగం లభించక ఉపాధి కోసం మన దేశానికి తిరిగి వచ్చి ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి మహా నగరాల్లో ఉద్యోగాలను చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు.

ఐతే పై రెండు సందర్భాల్లోనూ యుక్త వయస్సు కొచ్చిన యువతీ యువకుల్లో మెజారిటీ స్వతంత్ర దృక్పథం పేరుతో తమ తల్లిదండ్రుల మాటని పెడచెవిన పెట్టి ప్రేమ వివాహాలకు పూనుకుంటూ తల్లిదండ్రులకు మానసిక క్షోభను కలిగిస్తుండడం బాధాకరం.

మరోవైపు మారుతున్న కాలమాన పరిస్థితులను బట్టి తమ పిల్లలు తీసుకుంటున్న నిర్ణయాలను అంగీకరించక తల్లిదండ్రుల్లో కొంతమంది వారి ఆత్మహత్యలకు కారకులైతే జీవన్మరణ పోరాటం చేయాల్సి వస్తుండడం గుండెల్ని పిండేస్తోంది. లక్షల రూపాయల జీతభత్యాలతో కోట్లకు పడగెత్తుతున్నవారు సైతం వృత్తి పరమైన ఒత్తిళ్లతో కుటుంబ పరంగా ఆశించిన ప్రేమానురాగాలు లభ్యంకాక ఒంటరితనంతో కుంగిపోతున్నారు.

ఇటీవల సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన బెంగళూరు మహానగరంలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి తాత్కాలిక ప్రాతిపదికన ఆటోడ్రైవర్గా మారి తాను అదనపు డబ్బుల కోసం కాకుండా కేవలం మానసిక ఒత్తిడి నుండి బయటపడడానికి ఈ పని చేస్తున్నానని చెప్పడం గమనార్హం.

ఉన్నత చదువులతో గొప్ప ఉద్యోగాలు చేస్తున్న పిల్లల్లో కొంతమంది దూరాభారాన్ని సైతం తోసిరాజంటూ వృద్ధాప్యంలో తమ తల్లిదండ్రులను తమ దగ్గరే వుంచుకుంటూ అవసరమైన సేవలను అందిస్తూ తమ కన్నతల్లిదండ్రుల పట్ల పిల్లలుగా తమ బాధ్యతను నిర్వర్తిస్తున్న వైనం ఆనందం కలిగిస్తోంది. మరికొంత మంది పిల్లలు దూరాభారం నేపధ్యంలో తల్లిదండ్రులను తమ దగ్గరే వుంచుకోవడం వీలుకాక ఓల్డేజ్ హోమ్స్ లలో వుంచుతున్నా వైనం హృదయాలను ద్రవింపజేస్తోంది.

కారణాలేవైనా ఒక రకంగా తల్లిదండ్రులు పాఠశాల విద్య కోసం తమ పిల్లలను బాల్యంలో తమ ప్రేమానురాగాలకు దూరంగా వుంచిన దానికి ప్రతిచర్యగా సదరు తల్లిదండ్రులు తమ జీవన అవసాన దశలో తమ పిల్లల ఆప్యాయత, అనురాగాలకు దూరమౌతున్నారేమోనని తాత్విక భావన సర్వత్రా వెల్లువెత్తుతోంది.

సాంకేతిక పరిజ్ఞానమే సామాజిక విధ్వంసానికి కారణమౌతోందా?
Lifestyle : ఆధునిక యుగంలో పలకా బలపాలకు కాలం చెల్లిపోయింది. వినోదం కోసం తోలుబొమ్మలాటలకూ, వీధి నాటకాలకూ ఆస్కారమే లేని రోజులివి. సినిమాల కోసం థియేటర్ల వరకూ వెళ్లాల్సిన అవసరమే లేదు. సాంకేతికతలో కృత్రిమ మేధస్సు వినియోగం విరివిగా పెరిగిన నేపథ్యంలో నూట నలభై కోట్లపై చిలుకు భారతీయుల్లో తొంభై కోట్ల మంది ఆండ్రాయిడ్ ఫోన్లను ఉపయోగిస్తున్న వెనం బహిరంగ రహస్యమే. మొబైల్ ఫోన్లు, ట్యాబ్లూ, కంప్యూటర్లూ, ల్యాప్టాప్లూ ఊహించని రీతిలో జనజీవనాన్ని ప్రభావితం చేస్తున్నాయనే సత్యాన్ని జీర్ణించుకోక తప్పదు. నిజానికి తొలినాళ్లల్లో అధిక పెట్టుబడి నేపథ్యంలో దేశంలో పిడికెడు మంది ధనవంతులు స్టేటస్ సింబల్గా వారి హస్త భూషణాలుగా కొనసాగిన మొబైల్ ఫోన్లు కాలగమనంలో ధీరూబాయ్ అంబానీకర్లో దునియా ముట్టీ మే జియో ఆఫర్ తర్వాత ఈరోజు అవే సెల్ఫోన్లు జీవితావసరాలుగా మారిన వైనం దిగ్భ్రాంతిని కలిగిస్తోంది.

Lifestyle : సంపన్న వర్గాల నుండి సామాన్యుల వరకు ప్రతి ఇంటా సెల్ఫోన్ల సందడి అంతా ఇంతా కాదు. తల్లిదండ్రులు పిల్లలకు ఉగ్గుపాలనందించే క్రమంలో చందమామ రావే జాబిల్లి రావేకి స్వస్తి చెప్పి మొబైల్ ఫోన్ల తోడ్పాటుతో వారికి ఉగ్గుపాలను అందిస్తోన్న నేపథ్యంలో మొబైల్ ఫోన్ల వినియోగానికి పిల్లలు బాల్యం నుండే అడిక్ట్ అవడానికి వారి తల్లిదండ్రులే కారణంగా మారుతున్నారు. కరోనా కాలంలో విద్యాసంస్థల్లో అనివార్యంగా ప్రవేశపెట్టిన ఆన్లైన్ క్లాసులు, జూమ్ మీటింగ్ల నేపథ్యంలో సెల్ఫోన్ల వాడకం ఊహకందని స్థాయికి ఎదిగిన మాట వాస్తవం. కాగా ఫైవ్ జి వేగంతో ఇంటర్నెట్ సౌకర్యంతో సెల్ఫోన్ల వినియోగదారులను వరదలా ముంచెత్తుతున్న సమాచారంలో ఏది మంచిదో, ఏది చెడో తెలియక మెజారిటీ ఇంటర్నెట్ వినియోగదారులు చెడు సమాచారం ఊబిలో చిక్కుకుని విలవిల్లాడుతున్న వెనం ఆందోళన కలిగిస్తోంది.

ఇంటిల్లిపాదినీ ఏకాకులను చేస్తున్న సెల్ఫోన్లు!? ఆధునిక సమాజంలో ఇంట్లో ప్రతి కుటుంబ సభ్యుడికో మొబైల్ ఫోన్ అత్యవసర వస్తువుగా మారింది. తమ కుటుంబ బాగోగులు గురించి భార్యాభర్తలు రోజూ ఓ గంటో రెండు గంటలో ఎదురెదురుగా కూర్చుని మాట్లాడుకునే సందర్భాలు సైతం అరుదుగా మారుతున్నాయి. మొబైల్ ఫోన్ల కోసం మారాం చేస్తూ తల్లిదండ్రులు కొనివ్వకపోతే పిల్లలు ఆత్మహత్యలకు పూనుకుంటున్న వైనం ఒకవైపు, మరికొన్ని సందర్భాల్లో సదరు సెల్ఫోన్ల కోసం పిల్లలే తల్లిదండ్రులను హత్య చేస్తున్న వైనంతో మానవ సంబంధాలు మంట గలుపుతున్నాయి.

తల్లిదండ్రులను పట్టించుకోని పిల్లలు విదేశీవిద్య, ఉపాధి పెరిగిపోవడంతో పిల్లలు తమ తల్లిదండ్రుల ఆలనాపాలనను పట్టించుకోవడం లేదు. కొందరు పిల్లలు తమ తల్లిదండ్రుల అవసానదశలో వారిని వృద్ధాశ్రమాల్లో ఉంచుతూ, ఆశ్రమ ఫీజులను చెల్లిస్తున్నారు. డబ్బుతో వారికి అన్ని సౌకర్యాలను సమకూరుస్తున్నాం అనుకుంటున్నారే తప్ప తమ అనురాగం, ఆప్యాయతలు దగ్గర ఉండి అందించాలనే ఆలోచన రావడం లేదు. టైమ్కు తిన్నావా, బీపీ, షుగర్ మందులను వేసుకున్నావా? అని అడిగే ఆత్మీయులు లేక తల్లిదండ్రులు నిరాశనిర్వేదంలో జీవిస్తున్నారు. పక్కన ఉండి ఆదరించాల్సిన పిల్లలు దూరప్రాంతాల్లో వారివారి వృత్తుల్లో నిమగ్నమైపోతున్నారు. ఇక ఇద్దరు ముగ్గురు కొడుకులు వుంటే తల్లిదండ్రులను రెండుమూడునెలలకు ఒక్కొక్కరి చొప్పున వంతులు వేసుకుని, మరి వారిని చూసుకుంటున్నారు.(Lifestyle)

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870