సన్‌టీవీ ఛైర్మన్ కళానిధి మారన్(Kalanithi Maran), మరో ఏడుగురికి ఆయన సోదరుడు, కేంద్ర మాజీ మంత్రి, డీఎమ్‌కే ఎంపీ అయిన దయానిధి మారన్ లీగల్ నోటీసులు పంపారు. దీంతో కుటుంబ వివాదం రచ్చకెక్కినట్లయింది. మనీలాండరింగ్ సహా పలు మోసపూరిత వ్యవహారాలను కళానిధి మారన్ (Kalanithi Maran) నడిపారని ఆ నోటీసుల్లో ఆరోపించారు.
కంపెనీలో వాటాల వివాదం
కంపెనీలో వాటాల తీరును 2003 నాటి స్థితికి మార్చాలని డిమాండ్ చేశారు. దయానిధి మారన్ (Dayanidhi Maran) తరఫు లాయరు కె. సురేశ్ ఈనెల జూన్ 10న ఈ నోటీసులను పంపినట్లు వెల్లడించాయి. కళానిధి మారన్(Kalanithi Maran)తో పాటు ఆయన భార్య కావేరి మారన్‌కూ నోటీసులు అందాయి. మనీలాండరింగ్ వంటి
తీవ్ర నేరాలకు పాల్పడినందున, తీవ్ర నేరాల దర్యాప్తు కార్యాలయం (ఎస్‌ఎఫ్‌ఐఓ) చర్యలు తీసుకోవాలిన ప్రభుత్వాన్ని దయానిధి మారన్ కోరనున్నట్లు ఆ నోటీసుల్లో ఉంది. ఇది ‘వ్యక్తిగత విషయం’ కాబట్టి, సన్‌టీవీ నిర్వహణపై ప్రభావం పడదని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.
కంపెనీపై ప్రభావం ఉండదా?
నోటీసుల్లో కళానిధి మారన్‌పై పలు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా మనీలాండరింగ్, మోసపూరిత ఆర్థిక కార్యకలాపాల్లో పాల్పడినట్లు పేర్కొన్నారు. దీనిపై తీవ్ర నేరాల దర్యాప్తు కార్యాలయం (SFIO) జోక్యం చేసుకోవాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు నోటీసులో ఉంది. ఈ వివాదం వ్యక్తిగతం కావడంతో, సన్‌టీవీ నిర్వహణపై ప్రభావం ఉండదని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. అయినా, దీని ప్రభావాన్ని సమకాలీన మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా గమనించాల్సి ఉంటుంది.
Read Also: Microsoft : మైక్రోసాఫ్ట్‌లో మళ్లీ ఉద్యోగుల కోతలు..